Dhanush OM: వెర్సటైల్ యాక్టర్ ధనుష్, డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ల్యాండ్‌మార్క్ మూవీ 'D55' (ధనుష్ 55వ చిత్రం) అఫీషియల్ టైటిల్, గ్లింప్స్ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు మేకర్స్ ‘ఓమ్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు.

ఈ టైటిల్‌తో పాటు రిలీజ్ చేసిన రెండు నిమిషాలకుపైగా నిడివి గల ఇంటెన్స్ గ్లింప్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అవుట్ అండ్ అవుట్ రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
అడవిలో ధనుష్ విద్వంసం.. గ్లింప్స్ ఎలా ఉందంటే?
తాజాగా విడుదలైన గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలను ఒక్కసారిగా భారీగా పెంచేసింది. ఒక దట్టమైన అడవి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సీన్ మొదలవుతుంది. అక్కడ కొందరు వ్యక్తులను ఐదుగురు గన్‌మెన్ చుట్టుముడతారు. అలాంటి హై-టెన్షన్ పరిస్థితుల్లో ధనుష్ తన అసమానమైన పరాక్రమంతో, ఒంటిచేత్తో ఆ గన్‌మెన్ అందరినీ వేటాడి వేధించే యాక్షన్ సీక్వెన్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.
ఈ గ్లింప్స్ చూస్తుంటే థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సాలిడ్ యాక్షన్ ఫీస్ట్ గ్యారెంటీ అనిపిస్తోంది. ఈ సినిమా మొదటి భాగానికి ‘OM Chapter 1: Udhiram – The Blood Wood’ (ఓమ్ ఛాప్టర్ 1: ఉధిరమ్ – ది బ్లడ్ వుడ్) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. టైటిల్ పోస్టర్ లో ధనుష్ ఓ చేతిలో గన్ను, మరో చేతిలో గొడ్డలితో చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపించాడు.
ఓమ్ మూవీ క్రేజీ అప్‌డేట్స్
- నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల
{{/usCountry}}- నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల
{{/usCountry}}- దర్శకుడు: రాజ్‌కుమార్ పెరియాసామి (అమరన్ ఫేమ్)
- బ్యానర్: గోపురం ఫిల్మ్స్ (అన్బుచెజియన్)
- సంగీతం: సాయి అభ్యంకర్
- ఛాప్టర్ 1 రిలీజ్ డేట్: అక్టోబర్ 16, 2026
ముగ్గురు సూపర్ స్టార్స్ కలయిక.. మమ్ముట్టి కీలక పాత్ర!
ఈ సినిమాకు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని కాస్టింగ్. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో ఒక అత్యంత కీలకమైన, పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన క్యారెక్టర్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుందని ఇండస్ట్రీ టాక్.
ఇక టాలీవుడ్ సెన్సేషన్స్, క్రేజీ హీరోయిన్లు సాయి పల్లవి, శ్రీలీల ఇద్దరూ ఇందులో నటిస్తుండటం విశేషం. సాయి పల్లవి పెర్ఫార్మెన్స్, శ్రీలీల గ్లామర్, డ్యాన్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ కానున్నాయి. 'అమరన్' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియాసామి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ట్రేడ్ వర్గాల్లో దీనిపై భారీ బిజినెస్ అంచనాలు ఉన్నాయి.
ఓమ్.. అసలు కథేంటి? రిలీజ్ ఎప్పుడంటే?
సమాజంలో మన మధ్యే తిరుగుతూ, దేశం కోసం పోరాడే కొందరు అనామక వీరుల జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. గోపురం ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అన్బుచెజియన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి రీసెంట్‌గా మ్యూజిక్ సెన్సేషన్‌గా మారిన సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఇక అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా మొదటి భాగం 'ఓమ్ ఛాప్టర్ 1: ఉధిరమ్' దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ధనుష్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ యాక్షన్ ఓపెనర్ కానుందని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.