...
...
Next Story

Rajpal: షారుఖ్ ఖాన్‌తో మనస్పర్థలు- సూపర్ హిట్ మూవీలో ఛాన్స్ మిస్ చేసుకున్న కమెడియన్- అసలు నిజం చెప్పిన రాజ్‌పాల్ యాదవ్

Rajpal Yadav Reveals Shahrukh Khan Movie Role Missing: స్టార్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ బ్లాక్ బస్టర్ సినిమా 'ఓం శాంతి ఓం'లో నటించే అవకాశాన్ని ఎందుకు కోల్పోయారో వెల్లడించారు. ఒక చిన్న అపార్థం కారణంగా జరిగిన ఈ ఆసక్తికర ఉదంతం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Published on: Apr 13, 2026, 15:12:24 IST
Advertisement

బాలీవుడ్ అగ్ర కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ అనేక సినిమాల్లో తన నటనతో నవ్వించారు. ఇటీవల కోర్టు కేసు నుంచి బయటకు వచ్చిన రాజ్‌పాల్ యాదవ్ ప్రస్తుతం హారర్ కామెడీగా తెరకెక్కిన 'భూత్ బంగ్లా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ప్రత్యేకంగా ఒక పాత్రను

షారుఖ్ ఖాన్‌తో మనస్పర్థలు- సూపర్ హిట్ మూవీలో ఛాన్స్ మిస్ చేసుకున్న కమెడియన్- అసలు నిజం చెప్పిన రాజ్‌పాల్ యాదవ్
షారుఖ్ ఖాన్‌తో మనస్పర్థలు- సూపర్ హిట్ మూవీలో ఛాన్స్ మిస్ చేసుకున్న కమెడియన్- అసలు నిజం చెప్పిన రాజ్‌పాల్ యాదవ్

భూత్ బంగ్లా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన చేదు జ్ఞాపకాలను పంచుకున్నారు రాజ్‌పాల్ యాదవ్. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నిర్మించిన 'ఓం శాంతి ఓం' సినిమాలో రాజ్‌పాల్ కోసం ప్రత్యేకంగా ఒక పాత్రను రాయించారట. కానీ, ఆ పాత్రను రాజ్‌పాల్ యాదవ్ తిరస్కరించినట్లు షారుఖ్ దగ్గర ఎవరో తప్పుడు సమాచారం చేరవేశారని ఆయన తెలిపారు.

"నీకోసం ఒక మంచి లెంత్ ఉన్న రోల్ రాశాము. కానీ, నీకు టైమ్ లేదని రిజెక్ట్ చేశావంట కదా?" అని స్వయంగా షారుఖ్ ఖాన్ అడిగే వరకు రాజ్ పాల్‌కు ఈ విషయం తెలియలేదని రాజ్‌పాల్ యాదవ్ చెప్పుకొచ్చారు.

వెన్నుపోటు పొడిచింది ఎవరు?

సినిమా రంగంలో తెర వెనుక రాజకీయాలు ఎలా ఉంటాయో రాజ్‌పాల్ మాటల్లో స్పష్టమైంది. ఈ అపార్థం గురించి రాజ్‌పాల్ యాదవ్ మాట్లాడుతూ.. "బిల్లు బార్బర్ షూటింగ్ సమయంలో ఈ విషయం నాకు తెలిసింది. నా మేనేజర్‌ను అడిగితే అతడికి కూడా ఏమీ తెలియదు. ఎవరో మధ్యలో కావాలనే నా గురించి షారుక్ భాయ్‌కి తప్పుగా చెప్పారు. నా ఫోటోను కూడా నెగెటివ్‌గా ప్రెజెంట్ చేశారని తెలిసింది. బాలీవుడ్‌లో ఇలాంటివి సర్వసాధారణం" అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయం తెలిసిన వెంటనే రాజ్‌పాల్ యాదవ్, షారుక్ ఖాన్‌ను కలిసి అసలు నిజం వివరించారు. 'కల్ హో నా హో' సినిమాలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సీన్లు ఇప్పటికీ ప్రేక్షకులను నవ్విస్తుంటాయి. ఆ చనువుతోనే ఇద్దరూ మాట్లాడుకుని అపార్థాలను తొలగించుకున్నారట. "మేము ఇద్దరం కౌగిలించుకున్నాం, అప్పటితో ఆ ఇష్యూ క్లియర్ అయిపోయింది" అని రాజ్‌పాల్ యాదవ్ చెప్పుకొచ్చారు.

త్వరలో 'భూత్ బంగ్లా' హంగామా

రాజ్‌పాల్ యాదవ్ ప్రస్తుతం ప్రియదర్శన్ దర్శకత్వంలో 'భూత్ బంగ్లా' అనే హారర్ కామెడీ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తుండగా, వామీకా గబ్బి, టబు, పరేశ్ రావెల్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

దాదాపు పుష్కర కాలం తర్వాత ప్రియదర్శన్ - అక్షయ్ కుమార్ కాంబినేషన్ సెట్ అవ్వడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 17న ఈ హారర్ కామెడీ మూవీ భూత్ బంగ్లా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe