...
...
Next Story

OTT Thriller: పిల్లాడు మిస్సింగ్-తండ్రి పోరాటం-ఓటీటీలోకి డైరెక్ట్ గా మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్-వణికిస్తున్న ట్రైలర్!

OTT Thriller: ఒరిజినల్ సినిమాలు, సిరీస్ లతో ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్న జీ5 మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తీసుకొస్తోంది. సస్పెన్స్, మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన ‘డాలింబ్’ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. ఇవాళ రిలీజైన ట్రైలర్ తో సినిమాపై హైప్ పెరిగింది.

Published on: Nov 25, 2026, 13:50:31 IST
Advertisement

OTT Thriller: ‘‘కొన్ని కథలు వాటంతట అవే బయటపడవు. అవి మెల్లగా చిక్కుముడులు విప్పుకుంటాయి. కొన్ని ముగింపులు మొత్తాన్ని మార్చేస్తాయి’’.. ఇదీ డాలింబ్ ట్రైలర్ రిలీజ్ పోస్టులో మేకర్స్ పెట్టిన క్యాప్షన్. ఈ క్యాప్షన్ చూస్తుంటేనే ఈ సినిమాలో మిస్టరీ ఏ లెవల్ లో ఉండబోతుందనేది అర్థం చేసుకోవచ్చు.

డాలింబ్ ట్రైలర్

పిల్లాడు మిస్సింగ్-తండ్రి పోరాటం-ఓటీటీలోకి డైరెక్ట్ గా మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్-వణికిస్తున్న ట్రైలర్!
పిల్లాడు మిస్సింగ్-తండ్రి పోరాటం-ఓటీటీలోకి డైరెక్ట్ గా మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్-వణికిస్తున్న ట్రైలర్!

జీ5 ఓటీటీ ఒరిజినల్ మూవీగా రాబోతున్న డాలింబ్ ట్రైలర్ ఇవాళ (నవంబర్ 25) రిలీజైంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతున్నఈ ట్రైలర్ వణికించేలా ఉంది. ఈ సినిమా డిసెంబర్ 4న ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. జీ5 హిందీలో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

అపార్ట్‌మెంట్‌లో పిల్లాడు మిస్సింగ్

ఈ కథ అంతా ఓ అపార్ట్‌మెంట్‌లో మిస్సయిన తన కొడుకును వెతికే తండ్రి చుట్టూ తిరుగుతుందని డాలింబ్ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ముంబయి శివార్లలోని ఓ మల్టీ బిల్డింగ్ అపార్ట్‌మెంట్ కు తన కొడుకు ఆదితో కలిసి ఆ తండ్రి కొత్తగా వస్తాడు. అక్కడ ఇతర పిల్లలతో ఆడుకోమ్మని ఆదిని పంపిస్తాడు ఆ తండ్రి. కానీ ఆ తర్వాత ఆ పిల్లాడు కనిపించడు.

అదే సమయంలో అపార్ట్‌మెంట్‌లో ఓ హంతకుడు సంచరిస్తున్నాడనే వార్తతో అందరూ భయపడతారు. తన అంకులు కొడుకును వెతికేందుకు పోలీస్ ఇన్ స్పెక్టర్ పాత్రలో ప్రియా బాపట్ ఎంట్రీ ఇస్తుంది. తన కొడుకును తాను కాకపోతే ఇంకెవరు కాపాడతారని హీరో వెతకడం కొనసాగిస్తూనే ఉంటాడు.

ఊహించని ట్విస్ట్

ట్రైలర్ చివర్లో ఓ చిన్నారి "మీరు నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చారా?" అని అడగడం, అలాగే "అతన్ని మళ్ళీ చూశాను" అనే డైలాగ్ కథపై అంచనాలను అమాంతం పెంచేశాయి. 'పంచాయత్', 'కోటా ఫ్యాక్టరీ' వంటి సిరీస్‌లతో ఎంతో సాఫ్ట్ ఇమేజ్ సంపాదించుకున్న జితేంద్ర కుమార్.. తొలిసారి ఇంత డార్క్ అండ్ ఇంటెన్స్ పాత్రలో కనిపించడం విశేషం.

డైరెక్ట్ ఓటీటీ

ఈ హిందీ ఒరిజినల్ చిత్రానికి ప్రియా అవెన్ కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. దర్శకురాలిగా ఆమెకు ఇదే తొలి ఫీచర్ ఫిల్మ్ కావడం గమనార్హం. ఎలిప్సిస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తనుజ్ గార్గ్, అతుల్ కస్బేకర్ ఈ సినిమాను నిర్మించారు.

జితేంద్ర కుమార్‌తో పాటు మరాఠీ, హిందీ నటి ప్రియా బాపట్ ఇందులో కీలక పాత్ర పోషించారు. క్షితీష్ దాటే, కవిన్ దవే, సాయి ప్రసాద్, హరీష్ కులకర్ణి, సాగర్ యాదవ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. యూఏ 13 ప్లస్ సర్టిఫికెట్ పొందిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ డిసెంబర్ 4, 2026 నుంచి జీ5 వేదికగా హిందీలో అందుబాటులోకి రానుంది.

Featured Video

 

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks