...
...
Next Story

BTS: ప్రపంచాన్ని షేక్ చేస్తున్న బీటీఎస్- తొలిరోజే 39 లక్షల ఆల్బమ్స్ సేల్-ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ లైవ్ కాన్సర్ట్-ఎప్పుడు?

BTS: బీటీఎస్ 'Arirang' ఆల్బమ్ మొదటి రోజే 3.98 మిలియన్ కాపీలు అమ్ముడై సరికొత్త వరల్డ్ రికార్డ్ సృష్టించింది. 90 దేశాల్లో టాప్ చార్టుల్లో ఉన్న 'స్విమ్' సాంగ్, ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ లైవ్ కాన్సర్ట్ టైమ్ వివరాలు ఇక్కడ చూడండి.

Published on: Mar 21, 2026, 14:17:16 IST
Advertisement

గ్లోబల్ మ్యూజిక్ ఐకాన్స్ (బీటీఎస్) BTS మరోసారి చరిత్ర సృష్టించారు. దాదాపు నాలుగు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఏడుగురు సభ్యులు కలిసి తమ ఐదవ పూర్తి స్థాయి ఆల్బమ్ ‘అరిరాంగ్’ (Arirang)తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. హైబ్ యాజమాన్యంలోని బిగ్ హిట్ మ్యూజిక్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఆల్బమ్ విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 3.98 మిలియన్ (39.8 లక్షలు) కాపీలు అమ్ముడయ్యాయి.

బీటీఎస్ క్రేజ్

బీటీఎస్ టీమ్
బీటీఎస్ టీమ్

బీటీఎస్ మ్యూజిక్ కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఇప్పుడు నాలుగేళ్ల బ్రేక్ తర్వాత బీటీఎస్ గ్రూప్ కలిసి క్రియేట్ చేసిన అరిరాంగ్ ఆల్బమ్ మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేస్తోంది. ఇది కేవలం కె-పాప్ (K-Pop) చరిత్రలోనే కాదు, గ్లోబల్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిందని చెప్పొచ్చు. గతంలో బీటీఎస్ వాళ్లదే అయిన 'Map of the Soul: 7' వారంలో సాధించిన 3.37 మిలియన్ల రికార్డును అరిరాంగ్ ఒకే రోజులో బ్రేక్ చేసింది.

ప్రపంచ దేశాల్లో చార్టుల వేట!

'Arirang' ఆల్బమ్ కేవలం కొరియాలోనే కాదు, ఇటలీ, మెక్సికో, స్వీడన్ వంటి 88 దేశాల్లో ఐట్యూన్స్ టాప్ ఆల్బమ్స్ చార్టుల్లో అగ్రస్థానంలో నిలిచింది. ముఖ్యంగా ఇందులోని లీడ్ ట్రాక్ 'స్విమ్' (Swim) అమెరికా, యూకే, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ సహా 90 దేశాల్లో తన జెండా పాతేసింది.

ట్రెండింగ్ లో

దక్షిణ కొరియాలోని మెలోన్, బగ్స్ వంటి రియల్ టైమ్ చార్టులలో స్విమ్ పాట గంటల వ్యవధిలోనే నంబర్ 1 స్థానానికి చేరుకుంది. 'స్విమ్' మ్యూజిక్ వీడియో.. ఆకట్టుకునే విజువల్స్, హై-ఎనర్జీ కొరియోగ్రఫీతో యూట్యూబ్‌లో 70 దేశాల్లో ట్రెండింగ్‌లో ఉంది. బాంగ్ సి-హ్యుక్ మార్గదర్శకత్వంలో రూపొందిన ఈ ఆల్బమ్, జీవితంలోని అడ్డంకులను ఎదుర్కొంటూ పట్టుదలతో ముందుకు సాగాలనే సందేశాన్ని ఇస్తుంది.

భారతదేశంలో లైవ్ ఎప్పుడు?

మన భారతీయ కాలమానం ప్రకారం, నేడు (మార్చి 21, 2026) సాయంత్రం 4:30 గంటలకు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ కాన్సర్ట్ ను లైవ్‌లో చూడవచ్చు. ఈ చరిత్రాత్మక ప్రదర్శనలో 'స్విమ్' తో పాటు ఆల్బమ్‌లోని ఇతర హిట్ సాంగ్స్‌కు టీమ్ లైవ్ డ్యాన్స్‌తో అదరగొట్టనుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks