Dhruv Anupama: ప్రేమ అనేది ఇంటర్‌స్టెల్లార్, హార్మోన్స్ లాంటివి.. అనుపమ పీరియడ్స్ కామెంట్స్‌పై ధ్రువ్ విక్రమ్ కౌంటర్?
Dhruv Vikram About Hormones Over Anupama Parameswaran Periods Comments: మాజీ ప్రియుడి వేధింపులపై హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట సంచలనంగా మారాయి. ఈ క్రమంలో ధ్రువ్ విక్రమ్ హార్మోన్స్, ఇంటర్‌స్టెల్లార్ అంటూ చేసిన కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Dhruv Vikram About Hormones Over Anupama Parameswaran Periods Comments: కోలీవుడ్ యంగ్ హీరో, వర్సటైల్ యాక్టర్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ డేటింగ్‌లో ఉన్నారనే రూమర్స్ తర్వాత వారి రిలేషన్‌షిప్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు ఇతరులు పేర్లు చెప్పకుండా తమ ప్రేమ బంధంలో జరిగిన విషయాలను బహిర్గతంగా పంచుకోవడం వివాదంగా మారుతోంది.

అనుపమ వ్యాఖ్యలతో రాజుకున్న వివాదం
అయితే, అనుపమ పరమేశ్వరన్ ఇటీవల ఒక టాక్ షోలో తన పాత రిలేషన్‌షిప్‌పై చేసిన వ్యాఖ్యలతో దక్షిణాది సినీ వర్గాల్లో ఈ వివాదం మొదలైంది. మూడేళ్ల పాటు ఒక నార్సిసిస్ట్ (స్వార్థపరుడైన ప్రియుడు) చేతిలో మానసిక వేధింపులకు గురయ్యానని అనుపమ ఆరోపణలు చేసింది.
పీరియడ్స్‌ను సాకుగా చూపిస్తూ
ఏ చిన్న గొడవ జరిగినా, తన వైపు నుంచి ప్రశ్నలు అడిగినా.. తన పీరియడ్స్‌ను (Periods/PMS) సాకుగా చూపిస్తూ తన భావోద్వేగాలను అవహేళన చేసేవాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది అనుపమ. ఈ వేధింపుల వల్ల తన ఆత్మవిశ్వాసాన్ని, స్వభావాన్ని కోల్పోయానని, చివరికి తాను నటించిన 'డ్రాగన్' సినిమా ప్రమోషన్లకు కూడా వెళ్లకుండా ఆ వ్యక్తి తన కెరీర్‌ను నియంత్రించేందుకు ప్రయత్నించాడని చెప్పుకొచ్చింది.
ధ్రువ్ విక్రమ్ వీడియో వైరల్
అనుపమ చేసిన వ్యాఖ్యలు ధ్రువ్ విక్రమ్‌పైనే సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు తాజాగా ధ్రువ్ విక్రమ్ చేసిన కామెంట్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ప్రేమను ది ఒడిస్సీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ఇంటర్ స్టెల్లర్ సినిమాతో పోలుస్తూ హార్మోన్లపై ధ్రువ్ విక్రమ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇంటర్‌స్టెల్లార్ సినిమాలో
"ప్రేమ అనేది కంటికి కనిపించని ఒక అద్భుతమైన అనుభూతి. అది గాలి లాంటిది, దాన్నెవరూ తాకలేరు కానీ అనుభవించగలరు. ఇంటర్‌స్టెల్లార్ సినిమాలో చెప్పినట్లు.. విశ్వంలో గురుత్వాకర్షణ (Gravity) కాకుండా పరిమాణాత్మకంగా కొలవగల మరొక ఏకైక శక్తి ప్రేమ మాత్రమే" అని ధ్రువ్ పేర్కొన్నాడు.
"ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనేది చాలా ప్రత్యేకమైనది. భావోద్వేగాలు, హార్మోన్స్, వ్యక్తిగత దృక్పథాల కలయికతోనే ఆ బంధం ఏర్పడుతుంది" అని ధ్రువ్ విక్రమ్ అన్నాడు. దానికి "అవును, ఎవరి కోణంలో వారికి ప్రేమ అంటే ఒక భావన ఉంటుంది. మీరు అనుకుంది చాలా బ్యూటిఫుల్‌గా ఉంది" అని యాంకర్ చెప్పారు.
హార్మోన్స్ అంటూ
అయితే, ఈ వీడియోలో ధ్రువ్ విక్రమ్ హార్మోన్స్ అని ఎత్తడంతో ఇది అనుపమ పరమేశ్వరన్ పీరియడ్స్‌పై చేసిన కామెంట్స్‌కు కౌంటర్ అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. "హార్మోన్స్ అని వచ్చిందంటే కచ్చితంగా అనుపమ పరమేశ్వరన్ గురించే అని ఒకరు" ఆ వీడియోకు కామెంట్ చేశారు.
అయితే, ఎస్ఎస్ మ్యూజిక్ నిర్వహించిన ఓ పాడ్‌కాస్ట్‌లో ధృవ్ విక్రమ్ పైవిధంగా మాట్లాడాడు. ఈ పాడ్‌కాస్ట్ 9 నెలల క్రితం అంటే 2025 నవంబర్‌లో బైసన్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగింది. బైసన్ సినిమా సమయం నుంచే ధ్రువ్, అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో పడ్డారని టాక్ వచ్చిన విషయం తెలిసిందే.
రిలేషన్‌షిప్‌లో ఉన్న సమయంలోనే
ధ్రువ్, అనుపమ పరమేశ్వరన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న సమయంలోనే హీరో ఇలా మాట్లాడాడని తెలుస్తోంది. కానీ, అప్పుడు అనుపమ పమరేశ్వరన్ ఎలాంటి వివాదాస్పద కామెంట్స్ చేయలేదు. అనుపమ కామెంట్స్‌కు ధ్రువ్ చెప్పిన హార్మోన్స్ వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేకపోవచ్చని మరో వాదన వినిపిస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


