ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా.. రెండే పేర్లు వినిపిస్తున్నాయి! అవే.. ‘ధురంధర్’, ‘ఆదిత్య ధర్’. ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. 1 మినిట్ రీల్స్‌ని కూడా సరిగ్గా చూడలేక స్క్రోల్ చేసేస్తున్న నేటి కాలంలో ఏకంగా 7 గంటల సినిమా తీసి, సినిమా మధ్యలో బాత్రూమ్కి వెళితే, ఏం మిస్ అయిపోతామో అనుకుంటూ ప్రేక్షకులు సీట్లకే అతుక్కుపోయే విధంగా ధురంధర్‌ని రూపొందించిన దర్శకుడు ఆదిత్య ధర్‌పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆదిత్య ధర్ పేరు ఇప్పుడు ఒక బ్రాండ్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆదిత్య ధర్ నెట్ వర్త్ గురించి, ఆయన లగ్జరీ లైఫ్ గురించి ఇక్కడ తెలుసుకోండి.
క్రికెట్ పిచ్ నుంచి కెమెరా వెనుకకు..

ఆదిత్య ధర్ ప్రయాణం ఒక సినిమా స్క్రిప్ట్‌లానే ఆసక్తికరంగా ఉంటుంది. దిల్లీకి చెందిన ఈయనకు చిన్నప్పటి నుంచి చదువు కంటే క్రికెట్ అంటేనే ప్రాణం. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా దిల్లీ యూనివర్సిటీ జట్టులో కీలక ఆటగాడిగా ఉండేవారు. ఒకానొక దశలో భారత జాతీయ జట్టుకు ఆడాలని కలలు కన్నారు. అయితే, 2002 ఐసీసీ వరల్డ్ కప్ (న్యూజిలాండ్) ఎంపికలో అవకాశం కోల్పోవడంతో ఆటకు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత దిల్లీలోని స్థానిక థియేటర్లలో కథలు చెప్పడం నేర్చుకుని, 2006లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ముంబై చేరుకున్నారు.
ధురంధర్ 2 : ఆదిత్య ధర్ ఒడిదొడుకులు, విజయం..
ముంబైలో అడుగుపెట్టిన కొత్తలో ఆదిత్య ధర్కి అన్నీ చేదు అనుభవాలే ఎదురయ్యాయి! ఆయన అనుకున్న ప్రాజెక్టులు పట్టాలెక్కకుండానే ఆగిపోయేవి. 'హేరా ఫేరి', 'భూల్ భూలయ్యా' వంటి క్లాసిక్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ మెళకువలు నేర్చుకున్నారు.
కానీ టాలెంట్ ఉన్నోడిని ఎక్కువ రోజులు ఆపలేరు! 'ఉరి' సినిమాతో బాలీవుడ్‌కి బ్లాక్‌బస్టర్‌ని ఇచ్చి, జాతీయ అవార్డు సాధించి, తనేంటో నిరూపించుకున్నారు.
ఆ విజయం యాదృచ్ఛికం కాదని 'ధురంధర్' మ్యూజికల్ హిట్‌తో మరోసారి చాటిచెప్పారు.
ధురంధర్ 2 : ఆదిత్య ధర్ ఆస్తులు, విలాసవంతమైన జీవనం..
ప్రస్తుతం ఆదిత్య ధర్ నెట్ వర్త్ సుమారు రూ. 25 కోట్లు కాగా, ఆయన భార్య, ప్రముఖ నటి యామీ గౌతమ్ ఆస్తి రూ. 100 కోట్లు. వీరిద్దరి మొత్తం ఆస్తి విలువ రూ. 125 కోట్లుగా అంచనా.
{{/usCountry}}ప్రస్తుతం ఆదిత్య ధర్ నెట్ వర్త్ సుమారు రూ. 25 కోట్లు కాగా, ఆయన భార్య, ప్రముఖ నటి యామీ గౌతమ్ ఆస్తి రూ. 100 కోట్లు. వీరిద్దరి మొత్తం ఆస్తి విలువ రూ. 125 కోట్లుగా అంచనా.
{{/usCountry}}ముంబై నివాసం: బాంద్రా వెస్ట్‌లోని 'మిలియనీర్ లేన్'లో రూ. 20 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్ వీరికి ఉంది. ఇందులో ప్రైవేట్ జిమ్, హోమ్ థియేటర్ వంటి అన్ని హంగులు ఉన్నాయి.
చండీగఢ్ డ్యూప్లెక్స్: చండీగఢ్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో వీరికి ఒక ఆధునిక 4 బీహెచ్‌కే ఇల్లు ఉంది. ఇది నార్త్ ఇండియన్ స్టైల్, మినిమలిస్ట్ డెకార్‌తో అలరిస్తుంది.
హిమాచల్ పూర్వీకుల ఇల్లు: పహాడీ మూలాలున్న ఈ జంటకు హిమాచల్ ప్రదేశ్‌లో ఒక పురాతన ఇల్లు కూడా ఉంది. వేసవి సెలవుల్లో వీరు తమ కుమార్తె వృందాతో కలిసి అక్కడ గడుపుతుంటారు.
కార్ల కలెక్షన్: వీరి వద్ద సుమారు రూ. 3 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ , ఆడి క్యూ7 వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.
ఇంత ఆస్తి ఉన్నప్పటికీ, ఆదిత్య ధర్, యామీ గౌతమ్ చాలా సాదాసీదాగా ఉండటానికి ఇష్టపడతారు. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా కుటుంబ సభ్యుల మధ్య అత్యంత సాదాసీదాగా పెళ్లి చేసుకుని ఈ జంట అందరి ప్రశంసలు అందుకుంది.
మరోవైపు రాణ్వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ రూపొందించిన ధురంధర్ 2.. భారత సినీ ప్రేక్షకులను పిచ్చెక్కిస్తోంది. సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్లో చేరిపోయింది. 'ధురంధర్' మేనియా ఇప్పట్లో తగ్గదు కాబట్టి, ఈ సినిమా, మొదటి పార్ట్ కన్నా (రూ. 1300కోట్ల గ్రాస్) ఎక్కువ సంపాదిస్తుందని అంచనాలు ఉన్నాయి.