...
...
Next Story

Chiranjeevi Sing Geetham: సింగ్ గీతం మూవీకి మెగా బూస్ట్.. సింగీతం శ్రీనివాసరావుపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ వైరల్

Chiranjeevi Sing Geetham: 94 ఏళ్ల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కలల సినిమా ఒక్క రోజులో థియేటర్లోకి రాబోతుంది. ‘సింగ్ గీతం’ మూవీ శుక్రవారం రిలీజ్ కానుంది. ఇప్పటికే అంచనాలు పెంచేసిన ఈ చిత్రానికి ఇప్పుడు మెగా బూస్ట్ దొరికింది. సింగీతం శ్రీనివాసరావు గురించి చిరంజీవి పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

Published on: Jun 11, 2026, 14:25:48 IST
Advertisement

Chiranjeevi Sing Geetham: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన అగ్ర దర్శకుడు, లెజెండరీ మేకర్ సింగీతం శ్రీనివాసరావు సరికొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ నెల 12వ తేదీన ‘సింగ్ గీతం’ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి ట్వీట్ తో సింగ్ గీతానికి మంచి బూస్ట్ లభించిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

చిరంజీవి ట్వీట్

సింగ్ గీతం మూవీకి మెగా బూస్ట్.. సింగీతం శ్రీనివాసరావుపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ వైరల్
సింగ్ గీతం మూవీకి మెగా బూస్ట్.. సింగీతం శ్రీనివాసరావుపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ వైరల్

రేపు విడుదల కానున్న సింగ్ గీతం సినిమాపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. సింగీతం శ్రీనివాసరావును తెలుగు సినిమా పరిశ్రమకు భీష్మాచార్యుడిగా అభివర్ణించిన చిరంజీవి, ఆయన పరిశ్రమకు దొరికిన ఒక అమూల్యమైన ఆస్తి, ఒక నిధి అని కొనియాడారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా చిరంజీవి ఒక సుదీర్ఘమైన, ఎమోషనల్ పోస్టును పంచుకున్నారు.

సినిమా పరిశ్రమకు మార్గదర్శకుడు

సింగీతం శ్రీనివాసరావు దర్శకుడిగా తెలుగు సినిమాకు చేసిన సేవలను ఈ సందర్భంగా చిరంజీవి గుర్తుచేసుకున్నారు. ఆయన కేవలం ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించడమే కాకుండా, పరిశ్రమలోకి ఎంతోమంది కొత్త కళాకారులను ఆహ్వానించి, వారికి అద్భుతమైన అవకాశాలు కల్పించారని చిరంజీవి ప్రశంసించారు.

మరో మైలురాయి

ఎందరో నటీనటులు, సాంకేతిక నిపుణుల జీవితాలకు మార్గదర్శకుడిగా నిలిచిన అలాంటి మహోన్నత వ్యక్తి దర్శకత్వంలో వస్తున్న ‘సింగ్ గీతం’ సినిమా భారతీయ చలనచిత్ర రంగంలో మరో మైలురాయిగా నిలుస్తుందని చిరంజీవి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

నాగ్ అశ్విన్ ఆలోచన అద్భుతం

ఒకవైపు ఆనాటి అద్భుత తరానికి ప్రతినిధిగా నిలిచిన సింగీతం శ్రీనివాసరావు, మరోవైపు నేటి తరం సరికొత్త ఆలోచనలను ప్రతిబింబించే నాగ్ అశ్విన్.. వీరిద్దరి కలయిక ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని చిరంజీవి కొనియాడారు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం

ఈ చిత్రానికి టాలీవుడ్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించడం విశేషం. దీనిపై చిరంజీవి స్పందిస్తూ.. తనకు ఎంతో ఇష్టమైన దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చడం మరింత ఉత్సాహాన్ని ఇస్తోందని చెప్పారు.

నిర్మాత నాగ్ అశ్విన్‌తో పాటు స్వప్న సినిమా, వైజయంతీ ఫిల్మ్స్ పతాకాలకు, అలాగే ఈ చిత్రంలో భాగమైన నటీనటులకు, సాంకేతిక నిపుణులందరికీ చిరంజీవి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జూన్ 12న విడుదల కానున్న ఈ సినిమాపై చిరంజీవి చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

People Also Ask- తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గురించి చిరంజీవి ఏమన్నారు?

జూలై: సింగీతం శ్రీనివాసరావును తెలుగు సినిమా పరిశ్రమకు భీష్మాచార్యుడని, ఆయన పరిశ్రమకు దొరికిన ఒక అమూల్యమైన ఆస్తి, నిధి అని చిరంజీవి కొనియాడారు.

ప్రశ్న: ‘సింగీతం’ సినిమాను ఎవరు నిర్మిస్తున్నారు?

జవాబు: ఈ చిత్రాన్ని వైజయంతీ ఫిల్మ్స్, స్వప్న సినిమా పతాకాలపై ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు.

ప్రశ్న: ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నది ఎవరు?

జవాబు: ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (DSP) సంగీతం అందిస్తున్నారు.

ప్రశ్న: ‘సింగీతం’ సినిమా ఎప్పుడు విడుదల కానుంది?

జవాబు: ఈ చిత్రం జూన్ 12వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe