...
...
Next Story

OTT Telugu: థియేటర్లలో సైలెంట్.. ఓటీటీలో వైలెంట్.. తెలుగు చిన్న సినిమా 100 మిలియన్ రికార్డు.. ఈ లవ్ స్టోరీలో అసలేముంది?

OTT Telugu: ఆహా ఓటీటీలో ఏకంగా 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో రికార్డులు సృష్టిస్తోంది చిన్న బడ్జెట్ చిత్రం ‘దీవానా’. ఈ క్రేజీ లవ్ స్టోరీ ఓటీటీ వీక్షకులను ఎందుకు అంతలా ఆకట్టుకుందో తెలిపే టాప్ 5 కారణాలు ఇవే!

Updated on: Aug 9, 2026, 09:29:01 IST
Advertisement

OTT Telugu: ఇటీవలి కాలంలో పెద్ద స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్ లేకపోయినా కేవలం బలమైన కథ, ఆకట్టుకునే ఎమోషన్ ఉంటే తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని మరోసారి నిరూపితమైంది. 'ఆహా' (Aha Video) ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న 'దీవానా' (Deewana) చిత్రం అతి తక్కువ సమయంలోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ డిజిటల్ మైలురాయిని చేరుకుని ఓటీటీ ట్రెండింగ్ ఛార్ట్ లో అగ్రస్థానంలో నిలిచింది.

ఎందుకు చూడాలంటే?

ఓటీటీని ఊపేస్తున్న తెలుగు చిన్న సినిమా.. 100 మిలియన్ స్ట్రీమింగ్ రికార్డు.. ఈ లవ్ స్టోరీలో అసలేముంది?
ఓటీటీని ఊపేస్తున్న తెలుగు చిన్న సినిమా.. 100 మిలియన్ స్ట్రీమింగ్ రికార్డు.. ఈ లవ్ స్టోరీలో అసలేముంది?

ప్యూర్ లవ్, యూత్‌ఫుల్ ఎమోషన్స్‌తో తెరకెక్కిన ఈ చిన్న సినిమా దీవానా ఓటీటీలో డిజిటల్ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అసలు ఈ సినిమాలో ఏముంది? ఆహాలో డిజిటల్ బ్లాక్‌బస్టర్‌గా మారిన ఈ చిత్రాన్ని మీరు ఎందుకు చూడాలి?

హార్ట్ టచింగ్ రియలిస్టిక్ లవ్ స్టోరీ

ప్రస్తుతం వస్తున్న రొటీన్ యాక్షన్, గ్యాంగ్‌స్టర్ సినిమాల మధ్య 'దీవానా' ఒక ఫ్రెష్ ఫీల్‌ను అందిస్తుంది. నిజమైన ప్రేమలోని స్వచ్ఛతను, నేటితరం యూత్ అనుభవించే ప్రేమ, విరహం, మానసిక ఘర్షణలను ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫీల్ లేకుండా దర్శకుడు శ్రీకాంత్ అత్యంత సహజంగా తెరకెక్కించాడు. ప్రతి ఒక్కరూ తమ కాలేజ్ లేదా నిజ జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలకు ఈ సినిమాను కనెక్ట్ చేసుకుంటారు.

కొత్త నటీనటుల సహజ సిద్ధమైన నటన

ఈ చిత్రంలో నటించిన హర్షిత్ రెడ్డి, స్నేహ మణిమేఘలై తదితరులు తమ నటనతో మెప్పించారు. ముఖ్యంగా లీడ్ పెయిర్ మధ్య ఉన్న కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ఎక్కడా అతిగా అనిపించని డైలాగ్ డెలివరీ, కళ్లతోనే భావాలు పలికించే ఎమోషనల్ సీన్లు నటీనటుల ప్రతిభకు అద్దం పడతాయి.

మెలోడీ మ్యూజిక్ అండ్ సోల్ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

చిన్న సినిమాలకు ప్రధాన బలం కథనమే. ఎక్కడా ల్యాగ్ లేకుండా, అనవసరమైన కామిక్ ట్రాక్‌లు జోడించకుండా మొదటి నుంచి చివరి వరకు కథపైనే దృష్టి పెట్టారు మేకర్స్. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లలో వచ్చే మలుపులు వీక్షకులకు మంచి ఎమోషనల్ హైని ఇస్తాయి. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్, తండ్రీ కొడుకుల ఎమోషన్ కూడా ఆకట్టుకుంటాయి.

కనెక్ట్ అయ్యే యూత్ ఎలిమెంట్స్

సాధారణంగా ప్రేమకథల క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటాయనే అభిప్రాయం ఉంటుంది. కానీ 'దీవానా' క్లైమాక్స్ డిజైన్ చేసిన విధానం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. యూత్‌ను ఆలోచింపజేసే లైఫ్ లెసన్స్ అండ్ రిలేషన్‌షిప్ మెచ్యూరిటీని సినిమాలో చూపించిన తీరు ఈ చిత్రానికి కల్ట్ స్టేటస్‌ తెచ్చిపెట్టింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe