Shambhala OTT: ఓటీటీ ట్విస్ట్‌-ఒక రోజు ముందుగానే స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసిన ఆది శంబాల‌-వాళ్ల‌కు స్పెష‌ల్‌

ఆది సాయి కుమార్ హీరోగా నటించిన సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ శంబాల. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ లో ట్విస్ట్. ఈ మూవీ ఒక రోజు ముందుగానే డిజిటల్ రిలీజ్ అయింది. వాళ్ల కోసం స్పెషల్ గా వచ్చేసింది.

Published on: Jan 21, 2026, 10:32:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సీనియర్ నటుడు సాయి కుమార్ తనయుడు ఆది హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ‘శంబాల’. చాలా కాలంగా సినిమాల్లో ఉన్న ఆదికి ఇటీవల సరైన హిట్ దక్కలేదు. ఇప్పుడు శంబాలతో అతను సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ లో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒక రోజు ముందుగానే ఇవాళ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది శంబాల.

శంబాల సినిమాలో ఆది సాయి కుమార్ (x/ahavideoIN)
శంబాల సినిమాలో ఆది సాయి కుమార్ (x/ahavideoIN)

శంబాల ఓటీటీ

ఆది సాయి కుమార్ హీరోగా నటించిన సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ ‘శంబాల’. నిజానికి ఈ మూవీ గురువారం (జనవరి 22) ఓటీటీలోకి రావాల్సింది. అయితే ఒక రోజు ముందుగానే బుధవారం (జనవరి 21) అంటే ఈ రోజు నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా వీడియో ఓటీటీలో శంబాల సినిమా అడుగుపెట్టింది.

వాళ్లకు స్పెషల్ స్ట్రీమింగ్

ఆహా ఓటీటీలో ఈ రోజు శంబాల మూవీ డిజిటల్ డెబ్యూ చేసినా దీని స్ట్రీమింగ్ మాత్రం కొద్దిమందికే స్పెషల్. ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్లు మాత్రమే ఈ రోజు ఓటీటీలో శంబాల మూవీని వీక్షించొచ్చు. నార్మల్ ఆహా ఓటీటీ సబ్ స్కైబర్లు రేపు అంటే జనవరి 22 నుంచి శంబాలను చూడొచ్చు.

సూపర్ హిట్

శంబాల సినిమా థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచింది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25, 2025న ఈ చిత్రం రిలీజైంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీకి ఫస్ట్ నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఇందులో ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్, స్వాసిక విజయ్, రవి వర్మ, మధునందన్, హర్ష వర్ధన్ తదితరులు నటించారు.

ఈ శంబాల సినిమాకు యుగంధర్ ముని డైరెక్టర్. రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందించారు.

శంబాల స్టోరీ

సైన్స్ కు, మూఢ నమ్మకాలకు మధ్య జరిగే పోరాటమే శంబాల మూవీ. ఈ సినిమా కథ 1980లో శంబాల అనే గ్రామ నేపథ్యంలో సాగుతుంది. ఒక రోజు ఆకాశంలో నుంచి ఓ ఉల్క ఆ గ్రామంలో పడుతుంది. ఆ తర్వాత విలేజ్ లో వింత సంఘటనలు జరుగుతాయి. వరుస హత్యలు చోటు చేసుకుంటాయి.

హీరో ఎంట్రీతో

గ్రామానికి ఏదో కీడు జరిగిందని గ్రామస్తులు భయపడతారు. కొంతమందేమో దైవ శక్తి అంటే మరికొందరు దుష్ట శక్తి అంటారు. ఆ టైమ్ లోనే విక్రమ్ (ఆది సాయి కుమార్) ఎంట్రీ ఇస్తాడు. అతనో జియాలజిస్ట్. ఈ మిస్టరీని సైన్స్ తో ఛేదించేందుకు ప్రయత్నిస్తాడు. మరి అతని ప్రయత్నం సక్సెస్ అయిందా? అసలు ఈ రహస్యం ఏంటీ? అన్నది శంబాల మూవీలో చూడాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More