మన జీవితంలో చాయ్ ఎంతో ముఖ్యమైనదిగా మారింది.. చాయ్ వాలా సినిమాపై సిటీ కమిషనర్ సజ్జనార్ కామెంట్స్
తెలుగు యంగ్ హీరో శివ కందుకూరి నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా సినిమా చాయ్ వాలా. రాజీవ్ కనకాల కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ఫిబ్రవరి 6న రిలీజ్ కానుంది. ఇటీవల చాయ్ వాలా టైటిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో సిటీ కమిషనర్ సజ్జనార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
టాలీవుడ్ యంగ్ హీరో శివ కందుకూరి నటించిన లేటెస్ట్ మూవీ చాయ్ వాలా. హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధా వి పాపుడిప్పు నిర్మించిన ఈ సినిమాలో రాజీవ్ కనకాల, తేజు అశ్విని, రాజ్‌కుమార్ కసిరెడ్డి, చైతన్య కృష్ణ, వడ్లమాని శ్రీనివాస్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.

చాయ్ వాలా టైటిల్ సాంగ్ రిలీజ్
చాయ్ వాలా సినిమాకు ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించారు. వెంకట్ ఆర్ పాపుడిప్పు సహ నిర్మాతగా వస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతమందించారు. ఈ మూవీని ఫిబ్రవరి 6న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఇటీవల చాయ్ వాలా టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ మేరకు నిర్వహించిన చాయ్ వాలా టైటిల్ సాంగ్ రిలీజ్ కార్యక్రమంలో సిటీ కమిషనర్ సజ్జనార్, నీలోఫర్ ఫౌండర్ బాబురావు, కిమ్స్ ఎండీ రవి కిరణ్ వర్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
సీనియర్ యాక్టర్స్ నటించారు
ఈ సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో సిటీ కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ .. "మన జీవితంలో చాయ్ అనేది ఎంతో ముఖ్యమైనదిగా మారింది. ఈ ‘చాయ్ వాలా’ టైటిల్ సాంగ్ చాలా బాగుంది. శివ కందుకూరి లాంటి యంగ్ హీరో, రాజీవ్ కనకాల లాంటి సీనియర్ యాక్టర్స్ ఇందులో నటించారు" అని అన్నారు.
"నీలోఫర్ బాబుగారు అందరికీ స్పూర్తి. ఆయన ఈ మూవీని ఎక్కువగా ప్రమోట్ చేయాలి. ఫిబ్రవరి 6న ఈ చిత్రం రాబోతోంది. అందరూ ఈ మూవీని చూసి హిట్ చేసి, యంగ్ టీంని ఆశీర్వదించాలి. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది" అని సిటీ కమిషనర్ సజ్జనార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
చాయ్‌తోనే ఈ స్టేజీకి
నీలోఫర్ ఫౌండర్ బాబురావు మాట్లాడుతూ .. "నేను చాయ్‌తోనే ఈ స్థాయికి వచ్చాను. ఈ ‘చాయ్ వాలా’ కార్యక్రమానికి నన్ను పిలవడం ఆనందంగా ఉంది. చాయ్ అంటే అందరికీ ఓ ఎమోషన్. చాయ్ వాలా అనే పేరు పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు.
"ఓ చాయ్ వాలా దేశానికి ప్రధాని అయ్యారు. ఈ చాయ్ వాలా మూవీతో టీం అందరికీ మంచి గుర్తింపు రావాలి. సజ్జనార్ గారి హస్తవాసి చాలా మంచిది. ఆయన చేతుల మీదుగా పాట రిలీజ్ అవ్వడం సంతోషంగా ఉంది" అని బాబురావు పేర్కొన్నారు.
అందరికీ కనెక్ట్ అయ్యే ఎమోషన్
కిమ్స్ ఎండీ రవి కిరణ్ వర్మ మాట్లాడుతూ .. "అందరికి కనెక్ట్ అయ్యే సినిమా తీయాలని ప్రమోద్ చెబుతుండేవాడు. చాయ్ అనేది అందరికీ కనెక్ట్ అయ్యే ఎమోషన్. ఇక ఇందులో తండ్రీకొడుకుల రిలేషన్‌ను చూపించాడు. ‘చాయ్ వాలా’ టీంకి ఆల్ ది బెస్ట్" అని అన్నారు.
నీలోఫర్ కేఫ్ ఎండీ శశాంక్ మాట్లాడుతూ .. "నేను ఎక్కువగా సినిమాలు చూస్తాను. మా నాన్న బాబురావు గారు అస్సలు సినిమాలు చూడరు. కేవలం ‘చాయ్ వాలా’ అనే టైటిల్ చూసి ఇక్కడకు వచ్చారు. ఇందులో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌ను చక్కగా చూపించబోతోన్నారు. టీంకు ఆల్ ది బెస్ట్" అని చెప్పారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


