అందంతో, యాక్టింగ్ తో అదరగొడుతోంది దీపికా పదుకొనే. ఈ బాలీవుడ్ భామ దేశంలో ఇతర భాషలతో పాటు హాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. ఇవాళ (జనవరి 5) దీపికా పదుకొనే బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె నెట్ వర్త్, ఆస్తులు, సినిమాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
దీపికా పదుకొనే నెట్ వర్త్

ప్రస్తుతం ఇండియాలోని టాప్ హీరోయిన్లలో దీపికా పదుకొనే ఒకరు. ఇటు సినిమాలతో, అటు బ్రాండ్ ఎండార్స్ మెంట్లతో దీపికా బాగానే సంపాదిస్తోంది. ప్రస్తుతం ఆమె నెట్ వర్త్ విలువ రూ.500 కోట్లు. అవును.. మీరు చదివింది నిజమే. ఇండియాలోనే అత్యధిక నెట్ వర్త్ కలిగి ఉన్న హీరోయిన్లలో దీపికా పదుకొనే ఒకరు.
రెమ్యునరేషన్
బర్త్ డే భామ దీపికా పదుకొనే తన సినిమాలకు అత్యధికంగా రెమ్యునరేషన్ అందుకుంటుంది. ఒక్కో సినిమాకు రూ.15 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకూ ఛార్జ్ చేస్తుందని తెలిసింది. కొన్ని సినిమాలకు అంతకంటే ఎక్కువే డిమాండ్ చేస్తుందని కూడా సమాచారం. మరోవైపు కొన్నేళ్లుగా ప్రముఖ బ్రాండ్లను ఆమె ప్రమోట్ చేస్తోంది. ఈ బ్రాండ్ల ప్రమోషన్ తోనూ ఆమె కోట్లకు కోట్లు ఖాతాలో వేసుకుంటుంది.
దీపికా ఆస్తులు
దీపికా పదుకొనే బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు చాలా ఆస్తులే ఉన్నాయి. ఇందులో బాంద్రాలో ఉన్న అత్యంత ఖరీదైన ఫ్లాట్ గురించి చెప్పుకోవాలి. షారుక్ ఖాన్ ఇల్లు మన్నత్ కు సమీపంలోనే ఉండే ఈ ఫ్లాట్ ను 2022లో రూ.119 కోట్లు పెట్టి కొన్నారు.
మరోవైపు అలిబాగ్ లో దీపికాకు రూ.22 కోట్ల విలువైన బంగ్లా ఉంది. అంతే కాకుండా వర్లీలోని బ్యూమోండే టవర్స్ లో అపార్ట్ మెంట్ ఉంది. దాని వాల్యూ రూ.42 కోట్లు. దీపికా దగ్గర రేంజ్ రోవర్, మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లున్నాయి.
దీపికా సినిమాలు
{{/usCountry}}మరోవైపు అలిబాగ్ లో దీపికాకు రూ.22 కోట్ల విలువైన బంగ్లా ఉంది. అంతే కాకుండా వర్లీలోని బ్యూమోండే టవర్స్ లో అపార్ట్ మెంట్ ఉంది. దాని వాల్యూ రూ.42 కోట్లు. దీపికా దగ్గర రేంజ్ రోవర్, మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లున్నాయి.
దీపికా సినిమాలు
{{/usCountry}}2006లో కన్నడ సినిమా ఐశ్వర్యతో డెబ్యూ చేసింది దీపికా పదుకొనే. ఆ తర్వాత ఏడాది షారుక్ ఖాన్ హీరోగా చేసిన ఓం శాంతి ఓం మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. 2014లో తమిళంలో కొచాడైయాన్ చిత్రంలో యాక్ట్ చేసింది. ట్రిపుల్ ఎక్స్ రిటర్న్ ఆఫ్ జేండర్ కేజ్ తో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 2024లో ప్రభాస్ కల్కి 2898 ఏడీతో తెలుగులో ప్రవేశించింది. ఇప్పుడు షారుక్ ఖాన్ తో కింగ్, అల్లు అర్జున్ తో ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చేస్తోంది దీపికా పదుకొనే.