Celina Jaitley: మంచు విష్ణు మూవీ హీరోయిన్‌కు హైకోర్టులో చుక్కెదురు- సోదరుడిని కలిసేందుకు నిరాకరణ- ట్విస్ట్ అంటే ఇదే!
Delhi High Court Dismisses Celina Jaitly Petition: యూఏఈలో అదుపులో ఉన్న తన సోదరుడు విక్రాంత్ జైట్లీని కలిసేందుకు అనుమతించాలని మంచు విష్ణు మూవీ సూర్యం హీరోయిన్ సెలీనా జైట్లీ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అందుకు గల అసలు కారణాన్ని ఢిల్లీ హైకోర్టు బయటపెట్టింది.
బాలీవుడ్ నటి, మంచు విష్ణు మూవీ సూర్యం హీరోయిన్ సెలీనా జైట్లీ తన సోదరుడి కోసం చేస్తున్న న్యాయపోరాటానికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో గత కొంతకాలంగా నిర్బంధంలో ఉన్న తన సోదరుడు విక్రాంత్ జైట్లీని కలిసేందుకు, అతనికి న్యాయ సహాయం అందించేందుకు అనుమతించాలని కోరుతూ సెలీనా జైట్లీ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.

పిటిషన్‌ను కొట్టివేయడానికి కారణం ఏంటి?
మార్చి 16న ఈ కేసును విచారించిన జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్ ధర్మాసనం సంచలన విషయాలను వెల్లడించింది. విక్రాంత్ జైట్లీకి ఇప్పటికే కాన్సులర్ యాక్సెస్ (దౌత్యపరమైన అనుమతి) లభించిందని, అయితే అతను తన సోదరి సెలీనాతో మాట్లాడటానికి సిద్ధంగా లేనని స్పష్టం చేసినట్లు కోర్టు పేర్కొంది.
సహాయం తీసుకోడానికి నిరాకరణ
"తన సోదరి పంపే ఏ రకమైన న్యాయ సహాయాన్ని తీసుకోవడానికి విక్రాంత్ ఇష్టపడటం లేదు. తన భార్య చారుల్ జైట్లీతో సంప్రదించిన తర్వాతే తదుపరి చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటానని ఆయన స్పష్టంగా చెప్పారు" అని కోర్టు వివరించింది.
ఖలీద్ అల్మారీ లాంటి ప్రముఖ లా ఫర్మ్‌లు ఉచితంగా వాదించడానికి ముందుకు వచ్చినా విక్రాంత్ తిరస్కరించడం గమనార్హం. సోదరితో నేరుగా మాట్లాడాలన్న సెలీనా అభ్యర్థనను కూడా విక్రాంత్ తోసిపుచ్చినట్లు అధికారులు కోర్టుకు తెలిపారు.
గోప్యత పాటించాలని భార్య విన్నపం
మరోవైపు, విక్రాంత్ భార్య చారుల్ ఈ కేసు వివరాలను బహిరంగపరచవద్దని కోర్టును కోరారు. విక్రాంత్ ఇష్టాయిష్టాలను, ప్రస్తుత పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ హైకోర్టు.. ఈ పిటిషన్‌ను ఇంకా పెండింగ్‌లో ఉంచాల్సిన అవసరం లేదని భావిస్తూ కేసును ముగించింది. అయితే, చట్టపరంగా అతనికి అందాల్సిన సహాయాన్ని కొనసాగించాలని అధికారులను ఆదేశించింది.
అసలు విక్రాంత్ ఎందుకు అదుపులో ఉన్నారు?
రిటైర్డ్ మేజర్ విక్రాంత్ జైట్లీ భారత సైన్యంలో పనిచేశారు. ఆయన 2016 నుంచి యూఏఈలో ఉంటూ ఒక కన్సల్టెన్సీ సంస్థలో పనిచేస్తున్నారు. అయితే, సెప్టెంబర్ 6, 2024 నుంచి ఆయనను యూఏఈ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
జాతీయ భద్రతకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలోనే విక్రాంత్ జైట్లీని నిర్బంధించినట్లు భారత మీడియా కథనాలు చెబుతున్నప్పటికీ, అధికారికంగా ఎలాంటి అభియోగాలు బయటకు రాలేదు.
సోదరుడే వద్దనడం
తన సోదరుడికి సరైన న్యాయ సహాయం అందడం లేదని, కనీసం అతనితో మాట్లాడే అవకాశం కూడా లేదని సెలీనా జైట్లీ గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు స్వయంగా సోదరుడే ఆమె సహాయాన్ని వద్దనడం పెద్ద ట్విస్ట్‌గా మారింది.
మంచు విష్ణు సూర్యం సినిమా
ఇకపోతే మంచు విష్ణు తన సినీ కెరీర్ తొలినాళ్లలో చేసిన సినిమా సూర్యం. ఈ మూవీతోనే టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది సెలీనా జైట్లీ. వి సముద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా తర్వాత మళ్లీ సెలీనా మరో తెలుగు చిత్రంలో కనిపించలేదు. సూర్యం సినిమా 2004 డిసెంబర్ 2న థియేటర్లలో విడుదల అయింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


