...
...
Next Story

బ్రహ్మముడి నవంబర్ 18 ఎపిసోడ్: సుభాష్, అపర్ణ పెళ్లి చూపులు.. కావ్య సర్‌ప్రైజ్.. రాహుల్ బుట్టలో పడిపోయిన రాజ్

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (నవంబర్ 18) ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రాహుల్ నాటకానికి ఇంట్లో వాళ్లందరూ అతని బుట్టలో పడిపోతారు. అటు సుభాష్, అపర్ణ పెళ్లి రోజున కావ్య ఇచ్చిన సర్‌ప్రైజ్ ఆకట్టుకుంటుంది.

Published on: Nov 18, 2025, 07:05:43 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 881వ ఎపిసోడ్ లో రాహుల్ తన పర్ఫార్మెన్స్ తో అదరగొడతాడు. దీంతో రాజ్ సహా ఇంట్లో వాళ్లందరూ అతని బుట్టలో పడిపోతారు. రుద్రాణి ఈ నాటకానికి మరింత ఆజ్యం పోస్తుంది. కావ్య కూడా అతనికి మద్దతుగా నిలవడంతో ఇక రాహుల్ కు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించడానికి రాజ్ సిద్ధమవుతాడు.

ఇంట్లొ వాళ్లకు క్లాస్ పీకిన స్వప్న, రుద్రాణి..

బ్రహ్మముడి నవంబర్ 18 ఎపిసోడ్: సుభాష్, అపర్ణ పెళ్లి చూపులు.. కావ్య సర్‌ప్రైజ్.. రాహుల్ బుట్టలో పడిపోయిన రాజ్
బ్రహ్మముడి నవంబర్ 18 ఎపిసోడ్: సుభాష్, అపర్ణ పెళ్లి చూపులు.. కావ్య సర్‌ప్రైజ్.. రాహుల్ బుట్టలో పడిపోయిన రాజ్

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (నవంబర్ 18) ఎపిసోడ్ రాహుల్ గురించి స్వప్న ఎమోషనలై ఇంట్లో వాళ్లకు క్లాస్ పీకే సీన్ తో మొదలవుతుంది. రాహుల్ ఆ డబ్బు కోసం తన ప్రాణాలకు తెగిస్తే మీరందరూ అతన్ని అవమానించారని, అసలు ఇప్పటికీ అతన్ని నమ్మడం లేదని స్వప్న అందరినీ నిందిస్తుంది.

అటు రుద్రాణి ఆమెకు జత కలుస్తుంది. వాడు నా కొడుకు అయిన నేరానికి ఇంత దారుణంగా అవమానించాలా అని వాళ్లను నిలదీస్తుంది. దీంతో రాహుల్ రంగంలోకి దిగి వాళ్లు అలా అవమానించడంలో తప్పు లేదని, తన గతం అలాంటిది అని రాహుల్ మళ్లీ నాటకమాడతాడు.

కాంట్రాక్ట్ మిస్ కాలేదన్న రాజ్

అయితే ధాన్యలక్ష్మి, అపర్ణ మాత్రం డబ్బు తెచ్చినా అతని అజాగ్రత్త వల్ల కాంట్రాక్ట్ మిస్ అయింది కదా అని అంటారు. కానీ రాజ్ మాత్రం కాంట్రాక్ట్ మిస్ కాలేదని, తమకే దక్కిందని చెబుతాడు. తాను ఏ పని చేసినా రెండు ప్లాన్స్ ఉంటాయని, అందుకే తాను ఈసారి ప్లాన్ బీని అమలు చేశానంటాడు. బాబాయికి ఫోన్ చేసినప్పుడు రాహుల్ రాలేదని చెప్పడంతో తాను మరో విధంగా ఆ రూ.20 లక్షలు పంపించానని, దీంతో ఆ కాంట్రాక్ట్ మనకే దక్కిందని రాజ్ చెప్పడంతో ఇంట్లో వాళ్లందరూ ఊపిరి పీల్చుకుంటారు.

స్వప్న దగ్గర డోసు పెంచిన రాహుల్

అందుకే ప్రాణాలకు తెగించి ఆ డబ్బును కాపాడుకున్నానని చెబుతాడు. నీకైమైనా జరిగితే నా పరిస్థితి, మన పాప పరిస్థితి ఏమవుతుందో ఆలోచించావా అని స్వప్న ఎమోషనల్ అవుతుంది. నీ నిజాయతీని ఇక ఎవరి దగ్గరా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, తాను నమ్ముతున్నానని అంటుంది.

రాహుల్‌ను నమ్మని రాజ్, వెనకేసుకొచ్చిన కావ్య

ఇటు రాజ్, కావ్య బెడ్ రూమ్ లో రాహుల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. రాహుల్ ను కావ్య వెనకేసుకొచ్చినా.. రాజ్ మాత్రం నమ్మడు. అతడు ఏం చేశాడని, పోయిన డబ్బును తీసుకొచ్చాడు.. ఒకవేళ టెండర్ మిస్ అయి ఉంటే అని రాజ్ అంటాడు. మీ నమ్మకాన్ని నిలబెట్టాడు కదా అని కావ్య అంటే.. అది నీ నమ్మకం అని రాజ్ అంటాడు.

ఓ మారిన మనిషిని అయిన వాళ్లు అనుమానించకూడదని, రాహుల్ పూర్తిగా మారిపోయినట్లుగా కనిపిస్తున్నాడని, అతనికి ఏదైనా బాధ్యత అప్పగించమని కోరుతుంది. తన అక్క స్వప్న కోసం ఈ పని చేయాలని రాజ్ ను వేడుకుంటుంది. దీంతో అతడు సరే అంటాడు.

రాహుల్, రుద్రాణి కలిసి మరో నాటకం

అటు రుద్రాణి కూడా రాహుల్ గాయాలు చూసి తెగ బాధపడిపోతూ ఉంటుంది. దీంతో అతడు జరిగిన విషయం చెబుతాడు. డబ్బు పోవడం, దొంగలు కొట్టుకెళ్లడం నిజం కానీ ఆ దొంగలు తన మనషులు అని రాహుల్ చెబుతాడు. ఇదంతా చేసే బదులు రాజ్ చెప్పినట్లు ఆ డబ్బేదో అక్కడ ఇచ్చేస్తే సరిపోయేది కదా అని రుద్రాణి అంటుంది. అలా చేస్తే రాజ్ పనివాడిగా మిగిలిపోతానని, అలా కాకుండా ఇలా డబ్బును ప్రాణాలకు తెగించి కాపాడితే తాను మారిపోయినట్లు నమ్ముతారని రాహుల్ అంటాడు.

ఇలా తాను మెల్లగా అందలం ఎక్కుతానని, దీనికి నీ సాయం కూడా కావాలని అడుగుతాడు. తాను ఏం చేయడానికైనా రెడీ అంటుంది. ఇంట్లో అందరూ భోజనానికి కూర్చోగా.. రాహుల్ రాడు. ఇంత జరిగాక అతనికి అన్నం ఎలా సహిస్తుంది అని రుద్రాణి అంటుంది. దీంతో ధాన్యం, ప్రకాశం రుద్రాణికి క్లాస్ పీకుతారు. అతని గతం అలాంటిదని అంటారు. దీంతో రాజ్ జోక్యం చేసుకొని రాహుల్ ను పిలిపిస్తాడు. నీతో మాట్లాడాలి.. నీది, నీ భార్యా బిడ్డల భవిష్యత్తు గురించి మాట్లాడాలని చెబుతాడు.

సుభాష్, అపర్ణ పెళ్లి రోజు

ఇటు సుభాష్, అపర్ణ పెళ్లి రోజు కోసం ఇంట్లో వాళ్లు రెడీ అవుతారు. రాజ్ వాళ్లకు కొత్త బట్టలు తీసుకొస్తాడు. అప్పట్లో మీ పెళ్లి చూపులు జరగలేదని మీరు ఫీలయ్యారట కదా.. అందుకే ఇప్పుడా ముచ్చట తీరుస్తామని కావ్య అంటుంది. ఇప్పుడు అత్తయ్య, మామయ్య పెళ్లి చూపులు జరుగుతాయని, తాను అత్తయ్యను రెడీ చేస్తానని అనడంతో ఆమె సిగ్గు పడుతుంది. అంతటితో బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks