మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సోమవారం (అక్టోబర్ 20) సాయంత్రం జరిగిన దీపావళి వేడుకల్లో టాలీవుడ్ స్టార్లు నాగార్జున, వెంకటేశ్, లేడీ సూపర్ స్టార్ నయనతార సందడి చేశారు. ఈ వేడుకల ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకోగా, ఈ హీరోల మధ్య ఉన్న నిజమైన స్నేహబంధం చూసి అభిమానులు మురిసిపోతున్నారు.
టాలీవుడ్ స్టార్స్ దీపావళి సెలబ్రేషన్స్

టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి, నయనతార, నాగార్జున, వెంకటేశ్ కలిసి హైదరాబాద్‌లో దీపావళి సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకల తాలూకు ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈసారి చిరంజీవి ఇంట్లో జరిగిన దీపావళి వేడుకల్లో అతని కుటుంబ సభ్యులతో పాటు, సినీ పరిశ్రమలోని అత్యంత సన్నిహితులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.
చిరంజీవి షేర్ చేసిన ఒక ఫోటోలో.. అతడు వెంకటేశ్, నాగార్జునలతో కలిసి పోజులిచ్చారు. మరో చిత్రంలో అతడు ఈ ఇద్దరు నటులకు, వారి కుటుంబాలకు దీపావళి సందర్భంగా బహుమతులు అందిస్తూ కనిపించాడు. ఇంకో ఫోటోలో, చిరంజీవి తన మన శంకర వరప్రసాద్ గారు మూవీ సహనటి నయనతారను ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని, ఆమెకు ఒక శంఖాన్ని గిఫ్ట్‌గా ఇస్తుండటం చూడొచ్చు.
ఈ ఫోటోలను పంచుకుంటూ చిరంజీవి ఇలా రాశాడు.. "ప్రియమైన స్నేహితులు నాగార్జున, వెంకటేశ్, నా సహనటి నయనతార వారి కుటుంబాలతో కలిసి ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ (దీపావళి) జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మధుర క్షణాలు మన హృదయాన్ని ఆనందంతో నింపుతాయి. జీవితాన్ని నిజంగా కాంతిమయం చేసే ప్రేమ, నవ్వు, కలిసి ఉండడం ఎంత ముఖ్యమో ఇవి గుర్తు చేస్తాయి" అన్ని అన్నాడు.
అభిమానుల రియాక్షన్ ఇలా..
ఈ స్టార్స్ అంతా కలిసి దీపావళి జరుపుకోవడం చూసి అభిమానులు ఉప్పొంగిపోయారు. ఒకరు కామెంట్ చేస్తూ.. "వావ్.. ఇదే కదా నిజమైన స్నేహం. కొత్తగా వచ్చే నటులు మా అన్నయ్య నుంచి చాలా నేర్చుకోవాలి" అని రాశారు. మరొక అభిమాని స్పందిస్తూ.. "తెలుగు చిత్ర పరిశ్రమను ముందుకు తీసుకెళ్లడంలో ఈ ముగ్గురు హీరోలదే అతిపెద్ద పాత్ర" అని కితాబిచ్చారు. కొంతమంది అభిమానులు ఈ ఫోటోల్లో ఒకదానిలో.. గోడపై రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ లోని సీతారామరాజు ఫోటోను కూడా గమనించారు.
చిరంజీవి రీసెంట్ మూవీస్
{{/usCountry}}ఈ స్టార్స్ అంతా కలిసి దీపావళి జరుపుకోవడం చూసి అభిమానులు ఉప్పొంగిపోయారు. ఒకరు కామెంట్ చేస్తూ.. "వావ్.. ఇదే కదా నిజమైన స్నేహం. కొత్తగా వచ్చే నటులు మా అన్నయ్య నుంచి చాలా నేర్చుకోవాలి" అని రాశారు. మరొక అభిమాని స్పందిస్తూ.. "తెలుగు చిత్ర పరిశ్రమను ముందుకు తీసుకెళ్లడంలో ఈ ముగ్గురు హీరోలదే అతిపెద్ద పాత్ర" అని కితాబిచ్చారు. కొంతమంది అభిమానులు ఈ ఫోటోల్లో ఒకదానిలో.. గోడపై రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ లోని సీతారామరాజు ఫోటోను కూడా గమనించారు.
చిరంజీవి రీసెంట్ మూవీస్
{{/usCountry}}చిరంజీవి చివరిగా 2023లో వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలలో కనిపించాడు. అతడు త్వరలో త్రిష కృష్ణన్ తో కలిసి విశ్వంభర అనే సోషియో-ఫాంటసీ చిత్రంలో కనిపించనున్నాడు. నయనతారతో కలిసి చిరంజీవి నటిస్తున్న చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు. ఇవే కాకుండా శ్రీకాంత్ ఓదెల, బాబీ దర్శకత్వంలో చేయబోయే సినిమాలు కూడా లైన్‌లో ఉన్నాయి.
ఇక నాగార్జున ఈ సంవత్సరం కుబేర, కూలీ సినిమాలలో నటించాడు. అతడు ఇంకా తన రాబోయే సినిమాలను అనౌన్స్ చేయలేదు. వెంకటేశ్ కూడా తన రాబోయే ప్రాజెక్ట్‌లను ప్రకటించాల్సి ఉంది. అతడు ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రంలో చివరిగా కనిపించాడు. నయనతార త్వరలో మలయాళంలో డియర్ స్టూడెంట్స్, పాట్రియాట్, కన్నడలో టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ అలాగే తమిళంలో మూకుటి అమ్మన్ 2, మన్నంగట్టి సిన్స్ 1960, హై, రక్కయీ వంటి పలు చిత్రాలలో నటించనుంది.