...
...
Next Story

OTT Thriller: నలుగురు అమ్మాయిల జీవితాల్లోని సీక్రెట్స్.. సడెన్‌గా మరో ఓటీటీలోకి అప్సరా రాణి బోల్డ్ మూవీ..ఎక్కడ చూడాలంటే?

OTT Thriller: అప్సర రాణి లేటెస్ట్ తెలుగు ఆంథాలజీ చిత్రం ‘డార్క్ సీక్రెట్స్’ మరో ఓటీటీలోకి వచ్చేసింది. నలుగురు అమ్మాయిల కథతోతెరకెక్కిన ఈ మిస్టరీ మూవీ ఇప్పుడు ఓటీటీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ సినిమాలోని సీక్రెట్స్ ఏంటీ? ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుందో ఇక్కడ చూసేయండి.

Published on: Aug 6, 2026, 05:49:16 IST
Advertisement

OTT Thriller: తెలుగు డిజిటల్ వినోద రంగంలో ఆంథాలజీ (వివిధ కథల సమాహారం) సినిమాలకు ఇటీవల కాలంలో మంచి డిమాండ్ ఏర్పడింది. మానవ సంబంధాలలోని చీకటి కోణాలు, రహస్యాలు, నేరాల నేపథ్యంతో రూపొందే క్రైమ్ అండ్ డార్క్ థ్రిల్లర్లను ఓటీటీ వీక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే సరికొత్త తెలుగు ఆంథాలజీ మూవీ ‘డార్క్ సీక్రెట్స్’ (Dark Secrets) సైలెంట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయడం ప్రారంభించింది.

డార్క్ సీక్రెట్స్ ఓటీటీ

నలుగురు అమ్మాయిల జీవితాల్లోని సీక్రెట్స్.. సడెన్‌గా మరో ఓటీటీలోకి అప్సరా రాణి బోల్డ్ మూవీ..ఎక్కడ చూడాలంటే?
నలుగురు అమ్మాయిల జీవితాల్లోని సీక్రెట్స్.. సడెన్‌గా మరో ఓటీటీలోకి అప్సరా రాణి బోల్డ్ మూవీ..ఎక్కడ చూడాలంటే?

తెలుగులో వచ్చిన బోల్డ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ ‘డార్క్ సీక్రెట్స్’ ఇప్పుడు రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకుడు అవినాష్ కొకాటి (Avinash Kokati) తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే హంగామా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ డార్క్ సీక్రెట్స్ సినిమా ప్రైమ్ వీడియోలోకి కూడా రెంట్ విధానంలో రిలీజైంది.

నలుగురు అమ్మాయిల కథలు

నలుగురు అమ్మాయిల జీవితాల్లోని సీక్రెట్స్ ను ఈ ఆంథాలజీ మూవీ ‘డార్క్ సీక్రెట్స్’లో చూపించారు. ఈ చిత్రంలో బోల్డ్ బ్యూటీ అప్సరా రాణి, నైనిక అనసూయ, జయశ్రీ, నీలిమా చౌదరీ ప్రధాన పాత్రలు పోషించారు.

భర్త లేని భార్య

డార్క్ సీక్రెట్స్ మూవీ బోల్డ్ గా, మిస్టరీగా ఉంటుంది. ఒక మహిళ తన భర్తను కోల్పోయిన బాధలో ఉంటుంది. ఓ విధవగా జీవితాన్ని గడపడం ఎంత కష్టమో ఆమెకు మాత్రమే తెలుసు. కానీ ఇంటి రెంట్, అప్పుల కోసం వేధింపులు ఎదురవుతాయి. ఆ సమయంలోనే ఆమె డబ్బు అవసరాలను వాడుకొని ఓ మగాడు తనను లొంగదీసుకుంటాడు.

ఇక చివరి కథలోకి వస్తే ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఓ అమ్మాయి.. తన భర్త లావుగా, అసహ్యంగా ఉన్నాడని దూరం పెడుతుంది. ఆ భర్త ఫుల్ గా తాగి వచ్చి ఆ అమ్మాయిని ఏం చేశాడన్నది చూపించారు.

గ్లోబల్ ఆడియన్స్

కేవలం ఒక్క కథపై ఆధారపడకుండా విభిన్న పాత్రల జీవితాల్లోని రహస్యాలను 'డార్క్ సీక్రెట్స్' పేరుతో అవినాష్ కొకాటి ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. సాధారణంగా చిన్న బడ్జెట్ ఆంథాలజీ చిత్రాలు థియేట్రికల్ రిలీజ్‌కు ఇబ్బంది పడుతుంటాయి. అయితే, హంగామా ఓటీటీతో పాటు ప్రైమ్ వీడియో రెంట్ మోడల్‌లో తీసుకురావడం వల్ల గ్లోబల్ తెలుగు ఆడియన్స్‌కు ఈ చిత్రం త్వరగా రీచ్ అయ్యే అవకాశం ఉంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks