ఈ వారం ఓటీటీలోని తెలుగు సినిమాలు.. ఓ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్.. మిస్ కావొద్దు.. వీకెండ్‌కు బెస్ట్‌.. ఓ లుక్కేయండి

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో కొత్త సినిమాలు, సిరీస్ ల సందడి బాగానే ఉంది. ముఖ్యంగా తెలుగులో కొన్ని స్పెషల్ మూవీస్, ఓ బ్లాక్ బస్టర్ సిరీస్ రిలీజైంది. మరి వీటిపై ఈ వీకెండ్ కు ఓ లుక్కేయండి. 

Published on: Jan 10, 2026, 18:43:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలో ఈ వారం డిఫరెంట్ జోనర్లలోని సినిమాలు, సిరీస్ లు వచ్చాయి. అయితే ఇందులో తెలుగులో రిలీజైన కొన్ని మూవీస్, ఓ సిరీస్ ఓటీటీ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన వాటిల్లో వీటిని మాత్రం అసలు మిస్సవొద్దు. మరి ఆ సినిమాలు, సిరీస్ ఏంటో ఇక్కడ చూసేయండి.

ఓటీటీలో ఈ వారం సినిమాలు
ఓటీటీలో ఈ వారం సినిమాలు

అఖండ 2

నందమూరి బాల‌కృష్ణ‌ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించిన సినిమా అఖండ 2 తాండవం. బోయపాటి శ్రీను-బాల‌కృష్ణ‌ కాంబినేషన్లో వచ్చిన అఖండ మూవీకి ఇది సీక్వెల్. భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ హైప్ ను అందుకోలేకపోయింది. కానీ ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది అఖండ 2 తాండవం. ఇప్పుడు ఇండియాలో నంబర్ టూగా ట్రెండ్ అవుతోంది ఈ మూవీ.

కానిస్టేబుల్ కనకం సీజన్ 2

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన తెలుగు రిలీజ్ లు గురించి చెప్పుకోవాలంటే ముందుగా ఈ సిరీస్ గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్. అదే కానిస్టేబుల్ కనకం సీజన్ 2. బ్లాక్ బస్టర్ హిట్ అయిన సీజన్ 1ను మించేలా ఈ సీజన్ 2లో ట్విస్ట్ లున్నాయి. వర్ష బొల్లమ్మ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సిరీస్ ఈటీవీ విన్ లో అందుబాటులో ఉంది.

జిగ్రీస్

సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కామెంట్లతో ఒక్కసారిగా వైరల్ గా మారిన మూవీ జిగ్రీస్. దీనికి రవి ఎన్.పి. డైరెక్టర్. ఈ మూవీ సన్ నెక్ట్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉంటారు. వీళ్ల మధ్యలోకి ఓ అమ్మాయి వస్తుంది. ఆ తర్వాత వీళ్ల జీవితాలు ఎలాంటి మలుపు తీసుకున్నాయన్నదే ఈ రొమాంటిక్ కామెడీ మూవీ స్టోరీ.

సైలెంట్ స్క్రీమ్స్

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మరో తెలుగు సినిమా ‘సైలెంట్ స్క్రీమ్స్- ది లాస్ట్ గర్ల్స్ ఆఫ్ తెలంగాణ’. ఇదో మిస్టరీ థ్రిల్లర్. తక్కువ పాత్రలతో తెరకెక్కిన క్రైమ్ డాక్యుమెంటరీ ఇది. సమాజంలో అన్యాయానికి, లైంగిక వేధింపులకు గురైన అమ్మాయిల ఎలా రివేంజ్ తీర్చుకున్నారన్నది ఈ మూవీలో చూపించారు. ఇది సన్ నెక్ట్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

అందెలరవమిది

సంగీతానికి ప్రాధాన్యతనిస్తూ స్వచ్ఛమైన ప్రేమ కథగా తెరకెక్కిన మూవీ అందెలరవమిది. మ్యూజిక్ అంటే ఇష్టం ఉండే అమ్మాయి, అబ్బాయి మధ్య లవ్ స్టోరీనే ఈ మూవీ. ఇది ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More