...
...
Next Story

Chiranjeevi: ఇది వరుణ్ తేజ్ సక్సెస్ కాదు.. వాడే మా లక్కీ ఛార్మ్.. ఫంక్షన్ ఎప్పుడు పెడతారని అడిగా: చిరంజీవి

Chiranjeevi: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో తెరకెక్కిన హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ‘మెగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్’ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.

Published on: Aug 12, 2026, 09:10:03 IST
Advertisement

Chiranjeevi: చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు ‘కొరియన్ కనకరాజు’తో సూపర్ హిట్ దక్కింది. ఈ హారర్ థ్రిల్లర్ లో థియేటర్లలో ప్రేక్షకులను నవ్విస్తోంది. అయితే ఈ సక్సెస్ క్రెడిట్ వరుణ్ తేజ్ ది కాదని మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.

చిరంజీవి స్పీచ్

ఇది వరుణ్ తేజ్ సక్సెస్ కాదు.. వాడే మా లక్కీ ఛార్మ్.. ఫంక్షన్ ఎప్పుడు పెడతారని అడిగా: చిరంజీవి
ఇది వరుణ్ తేజ్ సక్సెస్ కాదు.. వాడే మా లక్కీ ఛార్మ్.. ఫంక్షన్ ఎప్పుడు పెడతారని అడిగా: చిరంజీవి

కొరియన్ కనకరాజు’ విజయాన్ని పంచుకునేందుకు మంగళవారం (ఆగస్టు 11) రాత్రి మూవీ సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఒక సినిమా విజయం సాధిస్తే ఎంతోమంది కార్మికుల కుటుంబాలకు కడుపు నిండుతుందని, ఈ సంతోషంలో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.

ఈ సక్సెస్ వాడిదే

కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ లో చిరంజీవి సరదాగా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. "ఈ 'కొరియన్ కనకరాజు' సక్సెస్ వరుణ్ తేజ్ ఖాతాలో వేయొద్దు. మా బుడ్డోడు వాయు తేజ్ ఖాతాలో వేయాలి. వాడే మన లక్కీ చార్మ్" అని మెగాస్టార్ వ్యాఖ్యానించారు.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులకు సెప్టెంబర్ 10, 2025న కొడుకు పుట్టాడు. అతనికి వాయువ్ తేజ్ అని పేరు పెట్టారు. తండ్రి అయిన తర్వాత వరుణ్ తేజ్ నుంచి వచ్చిన ఫస్ట్ మూవీనే కొరియన్ కనకరాజు.

ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు

"వరుణ్ తేజ్ మొదటి నుంచి విలక్షణమైన పాత్రలే ఎంచుకున్నాడు. ‘ముకుంద’, ‘కంచె’, ‘అంతరిక్షం’ లాంటి సినిమాలు చూస్తే తను ఎప్పుడూ సేఫ్ జోన్‌లో ఉండటానికి ఇష్టపడలేదని అర్థమవుతుంది. కొన్నిసార్లు ఫలితాలు తేడా వచ్చినా, నటుడిగా వరుణ్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. అదే ధైర్యంతో వైవిధ్యమైన కథలతో ముందుకు వెళ్లు" అని ఈ సందర్భంగా వరుణ్‌కు చిరంజీవి సూచించారు.

ఫంక్షన్ ఎప్పుడు పెడతారని

అలాగే కొరియన్ ఫ్లేవర్‌ను మన నేటివిటీకి తగ్గట్లు జోడించి కామెడీ థ్రిల్లర్‌గా రూపొందించిన దర్శకుడు మేర్లపాక గాంధీ ఆలోచనను చిరు అభినందించారు. అనుకున్న బడ్జెట్, టైమ్‌లో సినిమా పూర్తి చేయడం పెద్ద విజయమన్నారు.

కమెడియన్ సత్య ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచాడని, కేవలం సత్య కామెడీ కోసమే సినిమాను మరోసారి చూడాలనిపిస్తోందని చిరంజీవి తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks