...
...
Next Story

meher ramesh: మెహర్ రమేష్ కుమార్తె పెళ్లిలో మెగా సందడి.. స్పెషల్ అట్రాక్షన్ గా చిరంజీవి, పవన్ కళ్యాణ్.. ఫొటోలు వైరల్

meher ramesh: టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ కూతురు కృష్ణ మోహ‌న‌ వెడ్డింగ్ రిసెప్షన్ లో మెగా సందడి వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. నవ దంపతులను వీళ్లు ఆశీర్వదించారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Published on: Jul 2, 2026, 10:56:29 IST
Advertisement

meher ramesh: టాలీవుడ్ సీనియర్ దర్శకుడు మెహర్ రమేష్ ఇంట పెళ్లి వేడుకలు అంబరాన్నంటాయి. ఆయన కుమార్తె కృష్ణ మోహన, అనిరుధ్ ల వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులు తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యంగా టాలీవుడ్ టాప్ స్టార్స్ ఈ వేడుకలో సందడి చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మెగా ఫ్యామిలీ సందడి

మెహర్ రమేష్ కుమార్తె పెళ్లిలో మెగా సందడి.. స్పెషల్ అట్రాక్షన్ గా చిరంజీవి, పవన్ కళ్యాణ్ (x)
మెహర్ రమేష్ కుమార్తె పెళ్లిలో మెగా సందడి.. స్పెషల్ అట్రాక్షన్ గా చిరంజీవి, పవన్ కళ్యాణ్ (x)

మెహర్ రమేష్‌కు మెగా కుటుంబంతో దశాబ్దాల కాలంగా అత్యంత సన్నిహితమైన వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాలు ఉన్నాయి. గతంలో చిరంజీవితో 'భోలా శంకర్' వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించాడు మెహర్ రమేష్. ఈ బలమైన అనుబంధంతోనే మెగాస్టార్ చిరంజీవి, తన సతీమణి సురేఖతో కలిసి వివాహ వేడుకకు విచ్చేశారు. కొత్త జంటకు తమ ఆశీస్సులు అందజేశారు.

పవర్ స్టార్ కూడా

ఈ సెలబ్రిటీలు

మెగా ఫ్యామిలీతో పాటు టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి కూడా ఈ వివాహ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో గతంలో 'షాడో' సినిమాలో నటించిన వెంకటేష్, ఆ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ దర్శకుడి కుటుంబానికి అభినందనలు తెలిపారు.

వీరితో పాటు వివిధ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు అగ్ర నటీనటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకకు భారీగా తరలివచ్చారు. ప్రభుదేవ, యాంకర్ సుమ, అంబటి రాంబాబు, శ్రీను వైట్ల, కొరటాల శివ తదితరులు ఈ వెడ్డింగ్ రిసెప్షన్ ను అటెండ్ అయ్యారు. మెహర్ రమేష్‌కు ఉన్న విస్తృతమైన పరిచయాల వల్ల ఈ పెళ్లి వేడుక టాలీవుడ్ లో ఒక పెద్ద పండగలా సాగింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks