తెలుగులో న్యూ స్పై కామెడీ థ్రిల్లర్.. చైనా పీస్ నుంచి సీక్రెట్ సోల్జర్‌గా టైటిల్ ఛేంజ్.. యూ/ఏ 16+గా సెన్సార్ సర్టిఫికేట్

China Piece Title Change To Secret Soldier: నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా వస్తున్న స్పై కామెడీ థ్రిల్లర్ డ్రామా 'చైనా పీస్' టైటిల్ మారింది. 'సీక్రెట్ సోల్జర్' అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో రానున్న ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. మరి సీక్రెట్ సోల్జర్ సినిమా పూర్తి వివరాల్లోకి వెళితే..!

Published on: Aug 2, 2026, 14:30:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

China Piece Title Change To Secret Soldier: టాలీవుడ్‌లో సరికొత్త థ్రిల్లర్ కథలతో వచ్చే యంగ్ డైరెక్టర్లు తమదైన ముద్ర వేస్తున్నారు. ఈ క్రమంలోనే వినూత్న కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఒక స్పై యాక్షన్ డ్రామా టైటిల్‌ను నిర్మాతలు మార్చారు. నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా పేరు 'చైనా పీస్'.

తెలుగులో న్యూ స్పై కామెడీ థ్రిల్లర్.. చైనా పీస్ నుంచి సీక్రెట్ సోల్జర్‌గా టైటిల్ ఛేంజ్.. యూ/ఏ 16+గా సెన్సార్ సర్టిఫికేట్
తెలుగులో న్యూ స్పై కామెడీ థ్రిల్లర్.. చైనా పీస్ నుంచి సీక్రెట్ సోల్జర్‌గా టైటిల్ ఛేంజ్.. యూ/ఏ 16+గా సెన్సార్ సర్టిఫికేట్

శక్తివంతమైన టైటిల్ ఖరారు

అయితే, ఇది ఇంతకుముందు నాటి టైటిల్. ఇప్పుడు ఈ పేరును మార్చి 'సీక్రెట్ సోల్జర్' (Secret Soldier) అనే శక్తివంతమైన టైటిల్‌ను ఖరారు చేశారు. మూన్ లైట్ డ్రీమ్స్ పతాకంపై అక్కి విశ్వనాథ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

సెన్సార్ నుంచి అనుమతులు

తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి సెన్సార్ అనుమతులు లభించాయి. బోర్డు సభ్యులు ఈ చిత్రానికి 'యూ/ఏ 16+' (U/A 16+) సర్టిఫికెట్ జారీ చేశారు. అయితే, చైనా పీస్ అనే టైటిల్ మార్చి సీక్రెట్ సోల్జర్ అని పేరు పెట్టడానికి సెన్సార్ అభ్యంతరం తెలపడమే కారణం అని టాక్ వస్తోంది.

థ్రిల్లింగ్ టీజర్‌తో పెరిగిన అంచనాలు

చిత్రబృందం ఇటీవల విడుదల చేసిన సీక్రెట్ సోల్జర్ టీజర్ సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంది. గూఢచర్యం నేపథ్యంలో సాగే కథలతో పాటు యాక్షన్, వినోదం మేళవించిన తీరు సినిమాపై ఆసక్తిని పెంచింది.

సీక్రెట్ సోల్జర్ టైటిల్ సరైన న్యాయం చేస్తుంది

సాధారణంగా స్పై థ్రిల్లర్లు అనగానే సీరియస్ అంశాలే ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ చిత్రంలో హ్యూమర్, యాక్షన్ ఎలిమెంట్లను సమపాళ్లలో జోడించినట్లు ప్రమోషనల్ కంటెంట్ ద్వారా స్పష్టమైంది. "కథలోని అసలు సారాంశానికి, యాక్షన్ ఎలిమెంట్లకు 'సీక్రెట్ సోల్జర్' అనే పేరు సరైన న్యాయం చేస్తుంది" అని చిత్ర వర్గాలు తెలిపాయి.

సీక్రెట్ సోల్జర్ నటీనటులు, సాంకేతిక వర్గం

సీక్రెట్ సోల్జర్ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్, తులసి, హర్షిత బండ్కమూరి కీలక పాత్రల్లో అలరించనున్నారు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే, సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించగా, సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందించారు.

గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన 'సీక్రెట్ సోల్జర్'

అలాగే, కార్తీక్ రోడ్రిగ్జ్ స్వరాలు సమకూర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ 'సీక్రెట్ సోల్జర్' సినిమా 2026 సెప్టెంబర్ నెలలో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద ఈ స్పై థ్రిల్లర్ కామెడీ డ్రామా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'చైనా పీస్' సినిమా కొత్త పేరు ఏమిటి?

ఈ స్పై డ్రామా సినిమా పేరును 'సీక్రెట్ సోల్జర్'గా మార్చారు.

2. 'సీక్రెట్ సోల్జర్' సినిమాలో నటీనటులు ఎవరు?

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటిస్తుండగా కమల్ కామరాజు, రఘు బాబు, శ్రీకాంత్ అయ్యంగార్, హర్షిత బండ్కమూరి ముఖ్య పాత్రలు పోషించారు.

3. ఈ చిత్రానికి వచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ ఏమిటి?

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి 'U/A 16+' సర్టిఫికెట్ ఇచ్చింది.

4. 'సీక్రెట్ సోల్జర్' సినిమా ఎప్పుడు విడుదల కానుంది?

ఈ చిత్రాన్ని 2026 సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More