...
...
Next Story

Chiranjeevi: అతనే న్యూ మెగాస్టార్.. నేనే వెనక్కి వెళ్లిపోతా-అప్పటివరకూ నటిస్తా-పుత్రోత్సాహంతో చిరంజీవి కామెంట్లు వైరల్

Chiranjeevi: తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ అంటే చిరంజీవే. టాలీవుడ్ లో ఆయన ఇంపాక్ట్ అలాంటిది. కానీ ఇప్పుడు చిరంజీవే స్వయంగా మరో న్యూ ఏజ్ మెగాస్టార్ వచ్చాడని పేర్కొన్నారు. ఇక వెనకాల ఉండటమే సబబు అని అంటున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.

Updated on: Jun 24, 2026, 06:12:41 IST
Advertisement

Chiranjeevi: తన వారసుడు రామ్ చరణ్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించేశారు. టాలీవుడ్ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ మార్కెట్ స్టామినాను సరికొత్త స్థాయికి తీసుకెళ్లింది ‘పెద్ది’. 'రంగస్థలం' లాంటి ఇండస్ట్రీ క్లాసిక్ తర్వాత చరణ్ మళ్లీ ఆ స్థాయి పవర్‌ఫుల్ పీరియాడిక్ ఎమోషనల్ క్యారెక్టర్‌లో లీనమైపోవడం, దానికి థియేటర్లలో ఆడియన్స్ బ్రహ్మరథం పట్టడంతో చిరంజీవి ‘పుత్రోత్సాహం’ పీక్స్‌కు చేరింది.

పెద్ది మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్

చిరంజీవి ఎమోషనల్ కామెంట్లు (youtube)
చిరంజీవి ఎమోషనల్ కామెంట్లు (youtube)

రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది సూపర్ హిట్ కావడంతో మంగళవారం (జూన్ 23) రాత్రి మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన చిరంజీవి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. సినిమా కోసం కొడుకు రామ్ చరణ్ పడ్డ కష్టం గురించి మాట్లాడారు.

పెద్ది మాత్రమే కనిపించాడు

పెద్ది చిత్రంపై చిరంజీవి స్పందిస్తూ.. "ఈ సినిమాలో నాకు ఎక్కడా నా కొడుకు చరణ్ కనిపించలేదు. కేవలం ఆ గిరిజన నాయకుడు పెద్ది పాత్ర మాత్రమే కనిపించింది. అంతలా చరణ్ ఆ క్యారెక్టర్‌లో జీవించేశాడు. అతని నటనకు జాతీయ అవార్డు వస్తుందంటున్నారు" చిరంజీవి అని కొనియాడారు. మట్టిలో నుంచి బుచ్చిబాబు లాంటి వజ్రాలను పరిశ్రమకు పరిచయం చేస్తున్న డైరెక్టర్ సుకుమార్‌ను ఈ వేదికపై చిరు ‘గురువు’ అని సంబోధించడం విశేషం.

న్యూ ఏజ్ మెగాస్టార్

ఇటీవల ఢిల్లీలో ప్రధానితో ఒక ఈవెంట్ లో చరణ్‌ను ‘న్యూ ఏజ్ మెగాస్టార్’గా అభివర్ణించడాన్ని ప్రస్తావిస్తూ.. "నా పిల్లలు నన్ను మించి ఎదిగినప్పుడు వచ్చే ఆనందమే వేరు. చరణ్ ను న్యూ ఏజ్ మెగాస్టార్ అంటున్నారు. ఇక కొడుకును ముందుంచి, నేను వెనుకాల ఉండటం సబబు. పెద్ది సినిమాలో చరణ్ నటన చూసి వంద శాతం పుత్రోత్సాహం ఫీల్ అవతున్నా. అయినా నటన కొనసాగిస్తా. నా చివరి శ్వాస వరకు నేను నటిస్తూనే ఉంటాను" అని చిరు మెగా ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పించారు.

చరణ్ కంటి గాయం

1983లో చిరంజీవి నటించిన ‘గూండా’ సినిమా షూటింగ్ సమయంలో నడుస్తున్న రైలుపై వేలాడుతూ ఒక ప్రమాదకరమైన స్టంట్ చేశారు చిరు. అప్పుడు ఆయన తండ్రి వెంకట్రావు తీవ్రంగా ఆందోళన చెంది, ‘నీకు ఒక కొడుకు పుట్టి వాడు ఇలాంటి రిస్క్‌లు తీసుకున్నప్పుడే తండ్రి పడే బాధ ఏంటో నీకు అర్థమవుతుంది’ అని హెచ్చరించారట. సరిగ్గా ‘పెద్ది’ సెట్స్‌లో చరణ్ గాయపడినప్పుడు తన తండ్రి అన్న మాటలు గుర్తొచ్చి కంటతడి పెట్టానని చిరంజీవి చెప్పడం సక్సెస్ మీట్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks