...
...
Next Story

OTT Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ డాక్యుమెంటరీతో పాకిస్థాన్‌లో కలకలం.. అర్ధరాత్రి 2 గంటలకు పాక్ జనరల్ సంచలన ట్వీట్

OTT Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ పై డిస్కవరీ ఛానెల్ రూపొందించిన డాక్యుమెంటరీ సిరీస్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. దీనిపై పాకిస్థాన్ లో కలకలం రేగింది. అక్కడి లెఫ్ట్‌నెంట్ జనరల్ దీనిపై స్పందిస్తూ అర్ధరాత్రి ట్వీట్ చేయడం గమనార్హం.

Published on: Aug 20, 2026, 13:58:04 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT Operation Sindoor: డిస్కవరీ ఛానెల్‌, డిస్కవరీ ప్లస్ ఓటీటీలో గ్రాండ్‌గా రిలీజ్ అయిన ‘డిక్లాసిఫైడ్: ఆపరేషన్ సిందూర్’ (Declassified: Operation Sindoor) డాక్యుమెంటరీ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన సంచలనం సృష్టిస్తోంది. ఈ షోలో ప్రసారమైన ఇంటెన్స్ మిలిటరీ సీన్స్, ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ ప్లానింగ్ చూసి పాకిస్థాన్ మిలిటరీ తీవ్ర భయాందోళనకు గురైంది. అర్ధరాత్రి వేళ పాక్ ఆర్మీ జనరల్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్‌గా పెద్ద దుమారం రేపుతున్నాయి.

అర్ధరాత్రి 2 గంటలకు పాక్ జనరల్ ఆక్రోశం

OTT Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ డాక్యుమెంటరీతో పాకిస్థాన్‌లో కలకలం.. అర్ధరాత్రి 2 గంటలకు పాక్ జనరల్ సంచలన ట్వీట్
OTT Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ డాక్యుమెంటరీతో పాకిస్థాన్‌లో కలకలం.. అర్ధరాత్రి 2 గంటలకు పాక్ జనరల్ సంచలన ట్వీట్

పాకిస్థాన్ మిలిటరీ అధికార ప్రతినిధి (DG ISPR) లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ ఈ ఆపరేషన్ సిందూర్ డాక్యుమెంటరీ ప్రసారమైన కొద్ది రోజులకే ఎక్స్ వేదికగా తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. మంగళవారం అర్ధరాత్రి 2 గంటలకు ఆయన సుదీర్ఘమైన పోస్ట్ చేస్తూ.. ఈ షోను ఒక 'కామెడీ అండ్ ట్రాజెడీ' అని అభివర్ణించారు.

భారత కంటెంట్ క్రియేటర్లు బాలీవుడ్ తరహా డ్రామా క్రియేట్ చేసి యథార్థాలను మార్చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే పాక్ సైన్యం ఎంత చెప్పినా, భారత ఆర్మీ గతంలోనే విడుదల చేసిన శాటిలైట్ ఆధారాల ముందు వారి ఆరోపణలు నిలబడలేకపోతున్నాయి.

88 గంటల ఆపరేషన్.. అజిత్ దోవల్ క్రేజీ ప్లాన్

ఈ డాక్యుమెంటరీ సిరీస్ మే 2025లో భారత సాయుధ దళాలు నిర్వహించిన అత్యంత రహస్య ‘ఆపరేషన్ సిందూర్’ ఆధారంగా తెరకెక్కింది. ఏప్రిల్ 2025లో పహల్గామ్‌లో జరిగిన దారుణ తీవ్రవాద దాడికి ప్రతికారంగా భారత సైన్యం ఈ 88 గంటల భారీ ఆపరేషన్ చేపట్టింది. పాక్ ఆక్రమిత ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడింది.

నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (NSA) అజిత్ దోవల్, ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది లాంటి అగ్రశ్రేణి సైనిక అధికారులు స్వయంగా ఈ సిరీస్‌లో మాట్లాడారు. ఇండియా వార్ రూమ్‌లో ఏం జరిగింది, పాక్ భూభాగంలోని టెర్రరిస్ట్ క్యాంపులను క్షిపణులతో ఎలా ధ్వంసం చేశారనేది రెండు ఎపిసోడ్లలో మైండ్ బ్లాకింగ్ విజువల్స్‌తో చూపించారు.

'ది గ్రీన్ లైట్' అండ్ 'అటాక్ అండ్ కౌంటర్ స్ట్రైక్'

న్యూక్లియర్ పవర్ ఉన్న రెండు పొరుగు దేశాల మధ్య జరిగిన ఈ హై-వోల్టేజ్ పోరాటంలో ఇండియా సాధించిన 100 శాతం సక్సెస్‌ను స్పష్టమైన ఆధారాలతో చూపించడం పాక్ ఆర్మీకి మింగుడుపడటం లేదు. దీంతో ఇది తమ ఓటమిని కప్పిపుచ్చుకునే ప్రాపగండా వీడియో అని పాక్ ప్రచారం చేస్తోంది.

ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందంటే?

ప్రస్తుతం ఈ సంచలనం సృష్టించిన డాక్యుమెంటరీ డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారమవుతోంది. ఓటీటీ ప్రియులు దీన్ని డిస్కవరీ ప్లస్ (Discovery+) యాప్‌లో నేరుగా చూడవచ్చు.

అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో లభించే డిస్కవరీ బండిల్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా కూడా ఈ క్రేజీ మిలిటరీ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. పక్కా రియలిస్టిక్ వార్ రూమ్ డ్రామా చూడాలనుకునే వారికి ఈ సిరీస్ బెస్ట్ ఛాయిస్.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe