OTT Political: ఓటీటీలోకి సరికొత్త పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్- 50 ఎపిసోడ్లు, 2 సీజన్లు-2 నవలల ఆధారంగా శ్రద్ధా దాస్ సిరీస్
Dhai Chaal OTT Release With 50 Episodes: 2 బెస్ట్ సెల్లర్ నవలల ఆధారంగా తీసిన పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ధాయి చాల్ ఓటీటీలోకి రానుంది. విద్యార్థి రాజకీయాల నుంచి దేశ రాజధాని స్థాయి అధికార పీఠం వరకు సాగే కుట్రలు, ఎత్తుగడలతో తెరకెక్కిన ధాయి చాల్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
Shraddha Das Dhai Chaal OTT Streaming With 50 Episodes: ఓటీటీ వేదికలపై పొలిటికల్ థ్రిల్లర్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'మహారాణి', 'తాండవ్' వంటి ఓటీటీ సిరీస్‌ల బాటలో ఇప్పుడు మరో భారీ రాజకీయ కథనం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

2 నవలల ఆధారంగా వెబ్ సిరీస్
ప్రముఖ రచయిత నవీన్ చౌదరి కలం నుంచి జాలువారిన 'జనతా స్టోర్', 'ధాయి చాల్' అనే రెండు బెస్ట్ సెల్లర్ నవలల ఆధారంగా 'ధాయి చాల్' (Dhai Chaal) ఓటీటీ సిరీస్ రూపుదిద్దుకుంది. ఏకంగా 50 ఎపిసోడ్ల సుదీర్ఘ నిడివితో వస్తున్న ఈ సిరీస్ రాజకీయాల్లోని చీకటి కోణాలను, అధికార దాహాన్ని కళ్లకు కట్టనుంది.
తెలుగు ప్రేక్షకులకు 'లీడర్', 'ప్రస్థానం' వంటి విలువలు, కుట్రలతో కూడిన రాజకీయ చిత్రాలంటే ఎంతో ఆసక్తి. సరిగ్గా అదే తరహాలో, ఒక సామాన్య విద్యార్థి నాయకుడు రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయ చదరంగంలో ఎలా పావుగా మారాడు, ఆ తర్వాత ఎలా చక్రం తిప్పాడనే ఆసక్తికర కథాంశంతో ఈ సిరీస్ తెరకెక్కింది.
50 ఎపిసోడ్లతో ఓటీటీ సిరీస్
నవీన్ చౌదరి రాసిన ఈ రెండు పుస్తకాలు పాఠకుల ఆదరణ పొంది బెస్ట్ సెల్లర్ జాబితాలో నిలిచాయి. ఇప్పుడు ఆ నవలల్లోని పాత్రలకు దృశ్యరూపం ఇచ్చారు మేకర్స్. మొత్తం 50 ఎపిసోడ్ల ఈ సిరీస్‌ను రెండు భాగాలుగా ఓటీటీలోకి తీసుకురానున్నారు. తొలి సీజన్‌లోని 24 ఎపిసోడ్లను 'జనతా స్టోర్' నవల ఆధారంగా తీర్చిదిద్దారు.
క్యాంపస్ రాజకీయాలతో తొలి సీజన్..
రాజస్థాన్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో జరిగే విద్యార్థి రాజకీయాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మన దగ్గర ఉస్మానియా, ఆంధ్రా విశ్వవిద్యాలయాల్లో ఒకప్పుడు కనిపించినట్లుగానే, కాలేజీ ఎన్నికల్లో విద్యార్థి నాయకుల మధ్య జరిగే ఆధిపత్య పోరు, ఉద్యమాలు, సిద్ధాంతాల ఘర్షణలను ఇందులో సహజంగా చూపించారు. ప్రధాన రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం యువ నాయకులను ఎలా వాడుకుంటాయో తొలి సీజన్ స్పష్టం చేస్తుంది.
ఢిల్లీ స్థాయి ఎత్తుగడలతో రెండో భాగం..
రెండో సీజన్‌లోని 26 ఎపిసోడ్లను 'ధాయి చాల్' నవల ఆధారంగా రూపొందించారు. ఇక్కడ కథ యూనివర్సిటీ క్యాంపస్ దాటి రాష్ట్ర, జాతీయ రాజకీయాల స్థాయికి చేరుతుంది. ఎన్నికల వ్యూహాలు, పార్టీల మధ్య పొత్తులు, తెరవెనుక మీడియా పోషించే కీలక పాత్ర, అధికారం కోసం జరిగే కుమ్ములాటలను రెండో సీజన్‌లో ఉత్కంఠభరితంగా మలిచారు.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని, కేవలం అవసరాలు, పరిస్థితుల బట్టే బంధాలు మారుతుంటాయనే నగ్న సత్యాన్ని ఈ కథ మరోసారి ఆవిష్కరిస్తుంది. ఈ భారీ ప్రాజెక్టుకు బాలీవుడ్ ప్రముఖ రచయిత రితేష్ షా షో క్రియేటర్‌గా, రచయితగా వ్యవహరించారు.
'పింక్' రచయిత సారథ్యం.. తెలుగు హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎంట్రీ
గతంలో 'పింక్', 'ఎయిర్‌లిఫ్ట్', 'కహానీ' వంటి ఆలోచింపజేసే చిత్రాలకు రచన చేసిన రితేష్ షా ఈ సిరీస్‌కు బలమైన స్క్రీన్‌ప్లే అందించారు. సతీష్ కుంకుమ్‌నాథ్ నాయర్, నవ్ నిర్మాణ్ సింగ్ దర్శకత్వం వహించగా, ఫోకస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై భూషణ్ సూరి, రితేష్ షా, పార్థ్ సూరి ఈ సిరీస్‌ను నిర్మించారు.
ఇక నటీనటుల విషయానికొస్తే గగన్ అరోరా, ఆదిల్ జాఫర్ ఖాన్, అంకిత్ సివాచ్, అంజలి తత్రారి ప్రధాన పాత్రల్లో నటించారు. తొలి సీజన్‌లో రాజేష్ కుమార్, పరితోష్ సాండ్, రిషికా లోక్రే కీలక పాత్రలు పోషించగా, రెండో సీజన్‌లో తెలుగు గ్లామర్ హీరోయిన్ శ్రద్ధా దాస్, మీర్ సర్వర్, కామాక్షి భట్, హేతల్ గడా కొత్త పాత్రలతో కథలోకి ప్రవేశిస్తారు.
ధాయి చాల్ ఓటీటీ స్ట్రీమింగ్
రాజకీయ చదరంగంలో ఎత్తుకు పైఎత్తులు ఎలా ఉంటాయో చూడాలనుకునే వారికి ఈ ఓటీటీ సిరీస్ మంచి విందు కానుంది. నవంబర్ 27 నుంచి 'జియోహాట్‌స్టార్' (JioHotstar)లో ధాయి చాల్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


