బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ స్కిన్‌కేర్ బ్రాండ్ '82°E' నష్టాలతో పోరాడుతోందని కంపెనీ తాజా ఆర్థిక నివేదికలు వెల్లడించాయి. చివరికి లాభాలను పెంచడానికి ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామని కంపెనీ పేర్కొనడం గమనార్హం. అయితే నష్టాలు కొంత మేర తగ్గినప్పటికీ పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు. మరోవైపు స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ బిజినెస్ మాత్రం మంచి లాభాలు తెచ్చి పెడుతోంది.
దీపికా పదుకోన్ '82°E'కి రూ.12 కోట్ల నష్టం

దీపికా పదుకోన్ మొదలుపెట్టిన '82°E' బ్రాండ్ డీపీకేఏ యూనివర్సల్ కన్స్యూమర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కింద పనిచేస్తోంది. ఈ సంస్థకు దీపికతోపాటు ఆమె తండ్రి ప్రకాష్ పదుకోన్ కూడా డైరెక్టర్లుగా ఉన్నారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకి సమర్పించిన తాజా నివేదికల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో '82°E'కి రూ.12.26 కోట్ల నష్టం వచ్చింది.
కంపెనీ ఆదాయం కూడా 30 శాతం కంటే ఎక్కువగా పడిపోయింది. 2023-24లో రూ.21.21 కోట్లుగా ఉన్న ఆదాయం 2024-25లో రూ.14.66 కోట్లకు తగ్గింది. అయితే దీపికా కంపెనీకి ఉన్న ఏకైక సానుకూల అంశం ఏమిటంటే.. నష్టం గత ఆర్థిక సంవత్సరం కంటే తగ్గింది. 2023-24లో కంపెనీ రూ.23 కోట్లకు పైగా నష్టాలను చవిచూసింది.
ఖర్చుల్లో భారీ తగ్గింపు
"లాభదాయకత ఉండేలా ఆదాయాన్ని పెంచడానికి, ఖర్చులను తగ్గించడానికి యాజమాన్యం నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది" అని కంపెనీ తన ఫైలింగ్‌లలో పేర్కొంది. కంపెనీ మార్కెటింగ్ ఖర్చులను తగ్గించుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గత ఏడాది రూ.20 కోట్లుగా ఉన్న మార్కెటింగ్ ఖర్చు, 2024-25లో రూ.4.4 కోట్లకు తగ్గింది. ఇది దాదాపు 78% పతనం.
కంపెనీ మొత్తం వ్యయం కూడా రూ.47 కోట్ల నుండి రూ.26 కోట్లకు తగ్గింది. దీపికా 2021లో '82°E'ని లగ్జరీ స్కిన్‌కేర్ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఇందులో రూ.2,500 కంటే ఎక్కువ ధర ఉన్న అనేక రకాల ఉత్పత్తులు ఉన్నాయి. అయితే భారీ మార్కెటింగ్ ప్రయత్నాలు, దీపికాకు ఉన్న అపారమైన ఫాలోయింగ్ కూడా ఈ బ్రాండ్ ను లాభాల బాట పట్టించలేకపోయింది. దీనికి పూర్తి విరుద్ధంగా 2019లో ప్రారంభమైన కత్రినా కైఫ్ బ్రాండ్ 'కే బ్యూటీ' అమ్మకాల్లో పెరుగుదల చూస్తూ, ఇటీవల సంవత్సరాలలో భారీ లాభాలను కూడా ప్రకటించింది.
దీపికా పదుకోన్ కెరీర్ ఇలా..
{{/usCountry}}కంపెనీ మొత్తం వ్యయం కూడా రూ.47 కోట్ల నుండి రూ.26 కోట్లకు తగ్గింది. దీపికా 2021లో '82°E'ని లగ్జరీ స్కిన్‌కేర్ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఇందులో రూ.2,500 కంటే ఎక్కువ ధర ఉన్న అనేక రకాల ఉత్పత్తులు ఉన్నాయి. అయితే భారీ మార్కెటింగ్ ప్రయత్నాలు, దీపికాకు ఉన్న అపారమైన ఫాలోయింగ్ కూడా ఈ బ్రాండ్ ను లాభాల బాట పట్టించలేకపోయింది. దీనికి పూర్తి విరుద్ధంగా 2019లో ప్రారంభమైన కత్రినా కైఫ్ బ్రాండ్ 'కే బ్యూటీ' అమ్మకాల్లో పెరుగుదల చూస్తూ, ఇటీవల సంవత్సరాలలో భారీ లాభాలను కూడా ప్రకటించింది.
దీపికా పదుకోన్ కెరీర్ ఇలా..
{{/usCountry}}సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం దీపిక చేతిలో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న 'కింగ్' చిత్రంలో దీపిక నటిస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుహానా ఖాన్, ఇతర నటీనటులు కూడా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 2026లో విడుదల కానుంది.
ఆ తర్వాత అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న ఇంకా టైటిల్ ఖరారు చేయని మూవీలోనూ దీపిక నటించనుంది. ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. ఆ మధ్య ఆమె కల్కి 2898 ఏడీ, స్పిరిట్ సినిమాల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.