తెలుగులో రొమాంటిక్ లవ్ స్టోరీగా వస్తోన్న లేటెస్ట్ మూవీ ఇట్స్ ఓకే గురు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అనేక సినిమాల్లో నటించిన ఉష శ్రీ ఇట్స్ ఓకే గురు మూవీలో హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, సాయి చరణ్ హీరోగా చేశాడు. క్రాంతి ప్రసాద్ నిర్మాతగా నిర్మించిన ఈ సినిమా మణికంఠ దర్శకత్వం వహించారు.
ఇట్స్ ఓకే గురు రిలీజ్ డేట్

ఇప్పటికే రిలీజ్ అయిన ఇట్స్ ఓకే గురు మూవీ ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక డిసెంబర్ 12న ఇట్స్ ఓకే గురు థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల డిసెంబర్ 6న ఇట్స్ ఓకే గురు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్.
అతిథిగా మెహర్ రమేష్
ఈ ఇట్స్ ఓకే గురు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా డైరెక్టర్ మెహర్ రమేష్ అతిథిగా వచ్చారు. ప్రభాస్ స్టైలిష్ ఫిల్మ్ బిల్లా సినిమాలో డార్లింగ్‌కు చెల్లెలుగా నటించిన హీరోయిన్ ఉష శ్రీ. ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఇట్స్ ఓకే గురు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకుంది హీరోయిన్ ఉష శ్రీ.
ప్రభాస్ చెల్లెలుగా నటించా
హీరోయిన్ ఉష శ్రీ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. మెహర్ రమేష్ గారి సినిమాలో ప్రభాస్ గారికి సిస్టర్‌గా చేశాను. నాకు చైల్డ్ ఆర్టిస్ట్‌గా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ఈరోజు నేను మెయిన్ లీడ్‌గా చేస్తున్న సినిమాకి గెస్ట్‌గా రావడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్, డైరెక్టర్‌కి థాంక్యూ" అని తెలిపింది.
నాకు చాలా స్పెషల్
"ఈ సినిమా నాకు చాలా స్పెషల్. హీరోయిన్‌గా మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది మా టీమ్ అందరికీ థాంక్యూ. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది" అని హీరోయిన్ ఉష శ్రీ ఆశాభావం వ్యక్తం చేసింది.
60 శాతం హిట్ అయినట్లే
{{/usCountry}}"ఈ సినిమా నాకు చాలా స్పెషల్. హీరోయిన్‌గా మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది మా టీమ్ అందరికీ థాంక్యూ. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది" అని హీరోయిన్ ఉష శ్రీ ఆశాభావం వ్యక్తం చేసింది.
60 శాతం హిట్ అయినట్లే
{{/usCountry}}ఇదే ఈవెంట్‌లో నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. "'ఇట్స్ ఓకే గురు' టైటిల్ చాలా బాగుంది. అందరికీ రీచ్ అయింది. కంటెంట్ చూస్తుంటే లవ్ స్టోరీలా అనిపిస్తుంది. విజువల్స్ మ్యూజిక్ అన్ని బాగున్నాయి. లవ్ స్టోరీకి మ్యూజిక్ విజువల్స్ బాగుంటే 60% సినిమా హిట్ అయినట్టే" అని జోస్యం చెప్పారు.
జయసుధ లాగా అనిపించింది
"సినిమాని మంచిగా ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. హీరో చరణ్ హీరో ఈజ్ బాగుంది. హీరోయిన్ జయసుధ గారు లాగా అనిపించారు. ఈ ఇద్దరికీ మంచి కెరీర్ ఉండాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్" అని దామోదర్ ప్రసాద్ చెప్పారు.
ఐదో సినిమా
మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ మాట్లాడుతూ.. "ఇది నా ఐదో సినిమా ఇందులో అన్ని పాటలు చేశాను. మా మ్యూజిక్ టీమ్ అందరికీ థాంక్యూ. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుంది" అని తెలిపారు.