...
...
Next Story

Dhanush Review: ఇదో మాస్టర్‌పీస్: కీర్తి సురేష్ సినిమాపై ధనుష్ ప్రశంసల వర్షం.. మ్యూజిక్ మైండ్ బ్లోయింగ్ అంటూ..

Dhanush Reviews Keerthy Suresh Dorothy: కీర్తి సురేష్ నటించిన తమిళ మూవీ డొరొతీపై ధనుష్ ప్రశంసల వర్షం కురిపించాడు. శుక్రవారం (సెప్టెంబర్ 25) థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ ఓ మాస్టర్‌పీస్ అని అతడు అనడం విశేషం.

Published on: Sep 24, 2026, 21:10:52 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Dhanush Reviews Keerthy Suresh Dorothy: కోలీవుడ్ వర్సటైల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్, నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియడ్ డ్రామా 'డొరొతీ' (Dorothy). ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తోంది. సెప్టెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ మూవీని రిలీజ్ కి ముందే చూసిన తమిళ స్టార్ హీరో ధనుష్ షాకింగ్ రివ్యూ ఇచ్చాడు.

ధనుష్ ట్వీట్ వైరల్.. "ఇళయరాజా మ్యూజిక్ రుద్రతాండవం!"

Dhanush Review: ఇదో మాస్టర్‌పీస్: కీర్తి సురేష్ సినిమాపై ధనుష్ ప్రశంసల వర్షం.. మ్యూజిక్ మైండ్ బ్లోయింగ్ అంటూ..
Dhanush Review: ఇదో మాస్టర్‌పీస్: కీర్తి సురేష్ సినిమాపై ధనుష్ ప్రశంసల వర్షం.. మ్యూజిక్ మైండ్ బ్లోయింగ్ అంటూ..

ఈ ఇండిపెండెంట్ పీరియడ్ డ్రామాను ముందుగానే చూసిన ధనుష్, తన ఎక్స్ ఖాతాలో సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. కార్తీక్ సుబ్బరాజ్ తీసిన ఈ సినిమా ఒక అద్భుతమైన 'మాస్టర్‌పీస్' అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. సినిమా కథ చాలా బోల్డ్ గా, రా అండ్ ఇంటెన్స్ గా ఉందంటూ మేకింగ్ వైబ్స్ ని మెచ్చుకున్నాడు.

ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరూ తమ నటనతో మెప్పించారని చెప్పిన ధనుష్, సంగీతజ్ఞాని ఇళయరాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి స్పెషల్ గా ప్రస్తావించాడు. "ఇసైజ్ఞాని ఇళయరాజా సర్ అందించిన మ్యూజిక్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఇది నిజంగా మ్యూజికల్ రుద్రతాండవం. నా డియర్ ఫ్రెండ్ కార్తీక్ సుబ్బరాజ్ కి, మొత్తం టీమ్ కి ఆల్ ది బెస్ట్" అంటూ పోస్ట్ చేశాడు.

కార్తీక్ సుబ్బరాజ్ - ధనుష్ కాంబో ఫ్రెండ్‌షిప్.. క్రేజ్ నెక్స్ట్ లెవెల్

ధనుష్, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన 'జగమే తందిరం' సినిమా గ్లోబల్ వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. నాటి నుంచి వీరిద్దరి మధ్య గట్టి బాండింగ్ ఉంది. ఇప్పుడు తన క్లోజ్ ఫ్రెండ్ తీసిన 'డొరొతీ' సినిమాకి ధనుష్ ఇచ్చిన ఈ సాలిడ్ రివ్యూతో మూవీపై అంచనాలు ఒక్కసారిగా పీక్స్ కి చేరాయి.

టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్ లో రచ్చ.. ఆస్కార్ విన్నింగ్ బ్యానర్ ప్రొడక్షన్

ఈ విజువల్ డ్రామాను ఆస్కార్ విన్నింగ్ ప్రొడక్షన్ హౌస్ 'సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్స్', ప్రముఖ నిర్మాణ సంస్థ 'జియో స్టూడియోస్' సంయుక్తంగా నిర్మించాయి. కీర్తి సురేష్ తో పాటు సనంత్, రిషికాంత్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.

సెప్టెంబర్ 25న థియేటర్లలోకి వస్తున్న 'డొరొతీ' సినిమాకి ధనుష్ ఇచ్చిన రివ్యూ కలెక్షన్ల పరంగా పెద్ద బూస్ట్ ఇవ్వనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇళయరాజా క్లాసిక్ మ్యూజిక్, కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ పీరియడ్ డ్రామా ఎలిమెంట్స్, కీర్తి సురేష్ ఇంటెన్స్ యాక్టింగ్ చూడటానికి మూవీ లవర్స్ సిద్ధమవుతున్నారు. మరోవైపు కీర్తి సురేష్ ఓ స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ ఇరగదీసిన ది ప్యారడైజ్ మూవీ ఒక రోజు ముందే థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks