...
...
Next Story

OTT Horror: వీకెండ్‌కు స‌ర్‌ప్రైజ్‌.. ఒకేసారి మూడు ఓటీటీల్లోకి త‌మిళ హార‌ర్ థ్రిల్ల‌ర్‌.. అసలు ఆ ఇంట్లో ఏముంది?

OTT Horror: తమిళ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'డార్క్' ఓటీటీలోకి వచ్చేస్తోంది. నాస్తికుడైన ఒక యువకుడు తక్కువ అద్దెకు ఇల్లు తీసుకుంటాడు. ఆ ఇంట్లో విచిత్రమైన సూపర్ నేచురల్, క్రిమినల్ మిస్టరీలో ఎలా చిక్కుకున్నాడో తెలిపే కథ ఇది. అదిరే ట్విస్ట్ లతో వీకెండ్‌కు సర్ ప్రైజ్ ఇచ్చేందుకు మూవీ రెడీ అయింది.

Published on: Aug 20, 2026, 06:04:57 IST
Advertisement

OTT Horror: హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఓటీటీ లవర్స్ కోసం ఒక ఇంట్రెస్టింగ్ తమిళ మూవీ వచ్చేస్తోంది. వీకెండ్‌కు సర్ ప్రైజ్ ఇస్తూ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఒకటి కాదు రెండు కాదు ఒకేసారి మూడు ఓటీటీల్లోకి రాబోతుంది. అదే.. తమిళంలో మంచి ఆదరణ పొందిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'డార్క్' (Dark).

సైకలాజికల్ హారర్ థ్రిల్లర్

వీకెండ్‌కు స‌ర్‌ప్రైజ్‌.. ఒకేసారి మూడు ఓటీటీల్లోకి త‌మిళ హార‌ర్ థ్రిల్ల‌ర్‌.. ఇంట్లో వణికించే ఆత్మలు!
వీకెండ్‌కు స‌ర్‌ప్రైజ్‌.. ఒకేసారి మూడు ఓటీటీల్లోకి త‌మిళ హార‌ర్ థ్రిల్ల‌ర్‌.. ఇంట్లో వణికించే ఆత్మలు!

సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన డార్క్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. కళ్యాణ్ కె. జగన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అజయ్ కార్తీ, అంచనా నేత్రున్ ప్రధాన పాత్రలు పోషించారు. నాస్తికత్వం, మూఢనమ్మకాలు, సైకలాజికల్ థ్రిల్, ఒక భయంకరమైన నేరం చుట్టూ తిరిగే ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది.

నాస్తికుడి సవాల్

దేవుడు, దెయ్యం అనేవాటిని అస్సలు నమ్మని ఒక నాస్తికుడైన యువకుడి చుట్టూ ఈ డార్క్ సినిమా కథ తిరుగుతుంది. ఊరి చివర లేదా ఒక భయంకరమైన గతం ఉన్న ఇంట్లో ఉండటానికి చాలామంది జంకుతారు. కానీ, మన హీరో మాత్రం కేవలం డబ్బు ఆదా చేసుకోవడం కోసమే.. ఊరిలో ప్రచారంలో ఉన్న మూఢనమ్మకాలను, భయాలను పక్కన పెట్టి మరీ ఒక అనుమానాస్పద ఇల్లుని తక్కువ అద్దెకు తీసుకుంటాడు.

దెయ్యాలు, భూతాలు ఏమీ ఉండవని, అంతా మనుషుల భ్రమ మాత్రమేనని గట్టిగా నమ్ముతాడు. అయితే ఆ యువకుడు ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఎదురైన పరిస్థితులే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

మూడేళ్ల క్రితం నాటి దారుణ హత్యలు

ఆ ఇంట్లో మొదలైన విచిత్ర సంఘటనలు అతని జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. అతని మనస్సును తీవ్రమైన ఒత్తిడికి గురిచేసి, అసలు ఏం జరుగుతుందో అర్థం కాని స్థితికి నెట్టివేస్తాయి. క్రమంగా ఈ హంటింగ్ అనుభవం వెనుక ఏదో సూపర్ నేచురల్ శక్తి మాత్రమే కాకుండా క్రిమినల్ మిస్టరీ దాగి ఉందని అతనికి అర్థమవుతుంది.

ఆపై ఇది ఒక భయంకరమైన పోలీసు విచారణకు దారితీస్తుంది. అనుభవజ్ఞుడైన నటుడు నటరాజన్ సుబ్రహ్మణ్యం (నట్టి), సీనియర్ దర్శకుడు-నటుడు కే. భాగ్యరాజ్ ఈ ఇన్వెస్టిగేషన్ డ్రామాలో అత్యంత కీలక పాత్రలను పోషించారు.

ఓటీటీ రిలీజ్

2026 జూలై 3న థియేటర్లలో విడుదలైన ఈ డార్క్ చిత్రం ప్రేక్షకులను భయాందోళనలకు గురిచేసి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం శుక్రవారం (ఆగస్టు 21) నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ కానుంది. విదేశీ వీక్షకుల, అంతర్జాతీయ మార్కెట్ కోసం సింప్లీ సౌత్ (Simply South), ఏపీ ఇంటర్నేషనల్ సౌత్ (AP International South) ఓటీటీలలో కూడా అందుబాటులోకి రాబోతుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe