Rithu Demon Pavan: బిగ్ బాస్ హౌస్‌లోకి సామాన్యుడిగా అడుగుపెట్టి, తన ఆట తీరుతో ఫైనల్ వరకు చేరి విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు డీమాన్ పవన్. అదే హౌస్‌లో రీతూ చౌదరితో అతనికున్న బాండింగ్, కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అభిమానులు వీరిద్దరినీ కలిపి 'రీవాన్' (ReVan - Rithu & Pavan) అని పిలుచుకుంటూ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టారు.
బిగ్ బాస్ బయట కూడా

బిగ్ బాస్ సీజన్ 9లో డీమాన్ పవన్, రీతూ చౌదరి పార్టిసిపేట్ చేశారు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ల ఫ్రెండ్ షిప్ కొనసాగింది. ఒకరి కష్టసుఖాల్లో మరొకరు తోడుగా ఉన్నారు. కలిసి వ్లాగ్స్ చేశారు. ట్రిప్పులు వేశారు. బీబీ జోడీ 2, కూకు విత్ జాతిరత్నాలు సీజన్ 2 అనే రియాలిటీ షోలు చేశారు. ‘బంగారం’ అనే వీడియో సాంగ్ కూడా రిలీజ్ చేశారు.
రీతూతో బ్రేకప్
డీమాన్ పవన్, రీతూ చౌదరి రిలేషన్ షిప్ లో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ షాకింగ్ గా డీమాన్ పవన్ తన ఇన్ స్టాగ్రామ్ లో బ్రేకప్ స్టోరీ పెట్టాడు. ‘‘రీవాన్ గురించి కంటిన్యూగా మెసేజ్ లు వస్తున్నాయి. రీతూ చౌదరితో నా సంబంధంపై వస్తున్న ట్రోల్స్, నెగిటివిటీ, ఫేక్ రూమర్స్ చాలా దారుణంగా ఉన్నాయి.
దీనిపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. నేను రీతూని వాడుకున్నానని లేదా తను నన్ను వాడుకుందని కొందరు అంటున్నారు. కానీ నిజ జీవితంలో అలాంటిదేమీ లేదు. బిగ్ బాస్ లో చూసిన దానికి, బయట జరిగినదానికి సంబంధం లేదు. ఎవరు ఎవరిని వాడుకోలేదు. మాది పూర్తిగా పరస్పర గౌరవంతో కూడిన స్నేహం" అని డీమాన్ పవన్ పేర్కొన్నాడు.
వాట్సాప్‌లో బ్లాక్.. ఇన్‌స్టాలో అన్‌ఫాలో
‘‘మా ఇద్దరికీ వ్యక్తిగత బలాలు, బలహీనతలున్నాయి. మేం గతంలో కలిసి పనిచేశాం. కానీ ఇకపై రీవాన్ అనేది ఉండదు. మా ఫ్రెండ్ షిప్ పూర్తిగా బ్రేకప్ అయింది. ఏ బంధంలోనైనా వ్యక్తిగత సమస్యలు ఉండటం సహజం. గత కొన్ని నెలలుగా మా మధ్య ఎన్నోసార్లు గొడవలు జరిగాయి. ప్రతిసారీ నేనే అర్థం చేసుకుని సమస్యను సరిదిద్దడానికి ప్రయత్నించాను.
{{/usCountry}}‘‘మా ఇద్దరికీ వ్యక్తిగత బలాలు, బలహీనతలున్నాయి. మేం గతంలో కలిసి పనిచేశాం. కానీ ఇకపై రీవాన్ అనేది ఉండదు. మా ఫ్రెండ్ షిప్ పూర్తిగా బ్రేకప్ అయింది. ఏ బంధంలోనైనా వ్యక్తిగత సమస్యలు ఉండటం సహజం. గత కొన్ని నెలలుగా మా మధ్య ఎన్నోసార్లు గొడవలు జరిగాయి. ప్రతిసారీ నేనే అర్థం చేసుకుని సమస్యను సరిదిద్దడానికి ప్రయత్నించాను.
{{/usCountry}}కానీ రోజురోజుకూ పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. అందుకే వేర్వేరుగా పని చేసుకోవాలనుకున్నాం. ఆమె నన్ను వాట్సాప్‌లో బ్లాక్ చేసి, స్నాప్‌చాట్‌లో డిలీట్ చేసింది. అది నాకు నచ్చలేదు. దాంతో నేను కూడా ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశాను. ప్రస్తుతం ఆమె నన్ను ఇన్‌స్టాలో బ్లాక్ చేసింది" అని డీమాన్ పవన్ క్లారిటీగా చెప్పాడు.
ఇకపై ఇద్దరం విడివిడిగానే తమ ప్రాజెక్టులపై దృష్టి పెడతామని, ప్రశాంతత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని పవన్ వివరించాడు. తమకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అధ్యాయానికి ముగింపు పడుతున్నట్లు స్పష్టం చేశాడు.