Telugu OTT: అక్టోబర్ ఒకటో తేదీన థియేటర్లలో విడుదలై డీసెంట్ హిట్‌గా నిలిచిన 'కామ్రేడ్ కళ్యాణ్' ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. మూడు వారాల్లోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రావడం విశేషం.
కామ్రేడ్ కళ్యాణ్ ఓటీటీ

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' (Amazon Prime Video)లోకి కామ్రేడ్ కళ్యాణ్ వచ్చేసింది. ఇవాళ (అక్టోబర్ 30) నుంచి సర్ ప్రైజ్ స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ప్రైమ్ వీడియో ఈ చిత్రాన్ని ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురావడం విశేషం. థియేటర్లలో సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు, ఈ వీకెండ్‌లో తమకు నచ్చిన భాషలో ఈ చిత్రాన్ని ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయవచ్చు.
నవ్వులు పూయించే 'కామ్రేడ్ కళ్యాణ్' కథ ఇదే!
ఇదొక పీరియాడిక్ యాక్షన్ కామెడీ డ్రామా. 1990ల కాలంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని మాడుగుల అనే గ్రామం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. గ్రామంలో థియేటర్ ఆపరేటర్‌గా పనిచేసే కళ్యాణ్ (శ్రీవిష్ణు) ఎప్పటికైనా ఆ థియేటర్‌ను సొంతం చేసుకోవాలని కలలు కంటుంటాడు. ఈ క్రమంలో సితార (మహిమా నంబియార్) తో ప్రేమలో పడతాడు.
అయితే, ఆమె కుటుంబాన్ని ఓ ఫైనాన్సియర్ బారి నుంచి కాపాడేందుకు కళ్యాణ్‌కు భారీగా డబ్బు అవసరం అవుతుంది. ఆ డబ్బు కోసం తన ఫ్రెండ్ దుబాయ్ బాబు (సత్య) ఇచ్చిన సలహాతో.. ప్రభుత్వ నక్సలైట్ పునరావాస స్కీమ్ కింద డబ్బులు కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు.
ఒక నక్సలైట్‌గా గెటప్ మార్చి లొంగిపోదామనుకున్న కళ్యాణ్, ఊహించని విధంగా నిజమైన నక్సలైట్లకు, పోలీసులకు మధ్య ఇరుక్కుంటాడు. ఆ తర్వాత జరిగిన కన్‌ఫ్యూజన్, కామెడీ డ్రామానే ఈ సినిమా స్టోరీ.
అదరగొట్టిన కాస్టింగ్
కామ్రేడ్ కళ్యాణ్ సినిమాలో శ్రీవిష్ణు తన మార్క్ కామెడీ టైమింగ్‌తో అదరగొట్టగా, మలయాళ బ్యూటీ మహిమా నంబియార్ హీరోయిన్‌గా ఆకట్టుకుంది. ఇక దుబాయ్ బాబుగా కమెడియన్ సత్య మరోసారి తన పంచ్‌లతో థియేటర్లను షేక్ చేశాడు. వెన్నెల కిషోర్, నెల్లూరు సుదర్శన్, రాధిక శరత్ కుమార్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు జానకిరామ్ మారెళ్ల ఎంచుకున్న పాయింట్, దాన్ని తెరకెక్కించిన విధానం బాగుంది.
స్కంద వాహన మోషన్ పిక్చర్స్, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి ఈ సినిమాను రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మించారు. అలాగే లేటెస్ట్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్.
{{/usCountry}}స్కంద వాహన మోషన్ పిక్చర్స్, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి ఈ సినిమాను రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మించారు. అలాగే లేటెస్ట్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్.
{{/usCountry}}సో, ఎలాంటి వల్గారిటీ లేకుండా క్లీన్ కామెడీతో ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా నవ్వుకునేలా ఉన్న ఈ 'కామ్రేడ్ కళ్యాణ్'ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసేయండి.