This Week Top OTT: ఓటీటీలో దసరా ధమాకా.. ఈ వారం మిస్ అవకుడా చూడాల్సిన టాప్ సినిమాలు, సిరీస్, షోలు ఇవే.. ఓ లుక్కేయండి

This Week Top OTT: దసరా హాలీడేస్ వచ్చేశాయి. ఓటీటీలో దసరా ధమాకా కూడా వచ్చేస్తోంది. ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు క్రేజీ లైనప్ రెడీ అయింది. మరి ఈ వారం ఓటీటీలోకి వస్తున్న టాప్ సినిమాలు, సిరీస్ లు, షోలపై ఓ లుక్కేయండి. 

Published on: Oct 12, 2026, 10:54:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

This Week Top OTT: ఈ వారం డిజిటల్ తెరపై సరికొత్త వినోదాల పండుగ మొదలవుతోంది. అక్టోబర్ మూడో వారంలో దసరా హాలీడేస్ సందర్భంగా ప్రేక్షకులను అలరించడానికి ప్రముఖ ఓటీటీ వేదికలైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5, సన్ నెక్స్ట్, మనోరమా మాక్స్ లలో క్రేజీ సినిమాలు, రియాలిటీ షోలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి.

ఓటీటీలో దసరా ధమాకా-ఈ వారం మిస్ అవకుడా చూడాల్సిన టాప్ సినిమాలు, సిరీస్, షోలు ఇవే!
ఓటీటీలో దసరా ధమాకా-ఈ వారం మిస్ అవకుడా చూడాల్సిన టాప్ సినిమాలు, సిరీస్, షోలు ఇవే!

డిస్‌క్లోజర్ డే (Disclosure Day)

సస్పెన్స్ తో సాగే ఏలియన్ స్టోరీ బేస్డ్ మూవీ ఇది. దిగ్గజ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్ బెర్గ్ తెరకెక్కించిన విజువల్ వండర్ ఇది. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ ఈ వారం ప్రారంభంలోనే ఓటీటీలోకి వచ్చేసింది. అక్టోబర్ 12 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

కాఫీ విత్ కరణ్ సీజన్ 9 (Koffee With Karan Season 9)

బాలీవుడ్ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్స్, గాసిప్స్, క్రేజీ సీక్రెట్స్‌ను బయటపెట్టే పాపులర్ టాక్ షో సరికొత్త సీజన్‌తో మళ్లీ రచ్చ లేపడానికి వస్తోంది. కరణ్ జోహార్ హోస్టింగ్‌లో వచ్చే ఈ షో సరికొత్త వివాదాలు, ఫన్ ఎలిమెంట్స్‌తో ట్రెండ్ అవ్వడం ఖాయం. జియోహాట్‌స్టార్ లో అక్టోబర్ 14 నుంచి అందుబాటులోకి రాబోతుంది.

ఎన్న వియాలి (Enna Viali)

భారీ అంచనాల మధ్య నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతున్న తమిళ సినిమా ఇది. ఈ మూవీ ఎమోషనల్ అండ్ గ్రిప్పింగ్ డ్రామాగా తెరకెక్కింది. మనుషుల మధ్య ఉండే క్లిష్టమైన బంధాలు, జీవితంలో ఎదురయ్యే ఊహించని మలుపుల చుట్టూ ఈ కథ ఆసక్తికరంగా సాగుతుంది. అక్టోబర్ 15న ఓటీటీలో రిలీజ్ అవుతోంది.

ది ట్రైటర్స్ తెలుగు (The Traitors Telugu)

ప్రముఖ అంతర్జాతీయ రియాలిటీ షో ఆధారంగా సరికొత్తగా తెలుగులోకి వస్తున్న మైండ్ గేమ్ షో ఇది. నమ్మకం, మోసం, వ్యూహాల చుట్టూ తిరిగే ఈ కాన్సెప్ట్‌లో కంటెస్టెంట్లు ఒకరినొకరు ఎలా బోల్తా కొట్టిస్తారనేది అత్యంత ఉత్కంఠను రేకెత్తిస్తుంది. తేజ సజ్జా హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ (It's a Medical Miracle)

ఇది మలయాళం ఫ్యాంటసీ థ్రిల్లర్. కోమాలోకి వెళ్లిన ఓ వ్యక్తి రెండేళ్ల తర్వాత కోలుకుంటాడు. కోమాలో నుంచి బయటకు వచ్చిన అతనికి ఓ సూపర్ పవర్ వస్తుంది. ఈ మూవీ మనోరమా మాక్స్ లో అక్టోబర్ 15న రిలీజ్ అవుతుంది.

కాపీ స్క్వాడ్ (Kappi Squad)

యువతను టార్గెట్ చేస్తూ వస్తున్న సరికొత్త యూత్‌ఫుల్ కామెడీ సిరీస్ ఇది. నలుగురు ఫ్రెండ్స్ కలిసి తమ కలల కేఫ్ ను స్టార్ట్ చేస్తారు. ఆ క్రమంలో ఏం జరిగింది అనేదే ఈ మలయాళ వెబ్ సిరీస్ స్టోరీ. ఇది జియోహాట్‌స్టార్ లో అక్టోబర్ 15 నుంచి అందుబాటులోకి రానుంది.

ఒరు అన్వేషణతింటే తుడక్కం (Oru Anveshanathinte Thudakkam)

సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ సస్పెన్స్ లవర్స్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్. ఒక మిస్టరీ కేసును ఛేదించడానికి పోలీసులు సాగించే ఉత్కంఠభరితమైన విచారణే ఈ సినిమా ప్రధాన కథాంశం. అక్టోబర్ 16న సన్ నెక్స్ట్ లో ఈ మూవీ డెబ్యూ చేస్తుంది.

కాగితం పడవలు (Kagitham Padavalu)

చిన్ననాటి జ్ఞాపకాలు, పల్లెటూరి స్వచ్ఛమైన ప్రేమ, ఎమోషన్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న అందమైన ఫీల్ గుడ్ మూవీ. గుండెలను హత్తుకునే సంభాషణలు, హృదయానికి హత్తుకునే సంగీతంతో ఈ వారం ఓ మంచి అనుభూతిని ఇస్తుంది. ఇది సన్ నెక్స్ట్ లో అక్టోబర్ 16న విడుదలవుతుంది.

ఆశ (Aasha)

ఒక సాధారణ మహిళ జీవితంలోని థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన మలయాళ థ్రిల్లర్ ఇది. ఇందులో వచ్చే ట్విస్ట్ లు మామూలుగా ఉండవు. ఈ చిత్రం అక్టోబర్ 16న జీ5లో రిలీజ్ అవుతుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More