...
...
Next Story

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ధనుష్.. తన ఇద్దరు కొడుకులే తనకు రక్షణగా నిలిచిన వీడియో వైరల్

ప్రముఖ నటుడు ధనుష్ తన ఇద్దరు కుమారులు యాత్రా, లింగాలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. దర్శనం తర్వాత బయటకు వస్తున్న ధనుష్‌ను అభిమానులు చుట్టుముట్టగా.. అతని కుమారులు తండ్రికి రక్షణగా నిలవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Published on: Jan 28, 2026 03:21 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) బుధవారం (జనవరి 28) ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించాడు. తన ఇద్దరు కుమారులు యాత్రా (Yatra), లింగా (Linga)లతో కలిసి అతడు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాడు. ఈ సందర్భంగా వారు సంప్రదాయ పట్టు వస్త్రాలు (ధోతీ, అంగవస్త్రం) ధరించి కనిపించారు.

తండ్రికి బాడీగార్డులుగా..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ధనుష్.. తన ఇద్దరు కొడుకులే తనకు రక్షణగా నిలిచిన వీడియో వైరల్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ధనుష్.. తన ఇద్దరు కొడుకులే తనకు రక్షణగా నిలిచిన వీడియో వైరల్

ధనుష్ తిరుమల ఆలయం నుంచి బయటకు రాగానే అభిమానులు అతన్ని చూడటానికి, సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. జనం ఒక్కసారిగా చుట్టుముట్టడంతో, ధనుష్ కుమారులు యాత్రా, లింగా వెంటనే అప్రమత్తమయ్యారు. తండ్రికి ఇబ్బంది కలగకుండా వారిద్దరూ రక్షణ కవచంలా మారి, జనాల మధ్య నుంచి అతన్ని ముందుకు తీసుకెళ్లారు. పిల్లలిద్దరూ తమ తండ్రి పట్ల చూపిన శ్రద్ధ, రక్షణ భావం చూసి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ధనుష్ పెళ్లి, సంతానం

ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ దంపతులకు యాత్రా, లింగా అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కుమారుడు యాత్రా సినిమాటోగ్రాఫర్ కావాలని కోరుకుంటున్నట్లు సమాచారం. 18 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 2022లో ధనుష్, ఐశ్వర్య విడిపోయినప్పటికీ.. పిల్లల బాధ్యతలను ఇద్దరూ కలిసి చూసుకుంటున్నారు.

ధనుష్ సినిమా విశేషాలు..

ధనుష్ ఇటీవల ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో వచ్చిన 'తేరే ఇష్క్ మే' (Tere Ishk Mein) అనే హిందీ రొమాంటిక్ డ్రామాలో కనిపించాడు. ఇందులో కృతి సనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. ఇక ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 161.96 కోట్లు వసూలు చేసింది. ధనుష్ తన తర్వాతి ప్రాజెక్టులో భాగంగా విఘ్నేష్ రాజా దర్శకత్వంలో 'కార' (Kara) అనే సినిమాలో నటిస్తున్నాడు. డాక్టర్ ఇషారి కే గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ సమ్మర్లో విడుదల కానుంది.

ధనుష్, మృణాల్ డేటింగ్

ధనుష్, మృణాల్ పెళ్లి వేడుకకు స్టార్ హీరోలు దళపతి విజయ్, అజిత్ కుమార్, దుల్కర్ సల్మాన్, సూర్య, హీరోయిన్లు త్రిష, శ్రుతి హాసన్, సంగీత దర్శకుడు అనిరుధ్ వంటి స్టార్లందరూ హాజరైనట్లు ఆ వీడియోలో ఉంది. ట్రెడిషనల్ తెల్లటి పంచెలో ధనుష్, ఎర్రటి పట్టుచీరలో మృణాల్ పెళ్లి పీటలపై కూర్చున్న విజువల్స్ చూసి ఫ్యాన్స్ నిజంగానే పెళ్లి జరిగిందేమోనని భ్రమపడ్డారు. అయితే ఈ వీడియో వెనుక ఉన్నది మనిషి కాదు.. ఏఐ అని తెలుసుకొని ఫ్యాన్స్ షాక్ తిన్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe