Irumudi Chiranjeevi: బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తూ రవితేజ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ 'ఇరుముడి'. ఇంతటి ఘన విజయం సాధించిన ఇరుముడి టీమ్ ను మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేకంగా అభినందించారు. తమ ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు. ఈ ఫొటోలువ వైరల్ అవుతున్నాయి.
ఇరుముడి టీమ్

రవితేజ హీరోగా నటించిన ఇరుముడి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.280 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో హీరో రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ, ప్రొడ్యూసర్లు నవీన్ యెర్నేని, రవి శంకర్ ను చిరంజీవి, రామ్ చరణ్ అభినందించారు.
ఆ క్యామియో గురించి
ఇరుముడి మూవీ టీమ్ తో చిరంజీవి, రామ్ చరణ్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో రామ్ చరణ్ క్యామియో రూమర్లపై మాట్లాడుకున్నారని తెలిసింది. ఇరుముడిలోని మల్లెపూల పల్లకి సాంగ్ లో చరణ్ కూడా కనిపిస్తారని మూవీ రిలీజ్ కు ముందు పుకార్లు వచ్చాయి.
వాల్తేరు వీరయ్య బంధం
{{/usCountry}}ఇరుముడి మూవీ టీమ్ తో చిరంజీవి, రామ్ చరణ్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో రామ్ చరణ్ క్యామియో రూమర్లపై మాట్లాడుకున్నారని తెలిసింది. ఇరుముడిలోని మల్లెపూల పల్లకి సాంగ్ లో చరణ్ కూడా కనిపిస్తారని మూవీ రిలీజ్ కు ముందు పుకార్లు వచ్చాయి.
వాల్తేరు వీరయ్య బంధం
{{/usCountry}}తెలుగు చిత్రసీమలో చిరంజీవి, రవితేజల మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. 'అన్నయ్య' నుంచి 'వాల్తేరు వీరయ్య' వరకు వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది.
ఆల్ టైమ్ రికార్డు
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఇరుముడి చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది. సాయి కుమార్, రమేష్ ఇందిర, స్వస్తిక విజయ్ కీలక పాత్రలు పోషించారు. బేబీ నక్షత్ర, రవితేజ మధ్య సాగే తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ థియేటర్లలో ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతోంది. దీంతో ఈ మూవీ రూ.280 కోట్లకు పైగా కలెక్షన్లతో అదరగొట్టింది.
ఇరుముడి ఓటీటీ
ఇరుముడి మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఆ బ్లాక్ బస్టర్ సినిమా సెప్టెంబర్ 18 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఇరుముడి ఓటీటీ రిలీజ్ కానుంది.
ఇరుముడి ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరుముడి ఓటీటీ రిలీజ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశముంది.