Chennai Love Story 1st Day Worldwide Box Office Collection: 'కః', 'కే ర్యాంప్' చిత్రాల విజయాల తర్వాత యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా వచ్చిన తాజా చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ'. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా తొలిరోజే థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుని సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తోంది.
జన నాయగన్‌తో పోటీ

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన 'జన నాయగన్' వంటి భారీ చిత్రం పోటీలో ఉన్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో 'చెన్నై లవ్ స్టోరీ' సాధిస్తున్న ఆక్యుపెన్సీ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. సినిమా మేకర్స్ ముందుగానే నిర్వహించిన పెయిడ్ ప్రీమియర్లకు మంచి ఆదరణ దక్కడం ఈ చిత్రానికి కలసివచ్చింది.
అనాథగా పెరిగి, సినిమా దర్శకుడు కావాలని కలలుకనే ఓ యువకుడు.. పెళ్లి ఆగిపోయిన బాధ నుంచి కోలుకుంటూ జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలనుకునే ఓ యువతి.. వీరిద్దరి మధ్య సాగే ఎమోషనల్ ప్రయాణమే ఈ చిత్ర మూలకథ. ఈ కథ నేటి యూత్‌కు బాగా కనెక్ట్ కావడంతో థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది.
కలెక్షన్ల సునామీ.. కిరణ్ కెరీర్‌లోనే రికార్డు ఓపెనింగ్స్
విడుదలైన తొలిరోజే 'చెన్నై లవ్ స్టోరీ' ప్రపంచవ్యాప్తంగా రూ. 7.56 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ప్రముఖ ట్రేడ్ పోర్టల్ నివేదిక ప్రకారం, భారతదేశ వ్యాప్తంగా మొదటి రోజు చెన్నై లవ్ స్టోరీ సినిమా రూ. 4.40 కోట్ల నెట్ (సుమారు రూ. 5 కోట్ల గ్రాస్) వసూలైంది. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో దాదాపు రూ. 2.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ ఓపెనింగ్‌గా నిలిచింది.
బిజినెస్ లెక్కలు.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
ఈ చిత్రాన్ని సుమారు రూ. 15 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా, థియేట్రికల్ బిజినెస్ విలువ రూ. 23 కోట్లుగా జరిగింది. చిత్ర నిర్మాతలు నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారానే పెట్టిన పెట్టుబడిలో ఎక్కువ భాగాన్ని రాబట్టుకున్నారు. ఓటీటీ (OTT) హక్కుల ద్వారా రూ. 4 కోట్లు, ఆడియో హక్కుల ద్వారా రూ. 5 కోట్లు సమకూరినట్లు సమాచారం.
{{/usCountry}}ఈ చిత్రాన్ని సుమారు రూ. 15 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా, థియేట్రికల్ బిజినెస్ విలువ రూ. 23 కోట్లుగా జరిగింది. చిత్ర నిర్మాతలు నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారానే పెట్టిన పెట్టుబడిలో ఎక్కువ భాగాన్ని రాబట్టుకున్నారు. ఓటీటీ (OTT) హక్కుల ద్వారా రూ. 4 కోట్లు, ఆడియో హక్కుల ద్వారా రూ. 5 కోట్లు సమకూరినట్లు సమాచారం.
{{/usCountry}}ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఈ సినిమా థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి అడుగుపెట్టాలంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 45 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. వీకెండ్ కావడం, సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ టార్గెట్‌ను సులువుగానే చేరుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
యాక్టింగ్, టెక్నికల్ వేల్యూస్ అద్భుతం
ఎస్ కే ఎన్, సాయి రాజేష్ నిర్మాతలుగా వ్యవహరించిన చెన్నై లవ్ స్టోరీ చిత్రానికి సాయి రాజేష్ అందించిన కథ ప్రధాన బలంగా నిలిచింది. హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని సినీ ప్రియులు మెచ్చుకుంటున్నారు. ముఖ్యమైన పాత్రలో త్రిగుణ్ ఆకట్టుకున్నారు.
"చెన్నై లవ్ స్టోరీ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన కృతజ్ఞతలు తెలిపారు.