Korean Kanakaraju: స్క్రీన్‌పై నేను కనిపిస్తే ఫెయిల్ అయినట్లే.. ఇది అత్యంత కష్టమైన రోల్: కొరియన్ కనకరాజుపై వరుణ్ తేజ్
Korean Kanakaraju: కొరియన్ కనకరాజుగా వస్తున్నాడు వరుణ్ తేజ్. తన లేటెస్ట్ మూవీ గురించి అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మూవీలో స్క్రీన్ పై తాను కాకుండా తన కనకరాజు పాత్రే కనిపిస్తుందని, అలా కాకపోతే తాను ఫెయిల్ అయినట్లేనని అనడం విశేషం.
Korean Kanakaraju: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన డిఫరెంట్ మేకోవర్‌తో ఆడియన్స్‌ను షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన నాన్-స్టాప్ కామెడీ ఎంటర్‌టైనర్ 'కొరియన్ కనకరాజు' మూవీ ప్రమోషన్లలో వరుణ్ తేజ్ తన క్యారెక్టర్ ట్రాన్స్‌ఫార్మేషన్ గురించి చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

హెయిర్ కలరింగ్ నుంచి రాయలసీమ యాస వరకు..
ఈ కొరియన్ కనకరాజు సినిమాలో కనకరాజు పాత్ర కోసం వరుణ్ తేజ్ సరికొత్త లుక్‌లోకి మారిపోయాడు. తెరపై వరుణ్ తేజ్ అనే హీరో కాకుండా కేవలం 'కనకరాజు' మాత్రమే కనిపించాలని డైరెక్టర్ మేర్లపాక గాంధీ స్పష్టమైన కండిషన్ పెట్టారట. అందుకోసమే తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ హెయిర్ కలరింగ్ చేసుకోవడంతో పాటు హెయిర్‌స్టైల్, నడక, ప్రవర్తన అంతా మార్చేసుకున్నాడు.
విజువల్ మేకోవర్‌తో పాటు రాయలసీమ యాస పర్‌ఫెక్ట్‌గా పలకడం కోసం వరుణ్ ప్రత్యేకంగా వర్క్‌షాప్‌లలో పాల్గొన్నాడు. కొరియన్ లాంగ్వేజ్ ఉచ్ఛారణ, రాయలసీమ మిక్సింగ్ యాసను కుదర్చడంలో మెగా హీరో పడిన కష్టం టీజర్‌లోనే స్పష్టంగా కనిపించింది.
కమెడియన్ సత్యతో మాస్ కెమిస్ట్రీ
స్టార్ కమెడియన్ సత్యతో కలిసి సీన్స్ చేయడం ఈ సినిమాకు బిగ్గెస్ట్ హైలైట్‌గా మారనుందని వరుణ్ తేజ్ ధీమా వ్యక్తం చేశాడు. వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్లు థియేటర్లలో నవ్వుల పూలు పూయించడం ఖాయమని చెబుతున్నారు.
రెండు భిన్నమైన డైమెన్షన్స్ ఉన్న ఈ క్యారెక్టర్ చేయడం తన యాక్టింగ్ కెరీర్‌లోనే ఎంతో తృప్తిని ఇచ్చిందని వరుణ్ పేర్కొన్నాడు. రోజువారీ జీవితంలో కొత్త విషయాలు నేర్చుకోవడమే తనకిష్టమని, పాత్రలోకి లీనమైపోవడమే ఒక నటుడిగా తనకు అసలైన విజయం అని అన్నాడు.
కామెడీ సినిమాకి ట్రైలర్ కట్ చేయడం పెద్ద ఛాలెంజ్
హాస్య ప్రధానంగా సాగే సినిమాలకు ట్రైలర్ డిజైన్ చేయడం చాలా కష్టమైన పని అని వరుణ్ అభిప్రాయపడ్డాడు. కేవలం సన్నివేశంలో ఉన్న సందర్భాన్ని బట్టి వచ్చే నవ్వులను రెండు నిమిషాల ట్రైలర్‌లో బంధించడం కుదరదని, అందుకే సినిమా మొత్తాన్ని పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ప్రమోట్ చేస్తున్నామని తెలిపాడు.
'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'ఎక్స్‌ప్రెస్ రాజా' వంటి హిట్లు అందించిన మేర్లపాక గాంధీ మార్క్ డైలాగులు, కామెడీ టైమింగ్ ఈ చిత్రంలో నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
అడ్వాన్స్ బుకింగ్స్ జోరు.. బాక్సాఫీస్ టార్గెట్
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ఆడియన్స్ నుంచి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా పాజిటివ్‌గా నమోదు కావడంతో చిత్రబృందం ప్రమోషన్లను మరింత వేగవంతం చేసింది.
విభిన్నమైన కథాంశాలతో ప్రయోగాలు చేసే వరుణ్ తేజ్, ఈసారి వినోదాన్నే ఆయుధంగా చేసుకుని బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని అందుకోవడానికి సిద్ధమయ్యాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా విశేషంగా అలరిస్తుందని టీమ్ ధీమాగా ఉంది. కొరియన్ కనకరాజు మూవీ శుక్రవారం (ఆగస్ట్ 7) ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


