...
...
Next Story

Dhurandhar 2: బాహుబలి 2 రికార్డు గాలిలో కలిపోవాల్సిందేనా? 6 లక్షల టికెట్లు ఖతం.. బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' ఊచకోత!

Dhurandhar 2: రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో బాహుబలి 2, జవాన్ వంటి భారీ చిత్రాల రికార్డులను చెరిపివేస్తూ ఇప్పటికే మల్టీప్లెక్స్ ల్లోనే 6 లక్షల టికెట్లను విక్రయించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి

Published on: Mar 18, 2026, 11:42:01 IST
Advertisement

రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2: ది రివెంజ్ థియేటర్లలోకి రాకముందే చరిత్ర సృష్టిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ భారీ సీక్వెల్ మార్చి 19, 2026న విడుదల కానుంది. అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లోనూ ధురంధర్ 2 రికార్డులు తిరగరాస్తోంది. మల్టీప్లెక్స్ థియేటర్లలో బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసే దిశగా ధురంధర్ 2 దూసుకెళ్తోంది.

104 రోజులకే

బాహుబలి 2 రికార్డుపై ధురంధర్ 2 గురి (Screengrabs from YouTube/B62 Studios/Dharma Productions)
బాహుబలి 2 రికార్డుపై ధురంధర్ 2 గురి (Screengrabs from YouTube/B62 Studios/Dharma Productions)

ధురంధర్ 2 బాలీవుడ్ చరిత్రలో అత్యంత వేగంగా విడుదలైన సీక్వెల్ గా నిలవనుంది, మొదటి చిత్రం విడుదలైన 104 రోజులకే ధురంధర్ 2 థియేటర్లకు వస్తోంది. ధురంధర్ సినిమా డిసెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ధురంధర్ 2 ఏమో రేపు (మార్చి 19)న థియేటర్లకు రాబోతోంది.

బాహుబలి 2 రికార్డుకు ఎసరు!

సక్నిల్క్ నివేదికల ప్రకారం ధురంధర్ 2 తన ఫస్ట్ డే, ప్రీవ్యూ షోల కోసం జాతీయ మల్టీప్లెక్స్ చైన్‌లలో ఏకంగా 6 లక్షల టిక్కెట్లను విక్రయించింది. ఇది భారతీయ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన బాహుబలి 2 (హిందీ) రికార్డుకు అతి సమీపంలో ఉంది. బాహుబలి 2 ఏమో 6.50 లక్షల టికెట్లు సేల్ చేసింది.

టాప్ అడ్వాన్స్ బుకింగ్స్ (హిందీ)

బాహుబలి 2: 6.50 లక్షలు

ధురంధర్ 2: 6.00 లక్షలు (ఇంకా ఒక రోజు మిగిలి ఉంది!)

జవాన్: 5.57 లక్షలు

పఠాన్: 5.56 లక్షలు

నైట్ షోల హవా!

ముంబై, ఢిల్లీ, బెంగళూరుతో పాటు హైదరాబాద్‌లో కూడా ధురంధర్ 2 సినిమా డిమాండ్ మామూలుగా లేదు. అర్ధరాత్రి షోల అడ్వాన్స్ బుకింగ్స్ సైతం నిమిషాల్లో ఫుల్ అయిపోతున్నాయి. PVR INOX లోనే 1.5 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయంటే రణ్‌వీర్ సింగ్ మేనియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్. ఈ మూవీ డిసెంబర్ 5, 2025న రిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ధురంధర్ 2 రాబోతుంది. ఇందులో సారా అర్జున్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ తదితరులు నటించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks