Dhurandhar 2: ఆ సినిమా రెండు రోజులు కూడా ఆడలేదు-కంగనా రనౌత్ మూవీపై ధురంధర్ 2 నటుడి పరోక్ష విమర్శలు-రాజకీయాలను నమ్మనంటూ
Dhurandhar 2: ధురంధర్ 2 నటుడు రాకేష్ బేడీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధురంధర్ 2 పై వస్తున్న విమర్శలకు అదిరే కౌంటర్ ఇచ్చాడు. కంగనా రనౌత్ సినిమాపై పరోక్షంగా సెటైర్లు వేశాడు.
రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఈ క్రమంలో చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు రాకేష్ బేడీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పరోక్షంగా కంగనా రనౌత్ సినిమాను విమర్శించాడు. ధురంధర్ 2 సినిమాను 'ప్రచారం' (Propaganda) అని విమర్శిస్తున్న వారికి ఆయన గట్టి కౌంటర్ ఇచ్చాడు.

సినిమానే నమ్ముతా
రాకేష్ బేడీ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను రాజకీయాలను నమ్మను, సినిమాను మాత్రమే నమ్ముతాను. ఒక చిత్రాన్ని ఇష్టపడే హక్కు అందరికీ ఉంటుంది. కానీ దాన్ని ఒక వర్గానికి లేదా రాజకీయ పార్టీకి ఆపాదించడం సరైనది కాదు. ప్రజలు ఈ సినిమా (ధురంధర్ 2)ను ప్రేమిస్తున్నారంటేనే ఇది ఎంత గొప్పదో అర్థమవుతోంది" అని పేర్కొన్నారు.
రెండు రోజులు కూడా
ఇదే క్రమంలో కంగనా రనౌత్ నటించిన 'ఎమర్జెన్సీ' సినిమాను ఉద్దేశించి రాకేష్ బేడీ పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. "ఇటీవల ఇందిరా గాంధీ, మోదీలపై సినిమాలు తీశారు. కానీ ఆ సినిమాలు రెండు రోజులు కూడా సరిగ్గా ఆడలేదు. కానీ 'ధురంధర్ 2' స్క్రీన్‌ప్లే చాలా బలంగా ఉంది. ఇంత భారీ స్థాయి చిత్రాన్ని ప్రేక్షకులు ఇప్పటివరకు చూడలేదు" అని రాకేష్ బేడీ చెప్పుకొచ్చాడు.
కంగనా డైరెక్టర్
2025లో విడుదలైన ఎమర్జెన్సీ మూవీ ఫ్లాప్ అయింది. దివంగత ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోని ఎమర్జెన్సీ (1975–77) ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. దీనికి కంగనా రనౌత్ డైరెక్టర్ కూడా. ఇందులో ఆమె ఇందిరా గాంధీ పాత్ర పోషించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేక, ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.18.40 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
ధురంధర్ 2 గురించి
మరోవైపు ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై థ్రిల్లర్ ధురంధర్ 2 ఇండియాలో తొలిరోజే రూ.146 కోట్లు (ప్రివ్యూలతో కలిపి) వసూలు చేసి చరిత్ర సృష్టించింది. మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు సైతం ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సినిమాలో రణవీర్ సింగ్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ నటనను కనబరిచినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
సీక్వెల్
ధురంధర్ మూవీ డిసెంబర్ 5, 2025న థియేటర్లలో రిలీజైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. దీనికి సీక్వెల్ గా ధురంధర్ 2 మార్చి 19, 2026న విడుదలైంది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


