...
...
Next Story

AATA: అదుర్స్ అనిపించేలా ఆట ఫినాలే.. ఈ వీకెండ్ ఎంట‌ర్‌టైన్మెంట్ పీక్స్‌.. గెస్ట్‌లుగా మెగా హీరో, రాజ‌శేఖ‌ర్‌.. బన్ బాబు

AATA: జీ తెలుగులో అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లతో అలరిస్తున్న ‘ఆట’ టైటిల్ వేటకు సమయం దగ్గరపడుతోంది. ఈ డ్యాన్స్ రియాలిటీ షో ఫినాలే ఈ వీకెండ్ జరుగుతుంది. ఫైనల్ కు మెగా హీరో, రాజశేఖర్ వచ్చి సందడి చేయనున్నారు.

Published on: Apr 29, 2026, 13:45:46 IST
Advertisement

AATA: టీవీ షోల్లో డ్యాన్స్ రియాలిటీ షోలకు మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా గతంలో ఓంకార్ యాంకర్ గా వచ్చే ‘ఆట’ డ్యాన్స్ షోకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ఇప్పుడు అదే పేరుతో జీ తెలుగులో ‘ఆట’ డ్యాన్స్ రియాలిటీ షో కొనసాగుతోంది. ఈ షో ఎండింగ్ కు చేరుకుంది. ఫైనల్ ఎపిసోడ్ వచ్చే వీకెండ్ లోనే జరుగుతుంది.

ఆట ఫినాలే

ఆట ఫినాలే
ఆట ఫినాలే

తెలుగు టెలివిజన్ రంగంలో వినూత్నమైన రియాలిటీ షోలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు, ఇప్పుడు మరో సంచలన ముగింపు వేడుకకు సిద్ధమైంది. డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' గ్రాండ్ ఫినాలే ఈ వారాంతంలో అట్టహాసంగా జరగనుంది. మే 2, 3వ తేదీల్లో రాత్రి 9 గంటలకు రెండు భాగాలుగా ప్రసారం కానున్న ఈ వేడుక, బుల్లితెర ప్రేక్షకులకు కనువిందు చేయబోతోంది.

మెగా హీరో

నిహారిక కొణిదెల, రాధిక శరత్ కుమార్, రఘు మాస్టర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఈ ఆట సీజన్​ గ్రాండ్​ ఫినాలే మరింత అద్భుతంగా సాగనుంది. ఈ ఫినాలేలో మెగా హీరో సాయి దుర్గ తేజ్, సీనియర్ స్టార్ కపుల్ జీవిత - రాజశేఖర్ సందడి చేయనున్నారు. యాంకర్​ సుధీర్ కామెడీ టైమింగ్, సమీరా భరద్వాజ్ మ్యూజికల్ కాన్సర్ట్ ఈ ఫినాలేలో స్పెషల్ గా నిలవనుంది.

బన్ బాబు అంటే

డ్యాన్స్ మాత్రమే కాదు ఆట ఫినాలేలో అనేక ఆసక్తికరమైన, ఎమోషనల్ సీన్లు ఆడియన్స్ కు డిఫరెంట్ అనుభూతి అందించబోతున్నాయి. నటుడు రాజశేఖర్, రాధిక శరత్ కుమార్ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సరదాగా ముచ్చటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ముఖ్యంగా రాజశేఖర్ ముద్దుపేరు 'బన్ బాబు' గురించి జరిగిన చర్చ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతుంది.

నిహారిక కొణిదెల ఈ షోకు జడ్జ్ మాత్రమే కాదు, ఆమెనే ప్రొడ్యూసర్ కూడా. తన మేనత్త కొడుకైన సాయి దుర్గ తేజ్ కు నిహారికకు మంచి బాండింగ్ ఉంది. ఆట ఫినాలేలో వీళ్లిద్దరి సందడి ఆకట్టుకోనుంది. అలాగే తనకు జరిగిన రోడ్ యాక్సిడెంట్ గురించి సాయి దుర్గ తేజ్ చెప్పే విషయాలు ఆలోచింపజేస్తాయి. నిహారిక తన అమ్మమ్మతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.

విన్నర్ ఎవరు?

ఆట డ్యాన్స్ షో విన్నర్ ఎవరు అనేది ఉత్కంఠగా మారింది. ఫైనల్ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు తమ బెటర్ పర్ఫార్మెన్స్ తో టైటిల్ వేటలో ఢీ కొట్టనున్నారు. ముఖ్యంగా పుష్ప, గౌరవ్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ జడ్జీలను సైతం ఆశ్చర్యపరిచేలా ఉండబోతున్నాయి. హోరాహోరీగా సాగిన ఈ పోటీలో చివరికి 'ఆట' విజేతగా ఎవరు నిలిచారు? జీ తెలుగు ఆట ట్రోఫీని ఎవరు కైవసం చేసుకున్నారు? అనే విషయాలు తెలియాలంటే మే 2, 3 తేదీల్లో జీ తెలుగులో ప్రసారమయ్యే గ్రాండ్ ఫినాలే చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks