Chiranjeevi Kaaka: కాకా సినిమా సంక్రాంతికి రావడం కష్టమే.. ఈ చిత్రం కచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో.. ఇవి చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘కాకా’ రిలీజ్ పై తాజాగా వినిపిస్తున్న వార్తలు. కానీ ఈ వార్తలన్నీ వట్టి పుకార్లేనని, కాకా మూవీ చెప్పిన రోజుకే వస్తుందని మెగాస్టార్ కన్ఫామ్ చేశారు.
చిరంజీవి ట్వీట్

కాకా మూవీ రిలీజ్ డేట్ పై అప్డేట్ ఇస్తూ చిరంజీవి ఇవాళ (నవంబర్ 29) చేసిన ట్వీట్ క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఈ ట్వీట్ ద్వారా మెగాస్టార్ చెప్పిన మ్యాటర్ అలాంటిది మరి. చిరు ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేలా ఈ ట్వీట్ ఉంది.
ఆటో జానీ ఈజ్ బ్యాక్
చిరంజీవి కెరీర్ లో గుర్తుండిపోయే క్యారెక్టర్లలో ఆటో జానీ ఒకటి. మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ ‘రౌడీ అల్లుడు’లో చిరు ఆటో జానీగా బిగ్ స్క్రీన్ పై అదరగొట్టారు. ఆ క్యారెక్టర్ కు ఇప్పటికీ క్రేజ్ ఉంది. ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ రాబోతుందని తాజాగా ట్వీట్ తో చిరంజీవి ఊరించారు.
ఆటో జానీ గుర్తున్నాడా?
‘‘ఆటో జానీ గుర్తున్నాడా? ఈ సంక్రాంతికి సరికొత్తగా కాకాలో మీ ముందుకు వస్తున్నాడు. ఆటో జానీ కొత్త వర్షన్ తో మిమ్మల్ని అందరికీ ఈ సంక్రాంతికి ఎంటర్ టైన్ చేసేందుకు ఎదురు చూస్తున్నా. కాకాను ఓ అద్భుతమైన థియేటర్ ఎక్స్ పీరియన్స్ గా మార్చేందుకు డైరెక్టర్ బాబీ అండ్ టీమ్ కష్టపడుతున్నారు. 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా మిమ్మల్ని థియేటర్లలో కలుస్తా. సంక్రాంతికి కలుద్దాం’’ అని చిరు ట్వీట్ చేశారు.
ఎన్ని షేడ్స్?
చిరంజీవి ట్వీట్ తో మరోసారి కాకా మూవీ హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ సినిమాలో చిరంజీవి ఎన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేస్తున్నారనే ప్రశ్న వినిపిస్తుంది. ఫస్ట్ టీజర్ లోనేమో చిరంజీవిని సత్తన్నగా పరిచయం చేశారు. ఆ తర్వాత ఓ ఈవెంట్లో తన క్యారెక్టర్ పేరును కదిరి కాళిదాసుగా చిరు లీక్ చేశారు.
{{/usCountry}}చిరంజీవి ట్వీట్ తో మరోసారి కాకా మూవీ హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ సినిమాలో చిరంజీవి ఎన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేస్తున్నారనే ప్రశ్న వినిపిస్తుంది. ఫస్ట్ టీజర్ లోనేమో చిరంజీవిని సత్తన్నగా పరిచయం చేశారు. ఆ తర్వాత ఓ ఈవెంట్లో తన క్యారెక్టర్ పేరును కదిరి కాళిదాసుగా చిరు లీక్ చేశారు.
{{/usCountry}}ఇప్పుడేమో ఆటో జానీ కొత్త సైడ్ ను కాకా మూవీలో చూస్తారని చిరంజీవి ఎక్స్ లో పోస్టు పెట్టారు. దీంతో 2027 సంక్రాంతికి రిలీజ్ అయ్యే కాకా మూవీలో చిరంజీవి ఎన్ని గెటప్స్ లో కనిపిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
మూగమ్మాయిగా అనస్వర రాజన్
బాబీ డైరెక్షన్ లో వస్తున్న కాకా మూవీతో చిరంజీవితో పాటు అనస్వర రాజన్, నివేదా పేతురాజ్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీలో అనస్వర మూగమ్మాయిగా నటిస్తుందని చిరు ఇటీవల హింట్ ఇచ్చారు.
తాజాగా చిరు పోస్టు చేసిన ఫొటోలో మెగాస్టార్ బ్లాక్ టీ షర్ట్, ఖాకీ బ్రౌన్ షర్ట్, కార్గో ప్యాంట్, స్టైలిష్ సన్ గ్లాసెస్ ధరించి కాలర్ ఎగరేస్తూ నడుస్తున్నారు. ఆయన నడుముకు తుపాకీ కనిపించింది. ఈ పోస్టర్ తో మూవీపై హైప్ మరింత పెరిగింది.
ABOUT THE AUTHOR
చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.