...
...
Next Story

Chirajeevi OTT: సుస్మిత‌ను చూస్తే గ‌ర్వంగా ఉంది.. ఈ సిరీస్‌ను ఎంజాయ్ చేశా.. చిరంజీవి ఓటీటీ సిరీస్‌ రివ్యూ.. మీరు చూశారా?

Chirajeevi OTT: ఓటీటీలోని ఓ సిరీస్ పై మెగాస్టార్ చిరంజీవి మనసు పారేసుకున్నారు. ఈ సిరీస్ పై తెగ ప్రశంసలు కురిపించేశారు. అలాగే తన కూతురు సుస్మిత పట్ల గర్వపడుతున్నట్లు పేర్కొన్నారు. మరి ఆ సిరీస్ ఏంటీ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఓ లుక్కేయండి.

Published on: Sep 5, 2026, 20:44:47 IST
Advertisement

Chirajeevi OTT: మెగాస్టార్ చిరంజీవి ఓ ఓటీటీ సిరీస్ పై తెగ ప్రశంసలు కురిపించేశారు. చిరుకు నచ్చిన ఆ సిరీసే.. ‘జగమే సంగీతం’ (Jagame Sangeetham). ఈ మ్యూజికల్ డ్రామా వెబ్ సిరీస్ పై చిరు రివ్యూ తెగ వైరల్ గా మారింది.

జగమే సంగీతం ఓటీటీ

సుస్మిత‌ను చూస్తే గ‌ర్వంగా ఉంది.. ఈ సిరీస్‌ను ఎంజాయ్ చేశా.. చిరంజీవి ఓటీటీ సిరీస్‌ రివ్యూ.. మీరు చూశారా? (instagram)
సుస్మిత‌ను చూస్తే గ‌ర్వంగా ఉంది.. ఈ సిరీస్‌ను ఎంజాయ్ చేశా.. చిరంజీవి ఓటీటీ సిరీస్‌ రివ్యూ.. మీరు చూశారా? (instagram)

చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మించిన జగమే సంగీతం వెబ్ సిరీస్ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ 8 ఎపిసోడ్ల పవర్‌ఫుల్ మ్యూజికల్ సిరీస్‌ను చిరంజీవి తాజాగా చూశారు. సిరీస్ మేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్, సంగీతం అద్భుతంగా ఉన్నాయంటూ సోషల్ మీడియా వేదికగా చిరు రివ్యూ పోస్ట్ చేశారు.

రివ్యూ వైరల్

పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఈ జగమే సంగీతం సిరీస్ తెరకెక్కింది. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మధుబాల, అక్షయ్, సుస్మితా శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌పై చిరంజీవి చేసిన రివ్యూ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రౌడ్ ఆఫ్ యు సుస్మితా!

తన కుమార్తె సుస్మితా కొణిదెల (Sushmita Konidela)పై చిరంజీవి ప్రశంసలు కురిపించారు. "ప్రైమ్ వీడియోలో 'జగమే సంగీతం' సిరీస్ చూశా. ఎంతగానో ఎంజాయ్ చేశా. అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్, కంటెంట్, విజువల్స్, ఆత్మను తాకే సంగీతంతో బ్యూటీఫుల్లీ క్రాఫ్టెడ్ సిరీస్ ఇది’’ అని చిరంజీవి పేర్కొన్నారు.

ఇలాంటి క్లాసిక్, హృదయానికి హత్తుకునే సిరీస్‌ను ప్రేక్షకులకు అందించినందుకు నా కూతురు సుస్మితా కొణిదెలను, అలాగే గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ టీమ్‌ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ నా హృదయపూర్వక అభినందనలు" అని చిరు తన రివ్యూ రాసుకొచ్చారు.

జగమే సంగీతం స్టోరీ ఇదే

‘జగమే సంగీతం’ సిరీస్ శాస్త్రీయ సంగీత వారసత్వం, ఆధునిక ఆలోచనల మధ్య నలిగిపోయే ఒక యువకుడి ప్రయాణం చుట్టూ సాగుతుంది. వైకుంఠపురం నేపథ్యంగా సాగే ఈ కథలో సంగీత సామ్రాట్ శాస్త్రి (ప్రకాష్ రాజ్) తన మనవడు బాలు (అక్షయ్ లగుసాని)ని తన కర్ణాటక సంగీత వారసుడిగా తీర్చిదిద్దాలనుకుంటాడు.

కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, పాత శత్రుత్వాలు, ఆధునిక పాప్ సంగీత ప్రపంచంతో అనుబంధం ఏర్పడినప్పుడు బాలు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? తన కుటుంబ పరంపరను కాపాడుకుంటూనే తనకంటూ ఒక స్వరాన్ని ఎలా గెలుచుకున్నాడు అనేది ఈ సిరీస్ సారాంశం.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks