...
...
Next Story

Chiranjeevi Kaaka: సత్తన్నగా చిరంజీవి- ఊహించని సర్‌ప్రైజ్‌తో కాకా గ్లింప్స్, బీజీఎం కేక- ప్రత్యర్థులుగా చిరు, వెంకీ పోటీ

Chiranjeevi Kaaka Glimpse Released: చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు మెగా 158 మేకర్స్ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. బాబీ దర్శకత్వంలో వస్తున్న చిరంజీవి కొత్త సినిమాకు 'కాకా' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ మాస్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. బీజీఎం, సీన్లతో కాకా గ్లింప్స్ అదిరిపోయింది.

Published on: Aug 22, 2026, 12:53:50 IST
Advertisement

Chiranjeevi Kaaka Glimpse Released On His Birthday: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల వేళ ఆయన అభిమానులకు బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్ వచ్చింది. దర్శకుడు బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్‌లో రాబోతున్న ప్రాజెక్ట్‌కి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను శనివారం (ఆగస్ట్ 22) అధికారికంగా విడుదల చేశారు.

వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత

సత్తన్నగా చిరంజీవి- ఊహించని సర్‌ప్రైజ్‌తో కాకా గ్లింప్స్, బీజీఎం కేక- ప్రత్యర్థులుగా చిరు, వెంకీ పోటీ
సత్తన్నగా చిరంజీవి- ఊహించని సర్‌ప్రైజ్‌తో కాకా గ్లింప్స్, బీజీఎం కేక- ప్రత్యర్థులుగా చిరు, వెంకీ పోటీ

ఈ మెగా 158 సినిమాకు ‘కాకా’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అనౌన్స్‌మెంట్ రాగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అంతేకాకుండా తాజాగా విడుదల చేసిన కాకా గ్లింప్స్ వీడియో అదిరిపోయింది.

చేపల పరిశ్రమ నేపథ్యం.. ‘సత్యన్న’గా మెగాస్టార్

విడుదల చేసిన కాకా గ్లింప్స్‌లో చిరంజీవి 'కె. సత్యం' అనే పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన్ను అందరూ సతన్న అని పిలుస్తారు. చేపల పరిశ్రమలో సూపర్‌వైజర్‌గా పనిచేసే సత్యం.. చెన్నై టీమ్‌కి అనుకున్న సమయానికి లోడ్ చేరుతుందని భరోసా ఇస్తాడు.

అంతలో సునీల్ వచ్చి వారం రోజులు లీవ్ అడుగుతాడు. "రేయ్ మన టార్గెట్ పండగరా.. అప్పటివరకు ఎవరికి సెలవుల్లేవ్.. ఎల్లేహే.." అని సత్తన్న పంపిస్తాడు. ఆ తర్వాత గెటప్ శ్రీను వచ్చి "అమ్ములు పాప బండి కీస్ అండి" అంటాడు. దాన్ని విసిరేయమని సత్యం అడిగితే.. ఈ తాళాలు చేపలున్న నీళ్లలో పడతాయి. నేను తీసుకుంటానని చెప్పి గెటప్ శ్రీనును పంపించేస్తాడు చిరంజీవి.

ఊహించని విధంగా గన్స్

అప్పటివరకు సాదా సీదా మిడిల్ క్లాస్ వ్యక్తిగా కనిపించిన చిరంజీవి కొత్తగా కనిపిస్తాడు. ఆ సమయంలో చిరంజీవి మేనరిజం, లుక్ తెగ ఆకట్టుకుంటాయి. అదే సమయంలో చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ చిక్‌చిక్ చేలం అనే పాట రీమిక్స్ బీజీఎం బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తూ సీన్‌కు మరింత హైలెట్ అయింది.

రెండు భిన్నమైన అవతారాలు

గ్లింప్స్ చివరిలో చిరంజీవి ఫ్లాష్‌బ్యాక్‌లా గన్స్ మోత, రౌడీలను కాల్చడం వంటి సీన్‌తో ముగించారు. ఊహించని గెటప్‌లో చిరంజీవి కనిపించి అభిమానులను భారీగా సర్‌ప్రైజ్ చేశారు. ఒకే సినిమాలో మెగాస్టార్‌ను రెండు విభిన్నమైన అవతారాలలో బాబీ చూపించనున్నారని తెలుస్తోంది.

చిరంజీవి మార్క్ బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్, డిఫరెంట్ స్టైల్ ఈ గ్లింప్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కాగా, ఈ సినిమాలో మలయాళ ప్రముఖ నటి అనస్వర రాజన్ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఆంటోనీ ఎల్. రూబెన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరిలు కథా విభాగానికి సహకారం అందించారు.

ప్రత్యర్థులుగా చిరు, వెంకీ

ఇక కాకా సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, అదే ఏడాది జనవరి 12న అనిల్ రావిపూడి, వెంకటేష్, కల్యాణ్ రామ్ జనవరి 12 విడుదల సినిమా కూడా రిలీజ్ కానుంది.

అంటే, వచ్చే సంక్రాంతికి రెండు బిగ్గెస్ట్ సినిమాలు పోటీ పడనున్నాయి. అంతేకాకుండా ఈ సంక్రాంతికి చిరంజీవి, వెంకటేష్ కలిసి సందడి చేయగా వచ్చే ఏడాది ఇద్దరు ప్రత్యర్థులుగా పోటీ పడనున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe