...
...
Next Story

చైల్డ్ ఆర్టిస్ట్ మహేంద్రన్ హీరోగా నీలకంఠ- హీరోలతో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్- వాళ్లు లేకుండా షూటింగ్ జరగలేదంటూ!

చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ మహేంద్రన్ హీరోగా తెరకెక్కిన సినిమా నీలకంఠ. రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించిన నీలకంఠ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఆది సాయి కుమార్, ఆకాష్ జగన్నాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో మహేంద్రన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Published on: Dec 31, 2025, 21:33:51 IST
Advertisement

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాల నటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా చేస్తున్న సినిమా "నీలకంఠ". ఈ చిత్రాన్ని శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో

చైల్డ్ ఆర్టిస్ట్ మహేంద్రన్ హీరోగా నీలకంఠ- హీరోలతో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్- వాళ్లు లేకుండా షూటింగ్ జరగలేదంటూ!
చైల్డ్ ఆర్టిస్ట్ మహేంద్రన్ హీరోగా నీలకంఠ- హీరోలతో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్- వాళ్లు లేకుండా షూటింగ్ జరగలేదంటూ!

రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించిన నీలకంఠ సినిమాలో నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్‌గా చేశారు. "నీలకంఠ" సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

ఈ నేపథ్యంలో మంగళవారం (డిసెంబర్ 30) సాయంత్రం నీలకంఠ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. యంగ్ హీరోలు ఆది సాయి కుమార్, ఆకాష్ జగన్నాథ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో హీరో మహేంద్రన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

గర్వపడే హిట్

హీరో మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ.. "తెలుగు ఆడియెన్స్ నాకు ఇస్తున్న సపోర్ట్ మర్చిపోలేను. ఆది నాకు మంచి ఫ్రెండ్. శంబాల హిట్‌తో సాయి కుమార్ గారు గర్వపడేలా విజయాన్ని అందుకున్నారు. ఆకాష్ ఈ ఈవెంట్‌కు రావడం హ్యాపీగా ఉంది" అని అన్నాడు.

"నాకు సినిమానే ప్రపంచం. చాలా పోటీ ఉంది, కొత్త హీరోలు వస్తున్నారు అని నాతో సన్నిహితులు చెబుతుంటారు. కానీ, నేను నా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయాలి అనేది ఒక్కటే నాకు తెలిసింది" అని చైల్డ్ ఆర్టిస్ట్ మహేంద్రన్ తెలిపాడు.

షూటింగ్ జరగలేదు

డైరెక్టర్ రాకేష్ మాధవన్ మాట్లాడుతూ.. "కొత్త దర్శకుడిని అయినా నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ శ్రీనివాసులు, వేణుగోపాల్ గారికి థ్యాంక్స్. వాళ్లు నాతో సినిమా చేస్తానని చెప్పిన ఒక్క మాటను నిలబెట్టుకుంటూ భారీ బడ్డెట్‌తో సినిమా చేశారు" అని అన్నారు.

క్యారెక్టర్స్‌లో నటించారు

"మాస్టర్ మహేంద్రన్ ఒక బ్రదర్‌లా సపోర్ట్ చేశాడు. నేను ఇమాజిన్ చేసుకున్న సీత క్యారెక్టర్‌కు యష్న పర్పెక్ట్‌గా కుదిరింది. యాటసిరి, కోట, నాయుడుపేట అనే మూడు ఊర్లలో ఈ సినిమా షూటింగ్ చేశాం. అక్కడి స్థానిక ప్రజలు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ మూవీలో కొన్ని క్యారెక్టర్స్‌లో నటించారు" అని డైరెక్టర్ రాకేష్ మాధవన్ తెలిపారు.

"ఇదొక గెలిచిన వ్యక్తి కథ. సినిమా చూస్తున్నప్పుడు ఆ గెలుపు మీది అనుకుంటారు. మా మూవీలో యాక్షన్, లవ్, ఎమోషన్ వంటి ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. కమర్షియల్‌గా ఉంటూనే విద్య ఎంత ముఖ్యం అనే మంచి విషయాన్ని చెప్పాం. ఈ సినిమా మా అందరికీ పేరు తీసుకొస్తుంది" అని నీలకంఠ దర్శకుడు రాకేష్ మాధవన్ పేర్కొన్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks