బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద తన జైత్రయాత్రను నిరాటంకంగా కొనసాగిస్తోంది. భారతదేశంలో ధురంధర్ 2 రూ. 1000 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించిన మొట్టమొదటి హిందీ చిత్రంగా చరిత్ర సృష్టించింది. అలాగే, ఈ సినిమా మూడో వారాంతం తర్వాత కూడా గట్టి పోటీనిస్తోంది.
వసూళ్ల వివరాలు

ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్ 'సక్నిల్క్' (Sacnilk) అందించిన గణాంకాల ప్రకారం, ‘ధురంధర్ 2’ మూడో సోమవారం (19వ రోజు) దేశీయంగా రూ. 10.00 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో భారత్‌లో 19 రోజుల్లో ధురంధర్ 2 చిత్రం నెట్ కలెక్షన్స్ రూ. 1,023.77 కోట్లకు చేరుకున్నాయి. అలాగే, రూ. 1213.74 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా.
ధురంధర్ 2 వారాల వారీగా ఇండియన్ నెట్ కలెక్షన్స్:
మొదటి వారం: రూ. 674.17 కోట్లు (నెట్)
రెండో వారం: రూ. 263.65 కోట్లు (నెట్)
మూడో వారం (శుక్ర-ఆది): రూ. 75.95 కోట్లు (వరుసగా రూ. 21.55 కోట్లు, రూ. 25.65 కోట్లు, రూ. 28.75 కోట్లు)
సోమవారం (ఏప్రిల్ 6) నాడు కలెక్షన్స్‌లో సహజమైన తగ్గుదల కనిపించినప్పటికీ ధురంధర్ 2 సినిమా తన పట్టును కోల్పోలేదు. కేవలం 18 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1600 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కును ఈ చిత్రం దాటేసింది. అలాగే, 19 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ధురంధర్ 2 చిత్రం సుమారుగా రూ. 1622.72 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.
తెర వెనుక హీరోలకు సారా అర్జున్ ధన్యవాదాలు
కాగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన హీరోయిన్ సారా అర్జున్ సోషల్ మీడియా వేదికగా దర్శకుడు ఆదిత్య ధర్, రణ్‌వీర్ సింగ్‌లతో దిగిన ఫోటోలను పంచుకున్నారు. "నేను మొదటిసారి ఆదిత్య సార్‌ను కలిసినప్పుడే ఆయన కళ్లలో ఏదో తెలియని మెరుపు కనిపించింది. ఆయన సినిమా కోసం ఏదో అద్భుతం చేస్తారని అప్పుడే నాకు అర్థమైంది. ఈ ప్రయాణంలో ప్రతి అడుగులోనూ ఆ నమ్మకం నిజమవుతూనే వచ్చింది" అని సారా అర్జున్ పేర్కొన్నారు.
{{/usCountry}}కాగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన హీరోయిన్ సారా అర్జున్ సోషల్ మీడియా వేదికగా దర్శకుడు ఆదిత్య ధర్, రణ్‌వీర్ సింగ్‌లతో దిగిన ఫోటోలను పంచుకున్నారు. "నేను మొదటిసారి ఆదిత్య సార్‌ను కలిసినప్పుడే ఆయన కళ్లలో ఏదో తెలియని మెరుపు కనిపించింది. ఆయన సినిమా కోసం ఏదో అద్భుతం చేస్తారని అప్పుడే నాకు అర్థమైంది. ఈ ప్రయాణంలో ప్రతి అడుగులోనూ ఆ నమ్మకం నిజమవుతూనే వచ్చింది" అని సారా అర్జున్ పేర్కొన్నారు.
{{/usCountry}}ముఖ్యంగా తెర వెనుక కష్టపడే సాంకేతిక నిపుణుల గురించి ప్రస్తావిస్తూ.. "మేము పోస్టర్లపై కనిపించే ముఖాలం మాత్రమే, కానీ మీరు ఈ సినిమాకు వెన్నెముక వంటి వారు. వెలుగులో ఉన్న తారలకు ఎంత చప్పట్లు కొడతారో, తెర వెనుక చెమట చిందించిన అజ్ఞాత వీరులకు కూడా అంతే గౌరవం దక్కాలి" అని సారా అర్జున్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
సినిమా నేపథ్యం
జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ నిర్మించిన ధురంధర్ ది రివేంజ్ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ గూఢచారి జస్కీరాత్ సింగ్ రంగీ పాత్రలో నటించగా.. ఆర్. మాధవన్ ఐబీ డైరెక్టర్ అజయ్ సన్యాల్‌గా కనిపించారు. పాకిస్థాన్‌లో జరిగే ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ నేపథ్యంలో సాగే ఈ కథలో కాందహార్ హైజాక్, 26/11 ముంబై దాడుల వంటి వాస్తవ సంఘటనలను స్పృశించారు.
గల్ఫ్ దేశాలు, పాకిస్థాన్‌లో ధురంధర్ 2 సినిమాపై నిషేధం విధించినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో భారీ వసూళ్లను రాబడుతోంది. కొన్ని వర్గాల నుంచి 'ప్రొపగాండా' అనే విమర్శలు వచ్చినప్పటికీ, సామాన్య ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.