Dhanush Murugan: సౌత్ ఇండియాను షేక్ చేసిన 'అసురన్', 'వడ చెన్నై' లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత కోలీవుడ్ క్రేజీ కాంబో ధనుష్, డైరెక్టర్ వెట్రిమారన్ మళ్లీ ఒక్కటయ్యారు. ఎప్పటినుంచో నడుస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ వీళ్లిద్దరి కొత్త ప్రాజెక్ట్ 'తమిళ్ మురుగన్' అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. సుబ్రహ్మణ్య స్వామి (లార్డ్ మురుగన్) కాన్సెప్ట్‌తో ఈ యాక్షన్ డ్రామా తెరకెక్కుతుండటంతో అదే కాన్సెప్ట్ లో వస్తున్న ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకు పోటీ కానుంది.
రూమర్లకు చెక్.. కానీ ఆ అనౌన్స్‌మెంట్ ఏంటి?

గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'పొల్లాదవన్', 'ఆడుకలం' నుంచి మొన్నటి 'అసురన్' వరకు అన్నీ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు అవార్డులు కూడా కొల్లగొట్టాయి. నిజానికి ధనుష్, వెట్రిమారన్ కాంబోలో 'వడ చెన్నై 2' వస్తుందని ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేశారు. కానీ దాన్ని పక్కనపెట్టి 'తమిళ్ మురుగన్' పేరుతో ఈ డిఫరెంట్ స్టోరీని పట్టాలెక్కిస్తున్నారు.
నిజానికి ధనుష్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం లెజెండరీ డైరెక్టర్ శంకర్ తో చేతులు కలుపుతున్నాడని మొన్నటిదాకా టాక్ నడిచింది. ఒక బాలీవుడ్ స్టార్ తో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారనే గాసిప్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఇప్పుడు వెట్రిమారన్ తోనే ఫిక్స్ అయ్యాడు మన నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్.
ఫస్ట్ లుక్ వీడియోపై ట్రోల్స్
అయితే ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీడియో గ్లింప్స్ చాలా హడావుడిగా రిలీజ్ చేసినట్లు క్లియర్ గా కనిపిస్తోంది. ప్యూర్ గా ఏఐ (AI) జనరేటెడ్ విజువల్స్ తో, క్వాలిటీ లేకుండా డిజైన్ చేసిన ఈ అనౌన్స్‌మెంట్ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతోంది. కనీసం ఒక సాలిడ్ పోస్టర్ రిలీజ్ చేసినా బాగుండేదని ధనుష్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
ఎన్టీఆర్ vs ధనుష్.. మురుగన్ కాన్సెప్ట్ తో క్లాష్?
ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. మురుగన్ కాన్సెప్ట్ తో సౌత్ లో వస్తున్న రెండో భారీ ప్రాజెక్ట్ ఇది. ఇప్పటికే గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ (NTR), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఇలాంటి బ్యాక్ డ్రాప్ తోనే ఓ పాన్ ఇండియా సినిమా అనౌన్స్ అయింది. ఒక పాపులర్ నవల ఆధారంగా త్రివిక్రమ్ తన మార్క్ డైలాగ్స్ తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.
{{/usCountry}}ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. మురుగన్ కాన్సెప్ట్ తో సౌత్ లో వస్తున్న రెండో భారీ ప్రాజెక్ట్ ఇది. ఇప్పటికే గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ (NTR), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఇలాంటి బ్యాక్ డ్రాప్ తోనే ఓ పాన్ ఇండియా సినిమా అనౌన్స్ అయింది. ఒక పాపులర్ నవల ఆధారంగా త్రివిక్రమ్ తన మార్క్ డైలాగ్స్ తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.
{{/usCountry}}ఇప్పుడు కరెక్ట్ గా అదే మురుగన్ థీమ్ తో ధనుష్, వెట్రిమారన్ బరిలోకి దిగడం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ రెండు సినిమాల మధ్య కచ్చితంగా క్లాష్ ఉంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. తెలుగు వాళ్లకంటే తమిళులకు మురుగన్ అంటే విపరీతమైన భక్తి, ఎమోషన్ ఉంటాయి. ఆ నేటివిటీని వెట్రిమారన్ లాంటి రా అండ్ రస్టిక్ డైరెక్టర్ తనదైన స్టైల్ లో అథెంటిక్ గా ప్రెజెంట్ చేస్తాడని కోలీవుడ్ ట్రేడ్ పండితులు గట్టిగా నమ్ముతున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య కూడా ఫైట్
ధనుష్ సినిమా పూర్తి మైథలాజికల్ జానర్ లో ఉంటుందా లేక ఫాంటసీ ఎలిమెంట్స్ తో సాగే కాంటెంపరరీ డ్రామానా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. తారక్, త్రివిక్రమ్ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
అదే సమయంలో అనిరుధ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన సాయి అభ్యంకర్ ధనుష్ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వబోతున్నాడు. గురువు ఒక సినిమాకు, శిష్యుడు ఇంకో సినిమాకు వర్క్ చేస్తుండటం విశేషం. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు భారీ ప్రాజెక్టులు ఒకేసారి రిలీజ్ అవుతాయా లేక వేరు వేరు టైమ్స్ లో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయా అనేది కాలమే నిర్ణయించాలి.