ఓటీటీలో ఫ్రైడ్ రిలీజ్ ల సందడి ఎక్కువగానే ఉంది. కొత్త సినిమాలు, సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. అయితే ఇందులో ఓ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మారిటల్ రేప్ అనే సున్నితమైన అంశాన్ని డిస్కస్ చేసిన ఆ వెబ్ సిరీస్ పేరు.. ‘చిరాయ’. ఈ రోజు (మార్చి 20) ఓటీటీలోకి నేరుగా వచ్చింది ఈ వెబ్ సిరీస్.
చిరాయ ఓటీటీ

డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘చిరాయ’. శుక్రవారం నుంచి జియోహాట్‌స్టార్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. జియోహాట్‌స్టార్ స్పెషల్ గా ఈ సిరీస్ రిలీజ్ అయింది. ఇందులో దివ్య దత్తా, సంజయ్ మిశ్రా, ప్రసన్న బిష్ఠ్, సిద్ధార్థ్ షా తదితరులు నటించారు. ఈ సిరీస్ కు శశాంత్ షా డైరెక్టర్.
6 ఎపిసోడ్లు
ఇవాళ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న చిరాయ వెబ్ సిరీస్ ఆరు ఎపిసోడ్లతో వచ్చింది. బెంగాలీలో వచ్చిన ‘సంపూర్ణ’ వెబ్ సిరీస్ కు రీమేక్ గా దీన్ని తీర్చిదిద్దారు. ఈ చిరాయ సిరీస్ ను ఎస్వీఎఫ్ ఎంటర్ టైన్మెంట్ నిర్మించింది.
12 భాషల్లో
చిరాయ వెబ్ సిరీస్ ను ఏకంగా 12 భాషల్లో ఓటీటీ రిలీజ్ చేశారు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, హర్యాన్వి, రాజస్థానీ, భోజ్ పురి, ఒరియా భాషల్లో ఈ సిరీస్ రిలీజైంది. తెలుగు ఆడియన్స్ కూడా ఈ సిరీస్ ను మన భాషలో చూడొచ్చు.
చిరాయ స్టోరీ
మారిటల్ రేప్ అనే సున్నితమైన అంశం చుట్టూ సాగే కథతోని చిరాయ వెబ్ సిరీస్ తెరకెక్కింది. పెళ్లి అయినప్పటికీ భార్య అంగీకారం లేకుండా భర్త బలవంతపు శృంగారంలో పాల్గొంటే అది రేప్ కిందకే వస్తుందనే చర్చ ఎప్పటి నుంచో సాగుతోంది. ఇప్పుడీ పాయింట్ ఆధారంగా చిరాయ సిరీస్ ను ఓటీటీలోకి తీసుకొచ్చారు.
పెద్ద ఫ్యామిలీ
అదో పెద్ద ఫ్యామిలీ. అందులో కమ్లేష్ (దివ్య దత్తా) ఆ ఇంటి పెద్ద కోడలు. ఆమెకు తన మరిది (భర్త తమ్ముడు) అరుణ్ (సిద్ధార్థ్ షా) అంటే మంచి అభిప్రాయం. అతను ఏ తప్పూ చేయడని ఆమె నమ్ముతుంది. అరుణ్ కు పూజ (ప్రసన్న బిష్ఠ్)ను ఇచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లి తర్వాత అరుణ్ లోని రాక్షసుడు బయటకు వస్తాడు. పూజకు ఇష్టం లేకపోయినా బలవంతంగా సెక్స్ చేస్తాడు.
{{/usCountry}}అదో పెద్ద ఫ్యామిలీ. అందులో కమ్లేష్ (దివ్య దత్తా) ఆ ఇంటి పెద్ద కోడలు. ఆమెకు తన మరిది (భర్త తమ్ముడు) అరుణ్ (సిద్ధార్థ్ షా) అంటే మంచి అభిప్రాయం. అతను ఏ తప్పూ చేయడని ఆమె నమ్ముతుంది. అరుణ్ కు పూజ (ప్రసన్న బిష్ఠ్)ను ఇచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లి తర్వాత అరుణ్ లోని రాక్షసుడు బయటకు వస్తాడు. పూజకు ఇష్టం లేకపోయినా బలవంతంగా సెక్స్ చేస్తాడు.
{{/usCountry}}పూజను సైకోలాగా హింసిస్తాడు అరుణ్. అరుణ్ అంటే చాలు పూజ భయపడిపోతుంది. ఈ విషయం తల్లికి చెప్పినా సర్దుకుపోవాలని చెప్పడంతో పూజ నిరాశ చెందుతుంది. అరుణ్ తో శృంగారం తప్పించుకోవడానికి పీరియడ్స్ వచ్చాయని చెప్పేందుకు తన జననాంగం దగ్గర గాయం కూడా చేసుకుంటుంది.
మరి అరుణ్ విషయం కమ్లేష్ కు తెలిసిందా? పూజ ఈ హింస నుంచి బయటపడిందా? అన్నది చిరాయ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.