...
...
Next Story

Romantic OTT: అఫీషియల్..ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ రొమాంటిక్ డ్రామా..కోర్ట్ హీరోయిన్ శ్రీదేవి సినిమా..జెన్ జీకి నచ్చేలా

Romantic OTT: కోర్ట్ సినిమాతో పాపులర్ అయిన తెలుగమ్మాయి శ్రీదేవి హీరోయిన్ గా నటించిన తమిళ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ పై అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కాబోతున్న ఈ మూవీ ఏంటీ? అసలు ఎందుకు చూడాలి? అనే విషయాలపై ఓ లుక్కేయండి.

Published on: Nov 15, 2026, 08:29:29 IST
Advertisement

Romantic OTT: సినీ ఇండస్ట్రీకి ఎప్పటికప్పుడు కొత్త హీరోలు, హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అలా తెలుగులో అడుగుపెట్టిన అమ్మాయి శ్రీదేవి. నేచురల్ స్టార్ నాని నిర్మించిన ‘కోర్ట్’ సినిమాతో ఈ అమ్మాయికి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత శ్రీదేవి తమిళంలో ఎంట్రీ ఇస్తూ చేసిన మూవీ ‘హైకూ’. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రాబోతుంది.

హైకూ ఓటీటీ రిలీజ్ డేట్

అఫీషియల్..ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ రొమాంటిక్ డ్రామా..కోర్ట్ హీరోయిన్ శ్రీదేవి సినిమా..జెన్ జీకి నచ్చేలా
అఫీషియల్..ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ రొమాంటిక్ డ్రామా..కోర్ట్ హీరోయిన్ శ్రీదేవి సినిమా..జెన్ జీకి నచ్చేలా

కోర్ట్ హీరోయిన్ శ్రీదేవి తమిళంలో చేసిన మూవీ ‘హైకూ’ ఓటీటీ రిలీజ్ డేట్ పై అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఈ రొమాంటిక్ డ్రామా పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ శుక్రవారం అంటే నవంబర్ 20 నుంచి ఈ మూవీని ఓటీటీలో చూడొచ్చు. కమింగ్ ఆన్ ఫ్రైడే అంటూ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై నెట్‌ఫ్లిక్స్‌ అప్డేట్ ఇచ్చింది.

స్టోరీ ఏంటంటే?

హైకూ మూవీ స్టోరీ చూస్తే ఇది ప్రస్తుత తరం అంటే జెన్ జీకి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కిందని స్పష్టమవుతోంది. మనోహర్ అలియాస్ మనో (ఏగన్) ఓ కాలేజీ స్టూడెంట్. అయితే కాలేజీలో గొడవ కారణంగా సస్పెండ్ అవుతాడు. అదే టైమ్ లో 2000 మంది అమ్మాయిలు ఉండే లేడీస్ కాలేజీలో ఒకే ఒక్క అబ్బాయిగా మనో చేరాల్సి వస్తుంది.

ఆ లేడీస్ కాలేజీలో పవళకొడి (శ్రీదేవి)తో మనో ప్రేమలో పడతాడు. కానీ అనుకోని కారణాల వల్ల వీళ్లు విడిపోతారు. కట్ చేస్తే కొన్నేళ్ల తర్వాత చెన్నైలో సాఫ్ట్ వేర్ టీమ్ లీడర్ గా మనో పని చేస్తుంటాడు. అతని లైైఫ్ లోకి ట్రైనీ నివేదా (ఫెమినా జార్జ్) వస్తుంది. కానీ అక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదేంటో తెలియాలంటే ఓటీటీలో హైకూ మూవీ చూడాల్సిందే.

ఎందుకు చూడాలంటే?

• యూత్‌ఫుల్ & రిలేటబుల్ పాయింట్: పాత బ్రేకప్ జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చి కొత్త రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెట్టేటప్పుడు యువత ఎదుర్కొనే మానసిక సంఘర్షణను ఇందులో సహజంగా చూపించారు. పార్ట్ నర్ ఆత్మగౌరవాన్ని గౌరవించడం ఎంత ముఖ్యమో ఈ కథ గుర్తుచేస్తుంది.

• సహజమైన నటన: 'కోర్ట్' సినిమాతో మెప్పించిన శ్రీదేవి ఈ హైకూ సినిమాలోనూ తన పాత్రలో చాలా పరిణతితో నటించింది. ఏగన్ తన పాత్రకు న్యాయం చేయగా, ఫెమినా జార్జ్ తన క్యూట్ నటనతో సెకండాఫ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

• ఆకట్టుకునే కాలేజీ కామెడీ: లేడీస్ కాలేజీలో ఒక్కడే అబ్బాయిగా చేరిన హీరో పడే ఇబ్బందులు, ఫస్టాఫ్‌లో వచ్చే కాలేజీ సన్నివేశాలు సరదాగా సాగుతూ మంచి వినోదాన్ని పంచుతాయి.

• సంగీతం & విజువల్స్: సిద్ధూ కుమార్ అందించిన మెలోడీ పాటలు, నేపథ్య సంగీతం ప్రేమ సన్నివేశాలకు ప్రాణం పోశాయి. పియూష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ సినిమాకు ఆహ్లాదకరమైన లుక్‌ను ఇచ్చింది.

ఇంట్లోనే కూర్చుని ఓటీటీలో మంచి యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామా చూడాలనుకునే వాళ్లకు ఈ హైకూ మూవీ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks