...
...
Next Story

Chiranjeevi: 48 ఏళ్ల సినీ ప్రయాణం..విజయాలకంటే అదే గొప్పది..చిరంజీవి అనేది నాకు దక్కిన గుర్తింపు: చిరంజీవి ఎమోషనల్ ట్వీట్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరు. సామాన్యుడి నుంచి స్టార్ గా ఎదిగిన వ్యక్తి ఆయన. ఆయన కేవలం వ్యక్తి మాత్రమే కాదు అభిమానుల గుండెల్లో కొలువైన దేవుడు. కొణిదెల శివ శంకర వరప్రసాద్.. చిరంజీవిగా మారడానికి అడుగుపడ్డ రోజు ఇదే.

Published on: Sep 22, 2026, 13:48:07 IST
Advertisement

Chiranjeevi: సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్లు ఉన్నారు. ఎంతో మంది వస్తారు, పోతారు. కానీ.. సినీ ఇండస్ట్రీకే స్పెషల్ క్రేజ్ తెచ్చేవాళ్లు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచే వాళ్లు కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి వాళ్లలో మన మెగాస్టార్ చిరంజీవి టాప్ లో ఉంటారు. ఆయన సినీ కెరీర్ ఇప్పటిది కాదు.

చిరంజీవి 48 ఏళ్లు

48 ఏళ్ల సినీ ప్రయాణం..విజయాలకంటే అదే గొప్పది..చిరంజీవి అనేది నాకు దక్కిన గుర్తింపు: చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ (x/KChiruTweets)
48 ఏళ్ల సినీ ప్రయాణం..విజయాలకంటే అదే గొప్పది..చిరంజీవి అనేది నాకు దక్కిన గుర్తింపు: చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ (x/KChiruTweets)

చిరంజీవి అంటే కేవలం హీరో మాత్రమే కాదు. ఆయన ఓ శక్తి. కోట్లాది మంది అభిమానులను తన డ్యాన్స్, యాక్టింగ్ తో ఉర్రూతలూగించే సమ్మోహన శక్తి ఆయన. తన ఉనికితోనే శాసించే పవరే ఆయన. సరిగ్గా ఇదే రోజున (సెప్టెంబర్ 22) 1978లో చిరంజీవి సినీ కెరీర్ ప్రారంభమైంది. ప్రాణం ఖరీదు మూవీ రిలీజైంది. ఈ సందర్భంగా చిరంజీవి చేసిన ఎమోషనల్ ట్వీట్ వైరల్ గా మారింది.

ఎన్నో విజయాలు చూశా

‘‘22 సెప్టెంబర్ 1978.. ఆ రోజు మొదలైన నా సినీ ప్రయాణం నేటితో 48 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ 48 ఏళ్లలో ఎన్నో పాత్రలు పోషించాను. ఎన్నో విజయాలను చూశాను. ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్నాను’’ అని చిరంజీవి తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.

వాళ్లందరికీ ధన్యవాదాలు

‘‘ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, నాలోని నటుడిని కొత్త కొత్త కోణాల్లో ఆవిష్కరించిన ప్రతి దర్శకుడికి, నా ప్రతి సినిమా వెనుక అహర్నిశలు శ్రమించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి సహకారమే నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది’’ అని చిరంజీవి తన గ్రాటిట్యూడ్ ను చాటుకున్నారు.

అదే గొప్పది

‘‘ఆ రోజు ‘చిరంజీవి’ అనేది నేను పెట్టుకున్న పేరు. నేడు మీ ప్రేమతో అది నాకు దక్కిన శాశ్వతమైన గుర్తింపు. మీ ప్రేమకు, అభిమానానికి ఎప్పటికీ కృతజ్ఞతలతో.. మీ చిరంజీవి’’ అని మెగాస్టార్ తన పోస్టును ముగించారు.

సినిమా కెరీర్ లో 48 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరంజీవి పెట్టిన ఈ ఎమోషనల్ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. చిరు గొప్పతనాన్ని చెప్తూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks