వేర్ ఈజ్ చంద్రిక‌? ఓటీటీలోకి వ‌స్తున్న తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్ హార‌ర్ థ్రిల్ల‌ర్ సిరీస్ సీజ‌న్ 2-వ‌ణికించే ట్విస్ట్‌లు

2025లో ఓటీటీలో అదరగొట్టిన తెలుగు వెబ్ సిరీస్ ల్లో కానిస్టేబుల్ కనకం ఒకటి. ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సిరీస్ సీజన్ 2 రాబోతుంది. ప్రీమియర్ డేట్ ను ఓటీటీ ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేసింది. 

Published on: Dec 28, 2025, 21:38:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సస్పెన్స్ కు తెరపడనుంది. తెలుగు ఆడియన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్న పాపులర్ వెబ్ సిరీస్ సీజన్ 2 రాబోతుంది. తెలుగులో హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన వెబ్ సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సిరీస్ సీజన్ 2 ప్రీమియర్ డేట్ అనౌన్స్ చేశారు. దీంతో ‘వేర్ ఈజ్ చంద్రిక?’ అనే ప్రశ్నకు సమాధానం దొరకబోతుంది.

ఓటీటీలోకి హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సీజన్ 2 (x/etvwin)
ఓటీటీలోకి హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సీజన్ 2 (x/etvwin)

కానిస్టేబుల్ కనకం ఓటీటీ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ఇదో హారర్ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈటీవీ విన్ ఒరిజినల్ గా ఇది డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆగస్టు 14, 2025 నుంచి ఓటీటీలోకి అందుబాటులో వచ్చింది.

సీజన్ 2 డేట్

ఇప్పుడు కానిస్టేబుల్ కనకం సీజన్ 2 రాబోతుంది. ఈ సీజన్ 2 జనవరి 8, 2026 నుంచి స్ట్రీమింగ్ కానుందని ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఇవాళ (డిసెంబర్ 28) ప్రకటించింది.

‘‘నిశ్శబ్దానికి ఎన్నో ప్రశ్నలు. సీజన్ 2లో అన్ని సమాధానాలు ఉంటాయి. అన్ని ప్రశ్నలు ఒకే నిజానికి దారి తీస్తాయి. చంద్రిక ఎక్కడ? ఈటీవీ విన్ లో జనవరి 8 నుంచి కానిస్టేబుల్ కనకం సీజన్ 2’’ అని ఈటీవీ విన్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

ఉత్కంఠ రేపేలా

కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ ను ఆద్యంత ఉత్కంఠ రేపేలా తెరకెక్కించారు. ఈ థ్రిల్లర్ సిరీస్ కు ప్రశాంత్ కుమార్ డైరెక్టర్. ఇందులో వర్ష బొల్లమ్మ లేడీ కానిస్టేబుల్ గా నటించింది. సీనియర్ నటుడు రాజీవ్ కనకాల హెడ్ కానిస్టేబుల్ గా కీలక పాత్ర పోషించాడు. ఇంకా అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ మాత్రం మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుంది.

కానిస్టేబుల్ కనకం స్టోరీ

కానిస్టేబుల్ కనకం సీజన్ 1లో 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ సీజన్ 1 ఆద్యంతం థ్రిల్, హారర్, మిస్టరీ అంశాలతో సాగుతుంది. 1998 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని రేపల్లె గ్రామ సమీపంలో అడవిగుట్ట వైపు వెళ్లే అమ్మాయిలు కనిపించకుండా పోతుంటారు. దీంతో పోలీసులు, ఆ ఊరి ప్రెసిడెంట్ (అవసరాల శ్రీనివాస్) అటు వైపు, ముఖ్యంగా రాత్రి పూట ఎవరూ వెళ్లొద్దని చాటింపు వేయిస్తారు.

అమ్మాయిల మిస్సింగ్

అడవి గుట్ట వైపు వెళ్లిన ముగ్గురు మహిళలు కనిపించకుండా పోతుంటారు. అదే గ్రామానికి కనకం (వర్ష బొల్లమ్మ) కానిస్టేబుల్‌గా వస్తుంది. చంద్రిక (మేఘలేఖ)తో ఆమెకు మంచి స్నేహ బంధం ఉంటుంది. కానీ చంద్రిక మిస్ అవుతుంది. ఎవరి సహకారం లేకపోయినా కనకం ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తుంది. మిస్ అయిన మిగతా అమ్మాయిలకు ఏమైందో తెలుస్తుంది. కానీ చంద్రిక ఆచూకీ దొరకదు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More