...
...
Next Story

అప్పు తీర్చలేక జైలు పాలైన కమెడియన్.. అతని కోసం తరలి వస్తున్న స్టార్ హీరోలు, నటులు

బాలీవుడ్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ ను ఆదుకోవడానికి బాలీవుడ్ స్టార్లు ముందుకు వస్తున్నారు. అప్పు తీర్చలేక జైలు పాలయ్యాడని తెలుసుకొని అతనికి సాయం చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని రాజ్‌పాల్ మేనేజర్ వెల్లడించాడు.

Published on: Feb 11, 2026, 15:22:47 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌ రూ. 9 కోట్ల అప్పు కేసులో తీహార్ జైలుకు వెళ్లిన విషయం తెలుసు కదా. ఈ విషయంలో బాలీవుడ్ ఇండస్ట్రీ అతనికి అండగా నిలిచింది. "నాకు ఎవరూ లేరు" అని అతడు ఎమోషనల్ అయిన వేళ.. సోనూ సూద్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ వంటి స్టార్లు సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఎవరు ఎంత సాయం చేశారో ఇక్కడ చూడండి.

సల్మాన్, అజయ్ దేవగన్ భరోసా..

అప్పు తీర్చలేక జైలు పాలైన కమెడియన్.. అతని కోసం తరలి వస్తున్న స్టార్ హీరోలు, నటులు
అప్పు తీర్చలేక జైలు పాలైన కమెడియన్.. అతని కోసం తరలి వస్తున్న స్టార్ హీరోలు, నటులు

"నాకు ఇండస్ట్రీలో స్నేహితులు ఎవరూ లేరు.." అంటూ జైలుకు వెళ్లే ముందు ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్ చేసిన కామెంట్స్ అందరినీ కలిచివేశాయి. రూ. 9 కోట్ల అప్పు ఎగ్గొట్టారన్న కేసులో అతడు తీహార్ జైలులో లొంగిపోవాల్సి వచ్చింది. అయితే అతడు కష్టాల్లో ఉన్నాడని తెలియగానే బాలీవుడ్ మొత్తం ఒక్కతాటిపైకి వచ్చింది.

రాజ్‌పాల్ యాదవ్‌కు మద్దతుగా మొదట గళం విప్పింది రియల్ హీరో సోనూ సూద్. ఇండస్ట్రీ అంతా అతనికి సాయం చేయాలని పిలుపునిచ్చారు. తాజాగా రాజ్‌పాల్ మేనేజర్ గోల్డీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "రాజ్‌పాల్‌కు సాయం చేయడానికి చాలా మంది ముందుకొచ్చారు. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, డేవిడ్ ధావన్, వరుణ్ ధావన్, రతన్ జైన్ వంటి వారు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. ఆర్థికంగా ఆదుకోవడానికి సిద్ధమయ్యారు," అని తెలిపారు. రేపటికల్లా అతనికి బెయిల్ వచ్చి బయటకు వస్తారని ఆశిస్తున్నట్లు మేనేజర్ పేర్కొన్నారు.

ఎవరెవరు ఎంత సాయం చేశారంటే?

సోనూ సూద్: రాజ్‌పాల్‌కు తన తర్వాతి సినిమాలో అవకాశం ఇవ్వడమే కాకుండా, కొంత సైనింగ్ ఎమౌంట్‌ను కూడా సాయంగా అందించారు.

తేజ్ ప్రతాప్ యాదవ్: రాజకీయ నాయకుడు తేజ్ ప్రతాప్ రూ. 11 లక్షలు ఆఫర్ చేశారు.

కేఆర్కే (KRK): వివాదాస్పద విమర్శకుడు కేఆర్కే కూడా రూ. 10 లక్షలు సాయం ప్రకటించారు.

అసలు కేసు ఏంటి?

2010లో రాజ్‌పాల్ యాదవ్ తన దర్శకత్వంలో వచ్చిన 'అతా పతా లాపతా' సినిమా కోసం ఢిల్లీకి చెందిన ఒక కంపెనీ నుంచి రూ. 5 కోట్లు అప్పు తీసుకున్నాడు. సినిమా ఫ్లాప్ అవ్వడం, చెక్కులు బౌన్స్ అవ్వడంతో అప్పు తీర్చలేకపోయాడు. వడ్డీతో కలిపి ఆ మొత్తం ఇప్పుడు దాదాపు రూ. 9 కోట్లకు చేరింది. కోర్టు ఆదేశాల మేరకు గడువులోగా డబ్బు కట్టలేకపోవడంతో అతడు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఇండస్ట్రీ సపోర్ట్ దొరకడంతో ఆయన త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks