OTT Horror: ఓటీటీలోకి ఇవాళ తెలుగులో వచ్చిన హారర్ సర్వైవల్ థ్రిల్లర్- మనుషుల్లా ఆలోచించే జాంబీలు-రియల్ మనుషులు బతుకుతారా?
Colony OTT Streaming In Telugu: ఓటీటీలోకి ఇవాళ సైన్స్ ఫిక్షన్ హారర్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా కాలనీ తెలుగులో స్ట్రీమింగ్కు వచ్చింది. డిఫరెంట్ జాంబీ థ్రిల్లర్స్ తెరకెక్కించిన ట్రైన్ టు బుసాన్ డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. మరి కాలనీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసుకుందాం.
Colony OTT Release In Telugu: తెలుగు ప్రేక్షకులకు కొరియన్ థ్రిల్లర్స్, యాక్షన్ సినిమాలంటే ఎనలేని క్రేజ్. అందులోనూ 'ట్రైన్ టు బుసాన్' వంటి సీట్-ఎడ్జ్ జాంబీ హారర్ థ్రిల్లర్లను మన వాళ్లు బాగా ఆదరిస్తారు. అదే తరహాలో ఉత్కంఠభరితమైన కథాంశంతో రూపొందిన లేటెస్ట్ కొరియన్ సైన్స్ ఫిక్షన్ జాంబీ హారర్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'కాలనీ' (Colony).

ఇతర జాంబీ థ్రిల్లర్స్‌తో పోలిస్తే
మే 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అప్పటివరకు వచ్చిన జాంబీ థ్రిల్లర్స్ సినిమాలతో పోలీస్తే డిఫరెంట్ సీన్స్‌తో అలరించింది. కొంచెం ది లాస్ట్ ఆఫ్ అజ్, ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్ వంటి సూపర్ హిట్ ఓటీటీ సిరీస్‌ల ఛాయలు ఉన్నప్పటికీ థ్రిల్లింగ్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో కాలనీ ఆకట్టుకుంది.
శవాలుగా మారిన జాంబీలు మనుషుల్లా ఆలోచించడం, బ్రెయిన్స్ ద్వారానే సమాచారాన్ని పంచుకోవడం వంటి యూనిక్ కాన్సెప్ట్‌తో కాలనీని తెరకెక్కించారు. ఐఎమ్‌డీబీలో 6.5 రేటింగ్ ఉన్న కాలనీ సినిమాలో 81 శాతం ఫ్రెష్ కంటెంట్ ఉందని సర్టిఫికెట్ వచ్చింది. ఇలాంటి కాలనీ ఓటీటీలోకి ఇవాళ (అక్టోబర్ 16) తెలుగులో వచ్చేసింది.
డుంగురి బిల్డింగ్.. ఊహించని జాంబీ విలయ తాండవం
ఈ చిత్ర కథ అంతా 'డుంగురి బిల్డింగ్' అనే బహుళ అంతస్తుల భవనం చుట్టూ తిరుగుతుంది. బయోటెక్నాలజీ ప్రొఫెసర్ క్వాన్ సెజియాంగ్ (జున్ జీ హ్యూన్) తన మాజీ భర్త హాన్ గ్యుసియాంగ్ (గో సూ) సూచనతో ఆ బిల్డింగ్‌లో జరిగే ఒక సైన్స్ కాన్ఫరెన్స్‌కు హాజరవుతుంది.
ఆ సమయంలో అక్కడ అనుకోకుండా ఒక ప్రాణాంతకమైన జాంబీ వైరస్ వ్యాపిస్తుంది. క్షణాల్లోనే ఆ వైరస్ ఉత్పరివర్తనం (మ్యూటేషన్) చెందుతూ భవనంలో ఉన్న అందరినీ రాక్షసంగా చంపేస్తుంటుంది. అధికారులు ఆ భవనాన్ని పూర్తిగా సీల్ చేయడంతో, బయటకు వెళ్లే దారి లేక అక్కడ ఉన్నవారు దిగ్బంధం అవుతారు.
చాకచక్యంగా పోరాడే నాయకురాలు.. సోదర బంధం
ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రొఫెసర్ సెజియాంగ్ ధైర్యంగా ముందుకు వస్తుంది. వైరస్ బారిన పడకుండా మిగిలిన వారిని కాపాడేందుకు ఒక శక్తివంతమైన నాయకురాలిగా మారుతుంది. జాంబీల ప్రవర్తనను నిశితంగా గమనిస్తూ, అక్కడ నుంచి తప్పించుకోవడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తుంది.
ఆమెకు అండగా ఆ భవన భద్రతా సిబ్బంది సభ్యుడు చోయ్ హ్యూన్సియోక్ (జీ చాంగ్ ఉక్) నిలుస్తాడు. కాళ్ల పక్షవాతంతో బాధపడుతున్న తన అక్క చోయ్ హ్యూన్‌హీ (కిమ్ షిన్ రోక్)ని కాపాడుకోవడానికి హ్యూన్సియోక్ తన ప్రాణాలను పణంగా పెడతాడు. ఆ తర్వాత ఏమైంది?, వాళ్లంతా బతికారా?, వైరస్‌ని నిర్మూలించగలిగారా? అనేదే మిగతా కథ.
కాలనీ ఓటీటీ స్ట్రీమింగ్
ప్రఖ్యాత దర్శకుడు, ట్రైన్ టు బుసాన్ వంటి క్రేజీ ఫిల్మ్ తెరకెక్కించిన డైరెక్టర్ యాన్ సంగ్ హో కాలనీకి దర్శకత్వం వహించారు. ఆయన టేకింగ్, యాక్షన్ సీన్స్, సర్వైవల్-హారర్ ఎలిమెంట్స్, బీజీఎమ్ నెక్ట్స్ లెవెల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తాయి. ఇంతటి క్రేజ్ మూవీ అయిన కాలనీ ఓటీటీలో నేటి నుంచి సందడి చేస్తుంది.
జియో హాట్‌స్టార్‌లో కాలనీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ (అక్టోబర్ 16) తెలుగు, హిందీ, తమిళం వంటి 3 భాషల్లో కాలనీ ఓటీటీ రిలీజ్ అయింది. హై-వోల్టేజ్ యాక్షన్, విభిన్నమైన జాంబీ కాన్సెప్ట్, బలమైన ఎమోషన్స్ కోరుకునే హారర్ ప్రియులకు జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోన్న కాలనీ వీకెండ్‌కు బెస్ట్ ఆప్షన్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


