...
...
Next Story

Chiranjeevi Review: ఎటు చూసినా నవ్వులే నవ్వులు.. నువ్వీ సక్సెస్‌కి అర్హుడివి: చిరంజీవి కొరియన్ కనకరాజు రివ్యూ వైరల్

Chiranjeevi Review: కొరియన్ కనకరాజు మూవీపై మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన రివ్యూ వైరల్ అవుతోంది. తన తమ్ముడి కొడుకు వరుణ్ తేజ్ లీడ్ రోల్లో నటించిన ఈ హారర్ కామెడీ మూవీకి పాజిటివ్ రివ్యూలు వస్తుండటంపై అతనికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశాడు.

Published on: Aug 7, 2026, 13:45:09 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Chiranjeevi Review: మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'కొరియన్ కనకరాజు' బాక్సాఫీస్ దగ్గర నవ్వుల పంట పండిస్తోంది. థియేటర్లలో ఈ సినిమాకి వస్తున్న సూపర్ హిట్ రెస్పాన్స్ చూసి మెగాస్టార్ చిరంజీవి విపరీతంగా ఆనందించారు. ఈ సినిమా సక్సెస్‌పై స్పందిస్తూ వరుణ్ తేజ్ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

"డియర్ వరుణ్ తేజ్.. నువ్వు ఈ విజయానికి అర్హుడివి!"

Chiranjeevi Review: ఎటు చూసినా నవ్వులే నవ్వులు.. నువ్వీ సక్సెస్‌కి అర్హుడివి: చిరంజీవి కొరియన్ కనకరాజు రివ్యూ వైరల్
Chiranjeevi Review: ఎటు చూసినా నవ్వులే నవ్వులు.. నువ్వీ సక్సెస్‌కి అర్హుడివి: చిరంజీవి కొరియన్ కనకరాజు రివ్యూ వైరల్

"కొరియన్ కనకరాజు సినిమాకి ప్రతీ చోట నుంచి అద్భుతమైన రిపోర్ట్స్ వస్తున్నాయని విన్నాను. ఎక్కడ చూసినా 'నవ్వులే నవ్వులు' అనే ఒకటే టాక్ వినిపిస్తోంది. డియర్ వరుణ్ తేజ్, నువ్వు నిజంగా ఈ సక్సెస్‌కి అర్హుడివి. నీ హార్డ్ వర్క్, స్టాండర్డ్ కు పర్‌ఫెక్ట్ రిజల్ట్ వచ్చింది. మై హార్ట్‌ఫెల్ట్ కంగ్రాచ్యులేషన్స్" అంటూ చిరంజీవి తన ఎక్స్ ఖాతాలో ప్రత్యేకంగా రాసుకొచ్చారు.

ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన డైరెక్టర్ మేర్లపాక గాంధీ, సీనియర్ కమెడియన్ సత్య, హీరోయిన్ రితికా నాయక్‌లతో పాటు ప్రాజెక్ట్ వెనుక ఉన్న యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్ ప్రొడ్యూసర్లకు, ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూకి చిరంజీవి తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. త్వరలోనే ఈ సినిమాను ప్రత్యేకంగా చూడటానికి వెయిట్ చేస్తున్నానని వెల్లడించారు.

వరుణ్ తేజ్ మేకోవర్.. థియేటర్లలో నవ్వుల రాంపేజ్

ఈ సినిమాలో వరుణ్ తేజ్ డిఫరెంట్ హెయిర్‌స్టైల్, రాయలసీమ యాసతో మాస్ లుక్‌లో కనిపించి ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకున్నాడు. గతంలో సీరియస్ రోల్స్, యాక్షన్ డ్రామాలు చేసిన వరుణ్, ఈసారి పూర్తి స్థాయి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌ని ఎంచుకుని బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు.

సరిగ్గా సినిమా రిలీజై మంచి టాక్ తెచ్చుకుంటున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి అందించిన ఈ సపోర్ట్ 'కొరియన్ కనకరాజు' టీమ్‌కి కొండంత బూస్ట్ ఇచ్చినట్లయింది. చిరంజీవి ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. వరుణ్ తేజ్ పడ్డ కష్టానికి మెగాస్టార్ ఇచ్చిన కాంప్లిమెంట్ బెస్ట్ గిఫ్ట్ అని కామెంట్లు చేస్తున్నారు.

కొరియన్ కనకరాజు స్టోరీ ఏంటంటే?

రాయలసీమలోని పెనుకొండ ప్రాంతంలో ఒక సాంప్రదాయ చెక్కభజన ప్రదర్శనలు ఇచ్చే జానపద కళాకారుల బృందానికి కనకరాజు (వరుణ్ తేజ్) నాయకత్వం వహిస్తుంటాడు. ఆ చెక్కభజనలతో వచ్చే డబ్బుతో కుటుంబానికి అండగా ఉంటాడు. అలాగే కిష్టప్ప (సత్య)తో స్నేహం, చెంగారెడ్డి (సునీల్)తో గొడవలతో కాలం వెళ్లదీస్తుంటాడు.

అదే ప్రాంతంలోని కియా (Kia) కార్ల తయారీ పరిశ్రమలో పనిచేసే చైత్ర (రితికా నాయక్)తో కనకరాజు ప్రేమలో పడతాడు. చైత్రకు కే-పాప్ (K-Pop), కొరియన్ సంస్కృతి అంటే విపరీతమైన పిచ్చి. ఎలాగోలా ఆమెకు దగ్గరవుతాడు. కానీ కొరియా నుంచి వచ్చిన ఓ వస్తువు నుంచి కనకరాజు శరీరంలోకి కొరియన్ ఆత్మ ప్రవేశిస్తుంది.

ఆ కొరియన్ ఆత్మ కనకరాజు శరీరంలోకే ఎందుకు ప్రవేశించింది? ఆ దెయ్యం వెనుక ఉన్న గత చరిత్ర ఏమిటి? కనకరాజు కొరియా ఎందుకు వెళ్లాడు? అక్కడ ఏం జరిగింది? ఆత్మ వల్ల వచ్చే సమస్యల నుంచి బయటపడటానికి కనకరాజు, అతడి స్నేహితుడు కిష్టప్ప, చైత్ర కలిసి ఏం చేశారు? ఆత్మ నుంచి కనకరాజుకు విముక్తి లభించిందా? అన్నదే 'కొరియన్ కనకరాజు' కథాంశం.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks