బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద అప్రతిహత జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం 6 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.919 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది.
ధురంధర్ 2 కలెక్షన్లు

ధురంధర్ 2 సినిమా రన్నింగ్ టైమ్ 3 గంటల 49 నిమిషాలు ఉన్నప్పటికీ, ప్రేక్షకులు ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు కలెక్షన్లే నిదర్శనం. సక్నిల్క్ ప్రకారం ధురంధర్ 2 సినిమాకు ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.919 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇండియాలో చూసుకుంటే గ్రాస్ కలెక్షన్లు రూ.687.43 కోట్లుగా ఉన్నాయి.
ఆరో రోజు
వీక్ డేస్ లో కూడా ధురంధర్ 2 జోరు కొనసాగుతోంది. అయిదో రోజు రూ.65 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ ఆరో రోజు (మార్చి 24) రూ.56.55 కోట్ల నెట్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. మంగళవారం థియేటర్ల ఆక్యుపెన్సీ 36.6% గా నమోదైంది.
ఆ రికార్డు దిశగా
ధురంధర్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద అత్యంత వేగంగా దూసుకుపోతోంది. ధురంధర్ 2 కేవలం ఆరు రోజుల్లోనే ఈ స్థాయి కలెక్షన్లను సాధించి, అతి తక్కువ కాలంలో రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరే దిశగా దూసుకుపోతోంది.
తెలుగులో
ధురంధర్ 2 ఆరో రోజు కలెక్షన్లు చూసుకుంటే హిందీ వెర్షన్ నుంచి అత్యధిక వసూళ్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా 17,910 షోలతో 36.7% ఆక్యుపెన్సీతో రూ.52.00 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత తెలుగు వర్షన్ నుంచే ఎక్కువ కలెక్షన్లు రావడం విశేషం. తెలుగు వెర్షన్ 42.0% ఆక్యుపెన్సీతో రూ.3.10 కోట్లు వసూలు చేసి మంచి ప్రదర్శన కనబరిచింది. తమిళ వెర్షన్ నుంచి రూ.1.10 కోట్లు వచ్చాయి.
ధురంధర్ 2 గురించి
జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ నిర్మించిన ధురంధర్ 2 చిత్రంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా అదరగొట్టాడు. ఈ మూవీలో అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్.మాధవన్ వంటి హేమాహేమీలు నటించడం కలిసొచ్చింది. వాస్తవిక సంఘటనల ఆధారంగా, ముఖ్యంగా 26/11 దాడులకు ప్రతీకారం తీర్చుకుంటూ సాగే అండర్ కవర్ ఆపరేషన్ కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
{{/usCountry}}జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ నిర్మించిన ధురంధర్ 2 చిత్రంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా అదరగొట్టాడు. ఈ మూవీలో అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్.మాధవన్ వంటి హేమాహేమీలు నటించడం కలిసొచ్చింది. వాస్తవిక సంఘటనల ఆధారంగా, ముఖ్యంగా 26/11 దాడులకు ప్రతీకారం తీర్చుకుంటూ సాగే అండర్ కవర్ ఆపరేషన్ కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
{{/usCountry}}మార్చి 19న ధురంధర్ 2 థియేటర్లలో రిలీజైంది. అప్పటి నుంచి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తూనే ఉంది.